గొల్ల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భారతదేశంలోని పశువులను, గొర్రెలను మేపుకొనే తెగలు (Cattle herding tribes) చాలా ఉన్నాయి. అందులో గొల్ల అనేది దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక సామాజిక కులము. వ్యవసాయం మరియు పశు పోషణ వీరి ప్రధాన వృత్తి. భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో కనిపించే వీరు జనాభా పరంగా ముందు వరుసలో వున్నా 1980 వరకు చదువులో వెనుకబాటు వలన ఆర్థికంగా దక్షిణ భారత దేశంలో వెనుకబడి ఉన్నారు.

పుట్టుపూర్వోత్తరాలు[మార్చు]

భారతదేశంలో పశుపోషణ ప్రధాన వృత్తిగా కలిగిన తెగల్లో గొల్ల తెగ ఒకటి. గొల్ల తెగ పుట్టుపూర్వోత్తరాలు గురించి చరిత్రకారుల్లోను, సాహిత్యవేత్తల్లోను ఎన్నో భిన్నాభిప్రాయములున్నవి. హిందూ పురాణ సాహిత్యం ప్రకారం వీరు అంధక అను వంశమునకు చెందినవారని [1][2][3], గొల్ల అనే పదము కొద్దిమంది గోపాల అనే సంస్కృత పదమునుండి వచ్చిందని చెబుతారు. మరి కొద్దిమంది గొడ్లవారు, గావ్లి, గుర్లవారు అనే పదాలనుండి గొల్ల అనే పదం వచ్చిందని అంటారు. ఇతర కులస్తులతోను కలిసిపోతారని, గొల్లవారి ఆచారవ్యవహారాలు ఉంటాయని, గోపాల అను సంస్కృత నామ పొట్టి రూపమే గొల్ల అని చరిత్రకారుడు H.A Stuart అభిప్రాయపడ్డారు.

శాఖలు[మార్చు]

గొల్లవారిలో ఎర్రగొల్లలు, బోయ గొల్లలు, యయ గొల్లలు, పాకనాటి గొల్లలు, పూజ గొల్లలు, ముష్టి గొల్లలు, మొదటి గొల్ల, ముద్ర గొల్ల, సాలె గొల్ల, సర్స గొల్ల, ఆది గొల్ల, గురజాతి గొల్ల, ఆలె గొల్ల, పెద్వాటి గొల్ల, మంద గొల్ల, యాదవ గొల్ల, కర్ణ గొల్ల, కురుమ గొల్ల లేక కురుబ గొల్ల. 

గోత్రాలు[మార్చు]

Kanukula, Paalavelli, Nethilla,PEDEEYALA,నల్లందుల.కొలకుల, ముత్యాల , సిరిచాపల, దుల అగ్ని, ఆరుద్ర, అక్షితల, పెడేంద్ర (గోపిదేశి), గుమ్మ, బూదాల, కలమంద, ఆవుల, చింతల, చెవ్వుల, గుండల, గుర్రం, గొర్రెల, గోరంట్ల, కోకల, కఠారి, మూగి, నక్కల, సద్దికూడు, సేవల, నానపాలు, ఉల్లిపాయల, వంకాయల, ఆరుకట్ల, బూదాల, వీరదాళ్ళ (యీరదాళ్ళ), కోనాల, ఈరదాల్ల, చేకొల్ల [4] తినిమిందల, వలవల, సొలోలా పావిల్ల ఉత్తడ్ల, జమ్ముల, ,కరివేముల మాన్యవుల,పాలంజి , పాలాంద్ర , తానందల, వెయ్యావుల

మందెచ్చుల వారు[మార్చు]

వెనుకబడిన తరగతులలో దాదాపు 22 కులాలకు యాచకవృత్తి కావడం గమనార్హం. కాగా బీసీ కులాలలో మరికొన్ని కులాలు ప్రత్యేకించి కొన్ని కులాలను మాత్రమే యాచిస్తాయి. ఇటువంటివాటిలో గొల్ల, కురుమ(kurumagolla) లనుయాచించే కులస్తులు మందెచ్చులవాళ్లు. మందెచ్చులవారిని బొమ్మలాటవాళ్ళు, పొదపొత్తులవాళ్ళు, పొదరులు, పొగడపొత్తర్లు అని కూడా పిలుస్తారు [5]. గొల్ల, కురుమల దగ్గర మాత్రమే యాచి స్తారు[6]. యాచనలోనూ కులతత్వం వీరి తరతరాల ఆచారం. గ్రామా లకు వెళ్లినా గొల్ల, కురుమ( kurumagolla) వాడలలోనే నివ సిస్తారు. మందెచ్చుల వాండ్లు తెలంగాణ ప్రాంతంలోని ప్రధానంగా నల్గొండ, వరం గల్‌, మెదక్‌ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తారు.మందెచ్చుల వారిలో పురుషుడు గొల్లపెద్దలను పొగుడుతూ రాగయుక్తంగా పాటలు పాడతాడు. అతని వెనక అతని భార్య తాళం వేస్తూ వంత పాడుతుంది. పాటలో గల వేగం కట్టిపడేస్తుంది. గొల్ల, కురుమ(kurumagolla) కులానికి చెందిన వారు చనిపోతే అక్కడ మందెచ్చు లవాండ్లు హాజరవుతారు. శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో పాడెకు ముందు భాగంలో నడుస్తూ కొమ్ము బూర ఊదుతూ, డోలువాయిస్తూ నడుస్తారు. ఆ తర్వాత మందెచ్చులవాళ్లు ఆ ఇంటి గొల్లపెద్దల కథలు ప్రత్యేక తీరులో చెపుతారు . కథానాయకుడు ఒక చేత కట్టె పట్టుకుని, మరో చేత్తో చిడతలు వాయిస్తూ, కాళగజ్జెల చప్పుడు చేస్తూ, సహచరునితో ముందు నిలుచుంటాడు. అతని వెనక ఇద్ద రు వంతలు పాడేవారు, ముందు వరస వారితో వెనుక వరసవారు పోటీపడుతూ కథ నడుపు తారు. గంగ రాజు కథ, పెద్దిరాజు కథ, కాటమ రాజుకథ ఇలా గొల్ల, కురుమ(kurumagolla) పెద్దల కథలు చెప్పి అక్కడివారిని ఆనందపరుస్తారు. కథ పూర్తయ్యాక ఆ వాడలో ఉన్న ప్రజలు కొంత ధనం ఇస్తారు. ఇంతకు ముందు గొఱ్ఱెలను మేకలను సంభావనగా ఇచ్చేవారు.

