Jump to content

సత్రాజిత్తు

వికీపీడియా నుండి
సత్రాజిత్తు
సత్యభామను కృష్ణుడికి సమర్పిస్తున్న సత్రాజిత్తు
Information
కుటుంబంNighna (father)
ప్రసేనుడు (సోదరుడు)
పిల్లలుసత్యభామ
Dynastyయదువంశం

సత్రాజిత్తు సత్యభామ తండ్రి. ఈ సత్రాజిత్తు నిమ్నుని కుమారుడు.[1]

శమంతకమణి కథ

[మార్చు]

ఆయన ఒక రోజున స్నానము చేస్తూ ఉదయిస్తున్న బాలభాస్కరుని స్తోత్రము చేస్తాడు. దాంతో సూర్యుడు సంతోషపడ్డాడు. మెచ్చి సత్రాజిత్తునకు శమంతక మణిని కూడా ఇచ్చాడు. ఒకసారి ఆ మణిని తనకిమ్మని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని అడిగాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. అయితే సత్రాజిత్తునికి ప్రసేనుడనే సోదరుడున్నాడు. ఆ సోదరుడే మణిని ధరిస్తూ ఉండే వాడు. అలా మణిని వేసుకుని అడవిలోకి వెళ్లిన ప్రసేనునిపై సింహం దాడి చేసి చంపేస్తుంది. మణిని పట్టుకుపోతుంది.

కానీ శ్రీకృష్ణుడే మణి కోసం ప్రసేనుని చంపినాడని సత్రాజిత్తు నిందవేస్తాడు. అయితే శ్రీకృష్ణుడు తనపై పడ్డ అపవాదుని పోగొట్టుకోవడానికి శమంతక మణిని వెతికాడు. సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుని చంపి సింహం ఆ మణిని తీసుకుని పోయింది. ఆ సింహాన్ని చంపి మణిని తనతో తెచ్చుకున్నాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణి కోసం జాంబవంతునితో యుద్ధం చేశాడు. శమంతక మణిని గెలుచుకున్న శ్రీకృష్ణుడు తిరిగి ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చేశాడు.

సత్రాజిత్తు జరిగిన విషయం తెలుసుకుని శమంతకమణితోపాటు కూతురు సత్యభామను శ్రీకృష్ణునకు ఇచ్చాడు. శ్రీకృష్ణుడు మణిని తిరిగి సత్రాజిత్తునకిచ్చి సత్యభామను పెళ్ళి చేసుకున్నాడు.

మరణం

[మార్చు]

శ్యమంతక మణిని ఇవ్వడం సత్రాజిత్తుకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదని గ్రహించిన కృష్ణుడు, ఆ మణిని అతడికే తిరిగి ఇచ్చివేశాడు. అప్పటి నుండి శ్యమంతక మణి సత్రాజిత్తు భవనంలోనే ఉంది. కృష్ణ బలరాములు ద్వారకలో లేని సమయం చూసుకుని శ్యమంతక మణిని తస్కరించడానికి కుట్ర జరిగింది. సత్యభామ తమకు దక్కలేదనే అక్కసుతో ప్రణాళిక వేసిన శతధన్వుడు మొదలైన వారితో పాటు ఆ మణి కృష్ణుడికే చెందాలని అభిలషించిన అక్రూరుడు, కృతవర్మ కూడా కుట్రదారులతో చేతులు కలిపారు. కుట్రలో భాగం వహించిన రాకుమారులు, సత్రాజిత్తును చంపి శ్యమంతక మణిని దొంగిలించవలసిందిగా శతధన్వుడిని ప్రోత్సహించారు. ఒకరోజు రాత్రి తన మందిరంలో నిద్రిస్తున్న సత్రాజిత్తును శతధన్వుడు కిరాతకంగా నరికి చంపాడు.[2]

శతధన్వుడు సత్రాజిత్తును చంపివేసి మణిని తీసుకుని పారిపోయి కృతవర్మ, అక్రూరుల వద్దకు వెళ్ళగా ఇద్దరూ కృష్ణుడు నిన్ను వదలడు, ఎప్పుడూ మా దగ్గర కనపడకు అన్నారు. శతధన్వుడు తెల్లబోయాడు. మణి దగ్గర ఉన్నదంటే దానినుండి ప్రకాశం వచ్చే ప్రకాశం వల్ల ఎక్కడ వున్నా తన ఉనికిని పట్టేస్తారు. అందుకని మణిని అక్రూరుని యింట్లో పడవేసి శతధన్వుడు పారిపోయాడు. సత్రాజిత్తు మరణ వార్తవిని కృష్ణుడు వెంటనే వచ్చి అంత్యేష్టి సంస్కారమును చేశాడు. సత్రాజిత్తు చివరకు ఆ మణి వలననే చచ్చిపోయాడు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]