బోయ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మానవుడు వేటను జీవనాధారంగా చేసుకొన్న రోజులలో ధైర్య, సాహసాలతో వేటకు వెళ్ళే అటవీ జాతులలో 'బోయ' ఒకటి. భయము లేకుండా వేటకు ఒంటరిగా వెళ్ళే బోయలు వారు భయములేనివాళ్ళు, భాయోళ్ళు, భాయోళ్ళు అని పిలువబడుతూ "బోయ"వాళ్ళు అనివాడుక కొనసాగింది. బోయలను కన్నబాషలో బేడర అని,నాయక అని,తమిళ బాషలో నాయకర్ అని,మలయాళములో"నాయర్"అని పిలుస్తారు.భారతీయ కులవ్యవస్థ విభాగం ప్రకారము సెంట్రల్ లిస్టులో O.B.C లుగా, తమిళ నాడు మరియు కేరళ లలో B.C లుగా, ఆంధ్ర ప్రదేశ్ B.C-A గా,కర్ణాటకలో కేటగిరి 1 గా,అనగా వెనుకబడిన తరగతులుగా గుర్తింపబడుచున్నారు.

పుట్టు పూర్వోత్తరాలు[మార్చు]

హిందూ సాహిత్య పుస్తకాలైన మహాభారతంలోను,సంస్కృత భాగవతంలోను,సంస్కృత మనుస్మృతిలోను,శ్రీ మత్భాగవతంలోను,శ్రీ విష్ణుపురాణములోను ఉత్తరభారత దేశపు అటవీ తెగలైన కిరాతులు,నిషాదులు,నాగులు వంటి అటవీతెగలవారు ప్రస్తావించబడినారు.పోతన తన భాగవతంలో కిరాతులు అను పేరును యధావిధిగా ప్రస్తావించాడు. కొంతమంది తెలుగు కవులు ఈ రచనలను తెలుగులోకి అనువాదము చేసి కిరాతులు అనే పదం బదులు బోయ అని ప్రస్తావించారు. దీనికి కారణం కిరాతుల ధైర్యసాహసాలు దక్షిణభారత దేశంలో ప్రాచీన తెగలైన బోయల్లో కూడా ఉండటమే. ఈ కారణంగా కిరాతులు, బోయవారు ఒక్కరే అని భావన తెలుగువారిలో ఏర్పడింది. ఆచార్య డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావుగారు తాను వ్రాసిన ఆంధ్రుల చరిత్ర లో బోయలు 'మహాతలవరులని" వర్ణించారు. తమ ధైర్య సాహసాలతో భూములను ఆక్రమించి, స్త్రీలను బలవంతముగా అనుభవించే వారు కావున వీరు "భోగికులని" అదే పేరు బోయ అయ్యిందని శ్రీ కంభంపాటి సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు . శ్రీ ఆర్.బి.కిత్తూర "వాల్మీకి వంశజరా"అనే కన్నడ ప్రచురణలో దక్షిణ భారతదేశములోని బోయలు, ఉత్తరభారతదేశములోని రాజ కుటుంబాలు అన్నదమ్ములని, దాయాదులని వ్రాశారు. బోయ అన్నది ఆటవిక కాలములో ధైర్య ,సాహసములకు మెచ్చిఇచ్చిన ఒక బిరుదు అని కంభంపాటి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బోయలు క్షత్రియులు అని జవహరలాల్ యూనివర్సిటీ చరిత్రపరిశోధకులైన ఆచార్య ఛటోపాధ్యాయ అభిప్రాయపడ్డారు.

చరిత్ర[మార్చు]

