క్షత్రియులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్షత్రియులు (Kshatriya) అనునది హిందూ మతములోని పురాణాల ప్రకారం చతుర్వర్ణ్యాలలో రెండవది క్షత్రియ వర్ణం. "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ క్షత్రియః" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంథాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులుగా జన్మించారు.నిజమైన క్షతియులు అందరూ అంతరించిపోయారు.ఆదిలో క్షత్రియులు అనునది ఆర్యుల తెగల్లో ఒక చీలికగాయున్నది. ఆర్యుల సమాజం వృత్తిని బట్టి కులవిభజన జరిగినప్పటికీ, తరువాతి కాలంలో గుణమును బట్టి, మధ్యయుగంలో జన్మను బట్టి క్షత్రియ అనే పదము భావించబడింది.[1][2]

చరిత్ర

ప్రారంభ ఋగ్వేద గిరిజన రాచరికం

వైదిక భారతదేశంలోని పరిపాలనా యంత్రాంగానికి రాజన్ అనే గిరిజన రాజు నాయకత్వం వహించాడు.[3] ఇందులో స్త్రీలు కూడా ఉండేవారు. నిజానికి రాజన్ తెగ పశువులను రక్షించేవాడు.ఈ కాలంలో వర్ణ వ్యవస్థ అనేది లేదు.[4][5]

వంశాలు

క్షత్రియులకు వంశాలు 5. అవి ఏమనగా 1. సూర్యవంశం, 2. చంద్రవంశం, 3.అగ్నివంశం, 4. నాగవంశం.

  • సూర్యవంశం : సూర్యుడిని ఆరాధించిన క్షత్రియులు సూర్యవంశీయులైయ్యారు.
  • చంద్రవంశం : చంద్రుడిని ఆరాదించిన క్షత్రియులు చంద్రవంశీయులైయ్యారు.
  • అగ్నివంశం : బధారియ, చౌహాన్, పరిహార్, పన్వర్, సోలంకి, మొదలగు తెగలు అగ్నివంశానికి చెందినవి.
  • నాగవంశం : నాగుపాములను పూజించే తెగ నాగవంశం. వీరు ప్రధానంగా శైవులు. వీరిలో నైర్, బంట్, సహారా, బైస్, నాగ, తక్షక, జాట్ తెగలు ఉన్నాయి.

దేశ, ప్రపంచ వ్యాప్తం గా క్షత్రియ జాతులు

క్షత్రియునిగా జన్మించిన గౌతమ బుద్ధుడు.
  • వాయువ్వ భారతదేశం: అహిర్, జాట్ లు, గుజ్జారులు, రాజపుత్రులు
  • ఈశాన్య భారతదేశం: మణిపురి క్షత్రియ, అహొం, త్రిపురి క్షత్రియ
  • నేపాల్, హిమాలయాలు: పహాడీ రాజపుత్రులు, ఛెత్రి, శ్రేష్ఠ, శాక్య, థకురి, థప
  • దక్కను భారతదేశం: 96 కులి మరాఠాలలో ఒక తెగయైన మరాఠ,
  • తూర్పు భారతదేశం: థాకూర్, ఖండాయత్
  • దక్షిణ భారతదేశం:పల్లవ, శాతవాహన, చోళులు

క్షత్రియ జాతుల వివరణ

జాట్ లు: వీరు పంజాబ్, హర్యానా, బెలుచిస్థాన్, జమ్ము, కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే ఇండో ఆర్యన్ తెగలు. రాజపుత్రుల వలే వీరు కూడా యుద్ధ వీరులు. మహారాజా సూరజ్ మల్ వీరి పూర్వీకుడు. జాట్ తెగలలో 36 రాజవంశాలు ఉన్నాయి.

యాదవ :

యాదవ (అక్షరాలా, యదు నుండి వచ్చిన పురాతన భారతీయ ప్రజలు, చంద్రవంశ వంశానికి చెందిన పురాణ రాజు అయిన యదు నుండి వచ్చిన వారని నమ్ముతారు.

