గుమ్మునూరు జయరాం
పెంచికలపాడు జయరాం | |||
![]()
| |||
కార్మిక, ఉపాధిశిక్షణ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 మే 2019 | |||
ముందు | పీతాని సత్యనారాయణ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | వీరభద్ర గౌడ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గుమ్మునూరు గ్రామం , కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | 1968 అక్టోబరు 16||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (2011- ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | ప్రజా రాజ్యం పార్టీ (2009-2011) | ||
తల్లిదండ్రులు | పెంచికలపాడు బసప్ప, శారదమ్మ | ||
జీవిత భాగస్వామి | గుమ్మనూరు రేణుక (1989) | ||
సంతానం | పెంచికలపాడు ఈశ్వర్,ఇద్దరు కుమార్తెలు | ||
పూర్వ విద్యార్థి | మునిసిపల్ బాయ్స్ హై స్కూల్, బళ్ళారి, కర్ణాటక రాష్ట్రం |
గుమ్మునూరు జయరాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. జయరాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధిశిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]
రాజకీయ జీవితం[మార్చు]
గుమ్మునూరు జయరాం 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2005లో చిప్పగిరి మండల జెడ్పీటీసీగా గెలుపొందాడు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యాం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. జయరాం 2011లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు.[3] ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధిశిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4][5]
మూలాలు[మార్చు]
- ↑ Mana Telangana (8 June 2019). "కొలువుదీరిన ఎపి కొత్త మంత్రులు..." Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ The Hans India, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolios". www.thehansindia.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
- ↑ 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)