బోయవారిని "వారియర్స్ అండ్ రూలర్స్" అని ఆంగ్లేయులు అభివర్ణించారు. "రాయ వాచకము" ప్రకారం శత్రువులను తుదముట్టించడానికి విజయనగర సామ్రాజ్యపు రాజైన కృష్ణదేవరాయలు తన మంత్రి అయిన అప్పాజీతో కలిసి విలువిద్యలో సాటిలేని బోయ దొరలను మరియు ఇతర 11 సంస్థానాల సహాయం తీసుకొన్నాడు.అనతి కాలంలోనే బోయ దొరలు కర్నాటకలో రాయదుర్గం, ఆంధ్రదేశంలో కళ్యాణదుర్గం కోటలకు అధిపతులై విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా చేశారు. 10 - 18 శతాబ్దాల మధ్య కర్నాటకలో చిత్రదుర్గ కోట నిర్మాణంలో రాష్ట్రకుటులు, హోయసాలు, చాళుక్యులతోపాటూ బోయ పాలెగార్లు కూడా పాలుపంచుకొన్నారు. చిత్రదుర్గకు ఆఖరి రాజైన మదకారి నాయక 4 మహమ్మదీయుడైన హైదర్ ఆలీ చేతిలో ఓడిపోయాడు. తూర్పు చాళుక్య, విష్ణుకుండిన, కాకతీయ సైన్యాల్లో బోయ తెగలవారు సైనికులుగా కీలక పాత్ర పోషించారు. అయితే వైదిక క్షత్రియులు నిర్వహించే అశ్వమేధ, రాజసూయ వంటి యాగాలు బోయ రాజులు నిర్వహించలేదు.మహమ్మదీయుల రాకతో విజయనగర సామ్రాజ్యం అంతమైన తర్వాత బోయ తెగలవారు ఆలయ శిల్పులుగా, ఆయుధ వర్తకులుగా, సైనికులుగా, భూస్వాములుగా, పూజారులుగా, సముద్ర వ్యాపారులుగా స్థిరపడిపోయారు.

ఉప కులములు[మార్చు]

తూర్పు చాళుక్యుల రికార్డుల ప్రకారం అనగా విష్ణువర్ధనుడు 2 పాలనా కాలంలో కొన్ని బోయ వంశాలవారు బ్రాహ్మణులకు దీటుగా వేదాలు, పురాణాలు చదివి, వైదిక ధర్మాలను ఆచరించి బోయ-బ్రాహ్మణులుగా ప్రకటించుకున్నారు. బోయ-బ్రాహ్మణులను ద్రావిడ-బ్రాహ్మణులు అని కూడా అందురు. ఈ ఉప కులము వారు బ్రాహ్మణ వైదిక ధర్మాలను ఆచరించసాగారు, యజ్ఞయాగాదులు నిర్వహించే వారు. మధ్య యుగంలో కొన్ని బోయ తెగలవారు ఉత్తరభారతంలో కిరాత తెగల చేతిలో పెరిగిన వాల్మీకిని తమ పూర్వీకుడుగా భావించుకొనుట వలన వాల్మీకి-బోయ అను ఉపకులము కూడా ఏర్పడినది. తరువాత పెద్ద బోయ, చిన్న బోయ, బోయ నాయుడు, బోయ నాయక్ లు, బోయ తలారులు వంటి అను ఉప కులాలు కూడా ఏర్పడ్డాయి. బోయలు ఆనాటి స్థితిగతులను, వృత్తి, వ్యాపకములను బట్టి 1.కోవెల బోయలు 2.సింహాసనబోయలు 3.ఆల బోయలు 4.మంద బోయలు 5.గొల్ల బోయలు అని సామాజిక విభజనలు చేసుకున్నారు. కోవెలబోయలు ధార్మిక కార్యక్రమములను నిర్వహిస్తూ, వేదములను చదువుకునెడి వారు. సింహాసనబోయలు ప్రజా రక్షణ, పరిపాలన గావిస్తూ, క్షత్రియ ధర్మాలను ఆచరించేవారు. ఆల బోయలు ఆవులను కాస్తూ, పాడిపంటలను కొనసాగించే వారు. మందబోయలు ప్రజల ఆరోగ్యమునకై పాటు బడుతూ మందులను ఆకుల, వేర్ల, కాండములతో తయారు చేసి ఇచ్చేవారు. గొల్ల బోయలు గొర్రెలు, మేకలను పోషించేవారు. ఈ సామాజికవిభజనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బోయ =భయములేని వారు: క్షత్రియ=క్షాత్రము కలిగినవారు: ఊరుబోయ=గ్రామాలు, నగరాలలో నివసించే బోయలు: మ్యాసబోయలు=గడ్డి గల నేలల్లో, అడవులలో నివసించే బోయలు: సూర్యబోయలు=సూర్యవంశస్థులైన బోయలు: చందనబోయలు=చంద్ర వంశబోయలు: త్రికోటిబోయలు=నక్షత్రవంశబోయలు: కోవెలబోయలు=దేవాలయాలలో పూజా కార్యక్రమములు నిర్వహించే బోయలు, వీరు వేదము నేర్చుకొని, యజ్ఞ, యాగాదులు నిర్వహించి “శర్మ” అనే పేరు కలిగి ఉంటారు.వీరే “బ్రాహ్మణు”లైనారు. సింహాసనబోయలు:వీరు సైనికులు,నాయకులు,మండలాధీశ్వరులు,పాలయగార్లు,నాయకరాజులు.వీరే “రాజులు “అయినారు. ఆలబోయలు:వీరు ఆవులను కాచుకునేవారు,వీరే గో అంటే ఆవుల గురించే ఎక్కువగా మతి అనగా ఆలోచన కలిగి ఉండేవారు.గోమతులు-కోమటులు అయి కోమట్లు అయింది.వీరే”వైశ్యులై”నారు గొల్లబోయలు:గడ్డి నేలల్లో గొర్రెలను,మేకలను పెంచుకునే వారిని “గొల్ల బోయలు” అన్నారు.వీరే “గొల్లలు”అయినారు. మందబోయలు:అడవులలో దొరికే ఆకులు, కాండములు, లతలు, వేర్లు ఉపయోగించి మందులను తయారు చేసి వైద్యము చేసే వారు. పెద్దబోయలు:వీరు అడవి జంతువులను వేటాడములో నిష్ణాతులు.అడవి దున్న, ఎద్దులను పట్టుకొని వాటిని ఆహారముగా తీసుకునే అలవాటు గలవారు. చిన్నబోయలు;వీరు ఆవులను కాచుకొనే వారు.వ్యవసాయము, వ్యాపారము సాగించే వారు. సదరుబోయలు:వీరు రైతు కూలీలుగా, పొలము, ఇంటిపనుల సహాయకులుగా పని చేసే వారు.