ఈ సంఘం వివిధ వంశాలతో ఏర్పడింది, అభీర, అంధక, వృష్ణి, సత్వతలు, అందరూ కృష్ణుడిని ఆరాధించారు, వారు ప్రాచీన భారతీయ సాహిత్యంలో యదు (యదువంశ) వంశానికి చెందిన భాగాలుగా జాబితా చేయబడ్డారు[6].

గుజ్జారులు (లేక గుర్జారులు) : వీరు ఇండియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో కనిపిస్తారు. గుజ్జారుల జన్మస్థానం తెలియదు. కాని భారతదేశంలో హూణుల పాలన సమయంలో ఉన్నారు. 6 నుండి 12 శతాబ్దాలలో వీరు క్షత్రియులు, బ్రాహ్మణులుగా విభజింపబడ్డారు. దక్షిణ ఆసియాను ముస్లిములు పాలించినప్పుడు వీరిలో చాలా వరకూ ఇస్లాం మతంలోకి చేరారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వీరు వెనుకబడిన తరగతులుగా పరిగణింపబడుచున్నారు. హిందూ గుజ్జారులలో చాలా వర్ణాలు ఉన్నాయి. గుజ్జారులలో చాలా వరకూ సూర్యవంశానికి చెందినవారు. రాజస్థాన్ లో భిన్మల్ అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని కొంత ప్రాంతాన్ని పాలించారు. భారతదేశంలో గుజ్జారులు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పడమర ఉత్తరప్రదేశ్ లలో కన్పిస్తారు.గుజ్జారుల్లో సిక్కులు కూడా ఉన్నారు. గుజ్జారుల్లో రాజవంశాలు - గుర్జార-ప్రతిహార, సోలంకి, చౌహాన్, తోమర, పార్మర, కసన గోత్రీయులు, మరియూ ఛప.

రాజపుత్రులు: ఉత్తర భారతదేశానికి చెందిన యుద్ధ వీరుల్లో ఒక జాతి. వీరు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జమ్ము, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాల్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా కనిపిస్తారు.6 నుండి 12 వ శతాబ్దాలవరకూ పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్, సౌరాష్ట్ర్ర రాజ్యాలు పాలించారు. వీరికి సూర్య, చంద్ర, అగ్ని వంశాలున్నాయి. మహారాణా ప్రతాప్, రాజా మాన్ సింగ్ వంటి ఎందరో మహారాజులు ఈ జాతికి చెందినవారు. సూర్య వంశంలో తెగలు - బైస్ రాజ్పుట్, ఛత్తర్, గౌర్ రాజ్పుట్, ఖచ్వాహ, మిన్హాస్, పఖ్రాల్, పుందిర్, నారు, రాథోడ్, సిసోదియ, సహారన్; చంద్రవంశంలో తెగలు - భటి రాజ్పుట్, భట్టు రాజపుత్రులు, ఛండెల, జాడన్, జడేజ, ఛూడసమ, కతోచ్, భంగాలియ, పహోర్, సవోమ్, తొమార; అగ్నివంశంలో తెగలు - భాల్, చౌహాన్, మోరీ, నాగ, పరమర, సోలంకి.

రాజులు : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి వంటి కోస్తా జిల్లాలలో కనిపించే వీరినే రాజులు అని అంటారు.వీరు బ్రిటిష్ వారి కాలంలో జమీందారులుగా ఉండేవారు.

మణిపురి క్షత్రియులు: వీరు మణిపూర్ రాష్ట్రంలో మైతేయి తెగ, మరో 3 తెగల నుండి ఆవిర్భవించిన వాళ్ళు. క్రీస్తు శకం 1720 లో వీరు హిందూ మతాన్ని స్వీకరించి క్షత్రియులలో కలిసారు. వీరిలో 7 తెగలు ఉన్నాయి.

