హొయసల సామ్రాజ్యం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
క్రీ.శ.1200లో హొయసల సామ్రాజ్య విస్తృతి
బేలూరులోని ఈ శిల్పం హొయసాల రాజ్య చిహ్నాన్ని సూచిస్తుంది
హోయసల రాజుల కాలంనాటి బేలూరు చెన్నకేశ్వరాలయం

పరిచయం[మార్చు]

హొయసల సామ్రాజ్యం (కన్నడ: ಹೊಯ್ಸಳ ಸಾಮ್ರಾಜ್ಯ) (Hoysala Empire) 10 నుండి 14వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో ఒకటి. హోయసలు (లేక వర్నాటులు) చోళులలో ఒక శాఖకు చెందిన సూర్యవంశపు క్షత్రియులు. క్రీస్తు శకం 12 వ శతాబ్దంలో మొదటి భల్లాలుడు చాళుక్య సామంతుడై బేలూరు రాజధానిగా చేసుకొని పాలించాడు. తరువాత రాజధాని హళిబేడు (ద్వారసముద్రము) కు మారినది.

భల్లాలుడు అనంతరం అతని తమ్ముడు విష్ణువర్ధనుడు అను బిట్టి దేవుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు క్రీస్తు శకం 1131 నాటికి రాజ్యాన్ని ఆంధ్ర ప్రదేశ్లో కృష్ణా నది వరకూ విస్తరింపజేశాడు. ఇతని మనవడైన రెండవ వీర భల్లుడు 1193 లో స్వతంత్ర సామ్రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడు, ఇతడి కుమారుడైన సోమేశ్వరుడు క్షీణ దశలో ఉన్న చోళులకు సాయం చేశారు. సోమేశ్వరుడు తన పెద్ద కుమారుడగు మూడవ నరసింహునికి రాజ్యాన్ని వదలి కన్నునూరు వద్ద క్రొత్త పట్టణాన్ని నిర్మించి రెండవ కుమారుడైన రామనాధునితో అక్కడ స్థిరపడ్డాడు. సోమేశ్వరుడు పాండ్యుల చేతిలో మరణించాడు. ఇతని కుమారులు రాజ్యాన్ని పంచుకున్నారు. నరసింహుడి కుమారుడైన మూడవ వీర భల్లాలుడి కాలంలో రాజ్యభాగాలు రెండూ ఏకమయ్యాయి. 1342 లో మూడవ వీరభల్లాలుడు మహమ్మదీయుల చేతిలో స్వర్గస్తుడైయ్యాడు. ఇతడి కుమారుడు కొంతకాలం రాజ్యమేలాడు. హోయసల సామ్రాజ్యం ఇతనితో క్షీణించిపోయింది.

మొగల్తూరు సంస్థానం స్థాపన[మార్చు]

వీర భల్లాలుడి వంశస్తుడైన ఝల్లిగడ్డ గంగరాజు [1] హైదరాబాద్ నవాబు కొలువులో సర్దార్ గా పరాక్రమం చూపించాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో చెలరేగిన పితూరీలను, అలజడులను అణచివేయడానికి గంగరాజును కొంత సైన్యంతో పంపాడు నవాబు. తర్వాత గంగరాజు కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో స్థిరనివాసం ఏర్పరచుకొని క్రమేణా 1608 లో మొగల్తూరు సంస్థానాన్ని స్థాపించాడు.

కళలు[మార్చు]

హొయసల శకంలో దక్షిణ భారతదేశంలో కళలు, శిల్ప కళాశైలి, సంస్కృతి చాలా అభివృద్ధి చెందాయి. ఈ సామ్రాజ్యము నేటికీ అద్భుతమైన హొయసల శిల్పానికి చిరస్మరణీయం. బేలూరులోని చెన్నకేశవాలయం, హళిబేడులోని హొయసలేశ్వరాలయం, సోమనాథపురంలో చెన్నకేశవాలయం వంటి ప్రసిద్ధ ఆలయాలతో పాటు కర్ణాటకంతటా విస్తరించి నేటికీ నిలిచి ఉన్న వందకు పైగా దేవాలయాలు హొయసల శిల్పకళకు తార్కాణం. హొయసల రాజులు లలిత కళలను కూడా ప్రోత్సహించి చేయూతనిచ్చారు. వీరి ఆదరణ వలన కన్నడ మరియు సంస్కృత సాహిత్యాలు వెల్లివిరిశాయి.

మూలాలు[మార్చు]

లంకెలు[మార్చు]

http://en.wikipedia.org/wiki/Hoysala_Empire