ఆచార వ్యవహారాలు[మార్చు]

సర్ ఎడ్వర్డ్ తర్ద్స్టున్ ప్రకారం బోయ తెగల్లో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి,16 రకాల షోడశ ఉపచార ఆచార వ్యవహారాలు ఉన్నాయి.వివాహ విధుల్లో ఈ ఉపకులాల మధ్య కూడా ఎన్నో తేడాలు ఉన్నాయి.కొన్ని బోయ ఉప కులాల్లో ఆచార వ్యవహారాలు, వివాహ విధులు వైదికత్వానికి భిన్నంగా ఉంటాయి.ఉత్తర కర్నాటక, తెలంగాణాలో కనిపించే భేదార్ అను బోయ తెగవారు తిరుపతి వెంకటేశ్వరుడు, శివుడు, రాముడు, విష్ణువు, కృష్ణుడు, హనుమంతుడు వంటి ప్రధాన దేవుళ్ళనే కాకుండా ఎల్లమ్మ, పోచమ్మ, బాలమ్మ, మైసమ్మ, మరియమ్మ, నాగమ్మ వంటి గ్రామ దేవతలను కూడా ఆరాధిస్తారు.

ప్రస్తుత స్థితి[మార్చు]

ప్రపంచీకరణ వల్ల నేడు బోయ తెగలవారు తమ వేట వృత్తిని, ఆహారపు అలవాట్లను విడిచి పెట్టి విద్యాబుద్ధులై రాజకీయ, విద్య, వైద్య, వాణిజ్య, సినిమా, వ్యవసాయ, ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్నారు.భారత రాజ్యాంగం ప్రకారం ఇతర కులాల మాదిరిగా సమాన హక్కులు పొందుచున్నారు.

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రుల చరిత్ర-ఆచార్యడా.బిఎస్ఎల్ హనుమంతరావు
  2. ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర-ఆచార్య ఖండవల్లి లక్ష్మి నిరంజనం, శ్రీ బాలేందు శేఖరం
  3. ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి-శ్రీకంభంపాటి సత్యనారాయణ
  4. castes and tribes of southern India-sir Edgard Thurdstun and Rangachary
  5. వాల్మీకి వంశాజర (కన్నదబాషలో) -శ్రీఆర్.బి.కిత్తూర

యివికూడా చూడండి[మార్చు]

లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బోయ&oldid=1999198" నుండి వెలికితీశారు