అహోం: వీరు అస్సాంలో బ్రహ్మపుత్ర లోయ ప్రాంతాన్ని 6 శతాబ్దాలపాటూ, అనగా 1228 నుండి 1826 వరకూ పరిపాలించారు. ఈ సామ్ర్యాజ్యాన్ని చైనాకు చెందిన 'సుఖఫా' అను థాయ్ రాజు స్థాపించాడు. మోరానుల యుద్ధంతో అహోం సామ్రాజ్యం క్షీణించి, బర్మా చేత ఆక్రమింపబడి చివరకు 1826లో బ్రిటీషు పాలనలోకి వచ్చింది. అహోం సామ్రాజ్యాన్ని మొత్తం 41 మంది రాజులు పాలించారు. పురంధర్ సిన్హా అహోం ఆ ఆఖరి రాజు.

త్రిపురి క్షత్రియులు: వీరిలో త్రిపురి, రియాంగ్, జమాతియా, నవోతియ తెగలు ఉన్నాయి. త్రిపుర రాష్ట్రంలో నేటికీ రాచరికపు పాలన కొనసాగుతోంది. బెంగాలీ భాషలో వ్రాయబడిన 'రాజ్ మాల' (త్రిపుర రాజుల వంశావళి) ప్రకారము మాణిక్య సామ్రాజ్యంలో 15వ శతాబ్దం మొదలు 2006 వరకూ 185 మంది రాజులు పరిపాలించారు. బిర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య ఆఖరి రాజు 1947 లో మరణింఛాడు. ప్రస్తుత రాజు - మహారాజా కృత్ ప్రద్యోత్ దెబ్ బర్మన్ మాణిక్య బహదూర్.

పహాడీ రాజపత్రులు: వీరు భారత దేశ పాలన ఉన్న జమ్ముకాశ్మీర్, పాకిస్థాన్ పాలన ఉన్న ఆక్రమిత జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియూ ఉత్తరాఖండ్ లలో ఉన్న పిర్ పింజల్ వాలు ప్రాంతాల్లో నివసిస్తారు. వీరిలో ఇస్లాం మతం స్వీకరించిన వారు కూడా ఉన్నారు. ఇస్లాం మతం స్వీకరించిన రాజపుత్రులను ముస్లిం రాజపుత్రులని అంటారు. పహాడీ రాజపుత్రులలో వంశావళి - బధన్, పరిహార్ రాజపుత్రులు, బైస్, భట్టి, బొంబా, ఛంబియల్, చౌహాన్, చిబ్, దొర్గా/ఛత్తర్, దొమాల్, దౌలీ, జాన్జువా, జర్రాల్, ఖఖా, ఖోఖర్, మంగ్రల్, మన్హాస్, నర్మా, సుల్ హ్రీయా, సా, లాల్హాల్, థాకార్.

ఛెత్రి: వీరు నేపాల్ దేశపు క్షత్రియులు. వీరిలో ఖాసా, థాకూరి వంటి రాజవంశాలు ఉన్నాయి. 16 వ శతాబ్దంలో షా సామ్రాజ్యాన్ని యశో బ్రహ్మ షా అనే వాడు స్థాపించాడు. నేపాల్ లో రాచరికం 1768 లో మొదలయి 2008 వరకూ కొనసాగింది. మొదటి రాజు - మహారాజాధిరాజ పృధ్వీ నారాయణ్ షా. ఆఖరి రాజు - మహారాజాధిరాజ జ్ణానేంద్ర బీర్ బిక్రమ్ షా దేవ్.

శ్రేష్ఠ: నేపాల్ దేశంలో ఉండే వీరు ప్రధానంగా వర్తకులు. 'నెవార్' సంతతికి చెందిన వీరు ఖట్మండులో కనిపిస్తారు.

శాక్యులు: వీరు నేపాల్ దేశాన్ని క్రీస్తు పూర్వం 650–500 మధ్య పాలించారు. వీరిలో ప్రముఖుడు బౌద్ధ మతాన్ని స్థాపించిన సిద్ధార్ధ గౌతముడు (గౌతమ బుద్ధుడు).

థకూరి: వీరు కూడా నేపాల్ ను పాలించిన రాజులు. క్రీస్తు శకం 879 లో రాఘవ దేవ థకూరి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాఘవదేవ తర్వాత నేపాల్ ను 12 వ శతాబ్దం మధ్య వరకూ చాలా థకూరి రాజులు పాలించారు.