ఆచార వ్యవహారాలు[మార్చు]

వీరు ప్రధానంగా భూస్వాములు, గొర్రెలను - మేకలను మేపుకుంటారు. స్త్రీలు కూడా వ్యవసాయంలో పాలుపంచుకుంటారు, జానపద నృత్యాలు వేయడంలో నేర్పరులు. పిల్లలు పుట్టిన 21 రోజులకు నామకరణ చేస్తారు.

As a community they practice community endogamy and Gotra exogamy. Bride price is a prevalent practice. The women wear vermilion, a thali and toe rings as symbols of marriage. Naming ceremonies are observed on the twenty-first day after birth. The dead are cremated and a purification ceremony is observed on the tenth day. Child labour is prevalent among the Golla.

గొల్లవారు మంగళ, రాజమ్మ, కంచర్లమ్మ, గంగమ్మ, mysamma thalli ,renukamma ,అంకమ్మ దేవతలనుమరియూ కృష్ణుడిని ఆరాధిస్తారు. దొల పూర్ణిమ, రథయాత్ర, గణేష్ పూజ, లక్ష్మీపూజ,kanaka jayanti వంటి పండుగలు జరుపుకుంటారు. వ్యవసాయ సంబంధ పనిముట్లను కూడా పూజిస్తారు. మనిషి చనిపోయిన తర్వాత 11 వ రోజు మైలు కూడా ఆచరిస్తారు. గొల్లవారు 'అన్నా, 'అయ్యా, 'నాయుడు ' అనే పదాలను గౌరవసూచకంగా వాడతారు.

ప్రస్తుత స్థితి[మార్చు]

నేడు రాజకీయ, సినిమా, వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పురోగమిస్తున్నారు.

ప్రముఖులు :[మార్చు]

 • యనమల రామకృష్ణుడు, ఆర్థిక మంత్రి
 • రాజ్ గోపాల్ యాదవ్
 • బండారు దత్తాత్రేయ (కురుమ గొల్ల లేక కురుబ గొల్ల)
 • R.krishnaiah all India bc chairman ( kurumagolla or kuruba)
 • Doddi komaraiah ( kurumagolla) from Telangana ( tribal hakkula kosam poradina veerudu)
 • Sangoli Rayanna ( freedom fighter from Karnataka) ( kuruba or kurumagolla)
 • అంజన్ కుమార్ యాదవ్
 • కొలుసు పార్థసారథి
 • కె.వి.నాగేశ్వరరావు
 • ఎన్.రఘు వీరా రెడ్డి, పిసిసి చీఫ్ (kurumagolla or kurubagolla or kuruva)
 • తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ సినీమాటొగ్రఫి మంత్రి
 • కృష్ణ యాదవ్, తెలుగుదేశం నాయకుడు
 • కన్నెబోయిన అనిల్ కుమార్ యాదవ్ ( వ్యాపారవేత్త, కార్పొరేటు నిర్వాహకుడు )
 • చక్రపాణి యాదవ్, శాసనమండలి చైర్మన్
 • జె.కె.శేఖ‌ర్‌యాద‌వ్ (జ‌గ‌ద్గిరిగుట్ట‌), బీసీ సంఘ‌ర్ష‌ణ స‌మితి రంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడు, తెలంగాణ రాష్ట్ర స‌మితి, కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడు..
 • పార్ధసారధి రావు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు యూనియన్ మెంబర్
 1. Stella Kramrisch (January 1994). The Presence of Siva. Princeton University Press. pp. 375–. ISBN 978-0-691-01930-7. Retrieved 28 August 2013
 2. Charles Dillard Collins (1 January 1988). The Iconography and Ritual of Siva at Elephanta. SUNY Press. pp. 58–. ISBN 978-0-7914-9953-5. Retrieved 28 August 2013
 3. George M. Williams (27 March 2008). Handbook of Hindu Mythology. Oxford University Press. pp. 54–. ISBN 978-0-19-533261-2. Retrieved 28 August 2013
 4. Edgar Thurston. Castes and tribes of southern India
 5. Art and Culture of Marginalised Nomadic Tribes in Andhra Pradesh By P. Sadanandam
 6. "గొల్ల కురుమల దగ్గరే యాచన". సూర్య. 2012-07-12. Retrieved 2015-01-29. 

www.golla's in ANDHRAPRADESH and Telangana.com

లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గొల్ల&oldid=2314525" నుండి వెలికితీశారు