పాలేటి రామారావు
పాలేటి రామారావు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం మాజీ శానస సభ్యుడు, మాజీ మంత్రి. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశాడు. అతను ప్రస్తుతం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. [1]
రాజకీయ జీవితం
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం సంఖ్య | శాసనసభనియోజకవర్గం | శాసనసభనియోజకవర్గం రకం | గెలిచిన అభ్యర్థి | స్త్రీ/పురుష | పార్టీ | పోలైన ఓట్లు | సమీప ప్రత్యర్థి | స్త్రీ/పురుష | పార్టీ | పోలైన ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2004 | 111 | చీరాల | GEN | కె.రోశయ్య | పురుష | కాంగ్రెస్ | 73497 | పాలేటి రామారావు | పురుష | తే.దే.పా | 43420 |
1999[2] | 111 | చీరాల | GEN | పాలేటి రామారావు | పురుష | తే.దే.పా | 60806 | అంజలీ దేవి గోలి | స్త్రీ | కాంగ్రెస్ | 47298 |
1994[3] | 111 | చీరాల | GEN | పాలేటి రామారావు | పురుష | తే.దే.పా | 54039 | కె.రోశయ్య | పురుష | కాంగ్రెస్ | 50433 |
మరణ వేడుకలు
[మార్చు]అతనికి 75 సంవత్సరాలు బ్రతకాలని ఉందని తన 63 వ యేట నుండి ప్రతీ సంవత్సరం అతని పుట్టిన రోజును పురష్కరించుకొని మరణదిన వేడుకలకు ఆహ్వానంటూ ఇన్విటేషన్ కార్డులను కొట్టించారు. ఇన్విటేషన్ కార్డులో ఇప్పటికి తనకు 63 ఏళ్లు పూర్తతాయని, ఇక జీవించేది 12 సంవత్సరాలు అని జోస్యం చెప్పాడు. 1959వ సంవత్సరంలో పుట్టానని, 2034లో మరణం ఉంటుందని ఆహ్వాన కార్డులో రాశాడు. 2022 నవంబరు 17న జరుపుకునేది 12వ మరణ దినోత్సవం అని పేర్కొన్నాడు. ఇక్కడ నుంచి 12 ఏళ్లు మాత్రమే జీవిస్తానని ప్రకటించాడు. చీరాల ఎ.ఎం.ఐ హాలులో అతని మరణ దిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. [1][4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Desam, A. B. P. (2022-12-17). "'మరణ దినం' వేడుకలు నిర్వహించుకున్న మాజీ మంత్రి, ఇంకా 12 ఏళ్లే జీవిస్తారట!". telugu.abplive.com. Retrieved 2022-12-18.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-12-18.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1994". Elections in India. Retrieved 2022-12-18.
- ↑ "2034లో నేను చనిపోతా.. నా మరణదిన వేడుకలకు రండి: ఏపీ మాజీ మంత్రి". ap7am.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-18.