థప: థప అనేది నేపాల్ దేశంలో ఛెత్రి మరియూ మగర్ జాతులకు చెందిన ఇంటిపేరు. థప ఛెత్రిలు - టిబెట్, ఉత్తర భారతదేశం,, ఆఫ్ఘనిస్తాన్ దేశాల సంకర జాతి, థప్ మగర్ లు ఉత్తర నేపాల్, దక్షిణ టిబెట్ కు చెందిన వారు. షింటూ సతి నెన్ అనే రాజు కంగ్వాచన్ అనే సామ్రాజ్యాన్ని పాలించాడు. భీమ్ సేన్ థప నేపాల్ మొదటి ప్రధాన మంత్రి.

కులీ మరాఠాలు: మహారాష్ట్ర, గోవా, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపించే వీరిలో 96 తెగలు ఉన్నాయి. భోన్ స్లే తెగకు చెందిన ఛత్రపతి శివాజి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

థాకూర్: వీరు నైరుతి భారతదేశంలో గుర్జార-ప్రతిహార, కుషాణు ల సామ్రాజ్యాల వారసులయి ఉండవచ్చును. థాకూర్ అనే పదాన్ని రాజస్థాన్ రాజపుత్రులు, జాట్ లు బిరుదుగా వాడతారు, బెంగాలలో బ్రాహ్మణులు థాకూర్ పదాన్ని టాగూర్ అనే బిరుదుగా వాడతారు.

ఖండాయత్ లు: వీరు ఒడిశాను 16 వ శతాబ్దంలో పాలించారు. ఖండాయత్ లలో గోవింద విద్యాధర (సా.శ.1542-1559) అనే రాజు గజపతిరాజుల్లో ఆఖరి రాజైన కాఖా రుద్రదేవుడుని హతమార్చి 'భోయ్' సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


తులునాడు క్షత్రియ: వీరినే బంట్స్ లేక బంట్లు అని అంటారు. నాగవంశానికి చెందిన వీరు కర్ణాటకలో ఉన్న తులునాడులో కన్పిస్తారు. అలుపాస్ అనే బంట్లు కేరళలో కాసరగోడు నుండి కర్ణాటకలో గోకర్ణ వరకు బంట్లు 'అల్వ ఖేద' సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీస్తు శకం 450 నుండి 1450 వరకు పాలించారు. ఉడిపి, మంగళూరు, ముంబై లలో కూడా వీరు కన్పిస్తారు. వీరిని నాయక, నాడవ, శాస్త్రే (లేక శెట్టి) అని కూడా అంటారు.

కూర్గులు (కొడవులు) : కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కొడగు జిల్లాలో కన్పించే వీరు వ్యవసాయదారులు, యుద్ధ వీరులు. స్కంద పురాణం ప్రకారం చంద్రవంశ క్షత్రియుడైన చంద్రవర్మ వీరి పూర్వీకుడని చెప్పవచ్చు.

బాలనీయులు: నాగవంశానికి చెందిన వీరు ఇండోనేషియాలో ఉన్న బాలి అనే ద్వీపంలో కన్పిస్తారు. దేవ అగుంగ్ (సా.శ.1686. 1722) బాలి ద్వీపాన్ని 500 సంవత్సరాల క్రితం పాలించాడు. ఇంచుమించు బాలనీయ క్షత్రియులందరూ దేవ అగుంగ్ వారసులే. క్రీస్తు శకం 914లో శ్రీ కేసరి వర్మ దేవ 'వర్మ దేవ' సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 1133 లో శ్రీ జయశక్తి 'జయ' సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

జవనీయులు: వీరు ఇండోనేషియా - జావా ద్వీపంలో కన్పిస్తారు. అక్కడ వీరిని ఖ్బో అని, మహిస అని, రంఘ అని పిలుస్తారు. జావాను పాలించిన రాజుల్లో చాలా మంది వైశ్య కులానికి చెందినవారు. 17 వ శతాబ్దంలో ఇస్లాం దాడుల వలన జావనీయులు అంతరించిపోయారు. ఇప్పుడు జావా ద్వీపంలో కేవలం బాలనీయులు,, ఇతర కులస్తులు మాత్రమే ఉన్నారు.

