యాదవ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి. వారిలో యాదవ అనేది ఒక ప్రాచీన తెగ. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు చంద్రవంశపు రాజులని ప్రస్తావన ఉన్నది. వృషిణి అను తెగకు చెందిన యాదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చినది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు మాత్రమే. యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో కనిపిస్తారు.

==

శీర్షిక పాఠ్యం[మార్చు]

==

గోత్రములు[మార్చు]

అఫారియ, అహ్లవత్/అహ్ల, అరుకవల్, బద్గర్, భగ్తిహ, భతోతియ, భలేరావ్, బల్వాన్, బిక్వాలియా, భిల్లాన్, బకియ, బదారియ, బద్గిర్/బద్గారియ, బనియ, బిచ్వాల్, భాటియా/భాటి, భమస్ర, భంకోలియా, బమోరియా, బిస్వార్, చౌర, చండేల/చండేల్, చౌహాన్, చిటోసియ, చిక్న, చోర, దగర్, దూసద్, దహియ, దెహ్రాన్, దతర్త, దేశ్వాల్, దభర్, దందోలియ, దైమ, దదాన్, ఇకోసియ, ఫతల్, గంగానియ, గౌర్, ఘోషి, గొగాద్, గ్వాల్ వంశ్, గున్ వాల్, గుర్వాలియ/గుర్వాడియ, గిరాద్, హరర్ద్, హర్బ్ల/హర్బాలా, హుదిన్ వాల్, హిన్ వాల్, జద్వల్, జగ్దోల్య, జగ్రోలియ, ఝవత్, జగ్దోలియ, జదవ్, జడేజ, ఝరోదియ, కకష్ / కక్కష్, కాస్యప్, కాన్ వి, ఖోలిద, కృష్టాత్, ఖోస్య, కుషగర్, ఖోల, కలలియ, ఖైలియవ్, ఖెర్వాల్, ఖోర్, ఖర్, కదైన్యా, కక్రాలియ, కథి/కథియ, ఖేశ్వాల్, కమరియ, ఖర్షన్, కల్గన్, లంబ, మాందైయ, మందల్, మరఠా, మొతల్, మథ, మెథానియ, మెహతా, మొతన్, మహలె, మహ్లా/మహ్లావత్, నందగోపాల్, నైనన్, నర్వారియ, నిర్మాన్, నంగానియ, పనిహర్, పవాలియ, పచ్వానియ, పచెరియ, ఫతక్, పల్, రావత్/రౌత్, సందిల్, శౌండిల్య, సౌనారియ, సిగారియ, సప, సుల్తానియ, సిసోటియ, తెరాకియ, తొమార, తుక్రాన్,నల్లందుల,తునిగిందల,పొగుదెల,తిరుమల

ఇతిహాసాల్లో ప్రస్తావన[మార్చు]

సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు యదువంశస్థులు. యాదవ వంశము అనేకశాఖలు కలిగి మిక్కిలి ప్రసిద్ధులు అగు రాజులను పలువురను కలిగి ఉండెను. అందు యదువునకు జ్యేష్ఠపుత్రుఁడు అయిన సహస్రజిత్తునుండి హేహయ వంశము ఆయెను. వారికి మాహిష్మతి ముఖ్యపట్టణము. ఆవంశమున కార్తవీర్యార్జునుఁడు మిగుల ప్రసిద్ధికి ఎక్కిన రాజు. అతని వంశస్థులు తాళజంఘులు అను పేర వెలసిరి. యదుని రెండవ పుత్రుఁడు అగు క్రోష్టువు వంశమున ప్రసిద్ధికి ఎక్కినరాజులు శశిబిందువు, జ్యామఘుఁడు, విదర్భుఁడు. వారలలో విదర్భుఁడు విదర్భరాజు వంశస్థాపకుఁడు ఆయెను. అతని మూడవ కొమరుని నుండి చేదివంశము వచ్చెను. రెండవ కొమరుని వంశస్థుఁడు అగు సాత్వతుని నుండి భోజవంశమును, అంధకవంశమును, వృష్ణివంశమును కలిగెను. అందు భోజవంశస్థులు ధారాపురాధిపులు అయిరి. అంధక వంశమున కృష్ణుఁడు పుట్టెను. వృష్ణివంశమున సత్రాజిత్తును సాత్యకియు పుట్టిరి.

అపోహ[మార్చు]

యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, గొల్ల అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. భారతదేశ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పద్దతిని సులభంగా అమలుపర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని జీవించే తెగలవారందరిని 'యాదవ ' అను వర్గంగా పేర్కొన్నది. అలాగే సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు కిరాతులను బోయవారిగా పేర్కొన్నట్టే యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది, శ్రీకృష్ణ యాదవ సంఘములు కూడా ఏర్పడినవి. అందుకు గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకోవడం జరుగుచున్నది. వాస్తవానికి ఆచార వ్యవహారాలు, గోత్రాలు, గృహనామాల విషయాల్లో గొల్లవారికి, యాదవులకు ఎటువంటి సంబంధములు లేవని చరిత్రకారుల ఆభిప్రాయం.[ఆధారం కోరబడినది]

ఇంకా చదవండి[మార్చు]

గొల్ల

లంకెలు[మార్చు]

https://en.wikipedia.org/wiki/Yadava

"http://te.wikipedia.org/w/index.php?title=యాదవ&oldid=1422327" నుండి వెలికితీశారు