వైదిక క్షత్రియులకు మూలపురుషులుగా సాధారణంగా సప్త ఋషులు, వారి ప్రవరలు, వంశంలో ప్రముఖ వ్యక్తులు ఉంటారు. వారి పేర్లు గోత్ర నామాలుగా కలిగివుంటాయి.

అనాచార క్షత్రియులు

వైదిక ధర్మములను సనాతన ఆచారముగా లేని క్షత్రియులను అనాచార క్షత్రియులని అంటారు. వీరు ఆర్యులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు భారతదేశంలోకి అడుగుపెట్టే సరికి కొన్ని అటవీ తెగలు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకొన్నాయి. మరికొన్ని తెగలవారు మధ్య యుగంలో రాజ్యాలు పాలించి తమకు తాము క్షత్రియులుగా ప్రకటించుకొన్నారు. వీరందరూ అనాచార క్షత్రియులుగా భావించబడుచున్నారు. మనుధర్మ శాస్త్రములోను, మహాభారత కావ్యంలోను పేర్కొనబడిన కిరాతులు, పులిందులు, గాంధారులు, శాకాలు, యవనులు మొదలైన తెగలవారు అనాచార క్షత్రియులుగా భావించబడుచున్నారు. ద్రావిడ అటవీతెగల్లో ప్రముఖ అటవీతెగ అయిన బోయ వారు, ఇండొనేషియాలో బాలనీయులు, జవనీయులు కూడా ఈ తరహా క్షత్రియులుగా భావించబడుచున్నారు.[ఆధారం చూపాలి]

అపోహలు

  • క్షత్రియులు అనగా ఒక్క రాజపుత్రులు (Rajputs) మాత్రమే అని, ఇంకెవ్వరూ కారని కొందరిలో అపోహ వున్నది[ఆధారం చూపాలి]. ఇందులో వాస్తవం లేదు[ఆధారం చూపాలి]. భారత దేశాన్ని ఎన్నో క్షత్రియ వంశాలు పాలించాయి. అందులో ఉత్తర భారత దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన క్షత్రియుల్లో రాజపుత్రులు ఒకరు, . చాలా మంది శూద్రులు తాము రాజ వంశాల వారం అని చెప్తారు.రాజ పుత్రులు, గుజ్జర్లు విదేశీయులు అనే వాదన ఉంది. వాస్తవానికి గజపతులు తప్ప ఆంధ్ర దేశంలో మిగితా రాష్ట్రాల్లో క్షత్రియులు పూర్తిగా అంతరించి పోయారు. అంతఃపురంలో చిలకల్ని బందీలుగా చేసి అలంకరణార్థం ఉంచడం వలన వాటి ఉసురు తగిలి క్షత్రియులు అంతరించిపోయారు అనేది ఒక నానుడి.[7][8].

మూలాలు

    • Upinder Singh (2017). Political Violence in Ancient India. Harvard University Press. p. 23. ISBN 9780674975279.
    • John McLeod (2002). The History of India. Greenwood Publishing Group. p. 207. ISBN 9780313314599.
  1. Bujor Avari (2007). India: The Ancient Past: A History of the Indian Sub-Continent from c. 7000 BC to AD 1200, p. 89
  2. Renou, Louis (1957). Vedic India. p. 130.
  3. Shori, Maj Gen A. K. "Fifth Shade : Rama as A King". Seven Shades of Rama (in ఇంగ్లీష్). Notion Press. ISBN 978-93-84391-74-4.
  4. Sharma, Ram Sharan (2005). India's ancient past. the University of Michigan: Oxford University Press. pp. 110–112. ISBN 9780195667141.
  5. "The Indo-Aryans of Ancient South Asia: Language, Material Culture and Ethnicity".
  6. Ramchendrier, Collection of decisions of High Courts and the Privy Council applicable to dancing-girls, illatom, etc., Madras, 1892.t J- S. F. Mackenzie, Ind. Ant., IV, 1875</r
  7. Global Encyclopaedia of the South Indian Dalit's Ethnography, Volume 1- edited by Nagendra Kr Singh