లాలూ ప్రసాద్ యాదవ్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
లాలూ ప్రసాద్ యాదవ్ | |||
| |||
రైల్వే మంత్రి
| |||
పదవీ కాలం 24 మే 2004 – 23 మే 2009 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | నితిష్ కుమార్ | ||
తరువాత | మమతా బెనర్జీ | ||
నియోజకవర్గం | సరణ్ లోక్‌సభ నియోజకవర్గం | ||
20వ బీహార్ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 4 ఏప్రిల్ 1995 – 25 జూలై 1997 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రబ్రీదేవి | ||
పదవీ కాలం 10 మార్చి 1990 – 28 మార్చి 1995 | |||
ముందు | జగన్నాథ్ మిశ్రా | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
లోక్‌సభ సభ్యుడు, చప్రా లోక్‌సభ నియోజకవర్గం
| |||
పదవీ కాలం 24 మే 2004 – 22 మే 2009 | |||
ముందు | రాజీవ్ ప్రతాప్ రూడీ | ||
తరువాత | నియోజకవర్గం వేరు చేయబడింది | ||
పదవీ కాలం 2 డిసెంబరు 1989 – 13 మార్చి 1991 | |||
ముందు | రామ్‌బహదూర్ సింగ్ | ||
తరువాత | లాల్ బాబూ రాయ్ | ||
పదవీ కాలం 23 మార్చి 1977 – 22 ఆగస్టు 1979 | |||
ముందు | రామ్‌శంకర్ ప్రసాద్ సింగ్ | ||
తరువాత | స్టాయా దేవ్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఫుల్వారియా, గోపాల్‌గంజ్, బీహార్, భారతదేశం [1] | 1948 జూన్ 11||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతాదళ్ | ||
తల్లిదండ్రులు | కుందన్ రాయ్ (తండ్రి) మరచ్చియా దేవి (తల్లి) | ||
జీవిత భాగస్వామి | రబ్రీ దేవి | ||
సంతానం | 9, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, మిసా భారతి తో సహా | ||
పూర్వ విద్యార్థి | పాట్నా విశ్వవిద్యాలయం | ||
వెబ్‌సైటు | http://rjd.co.in/shri-lalu-prasad-yadav.html |
లాలూ ప్రసాద్ యాదవ్ భారత కేంద్ర ప్రభుత్వములో (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) మాజీ రైల్వే శాఖా మంత్రి. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆధ్యక్షుడు. యాదవ్ ఏడు సంవత్సరముల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. గడచిన రెండు దశాబ్దాలలో బీహార్ రాజకీయాలలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రబలమైన వ్యక్తి.
వ్యక్తిగతం
[మార్చు]లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాష్ట్రములోని గోపాల్గన్ జిల్లా, పుల్వారియా గ్రామానికి చెందిన ఒక యాదవ రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన తల్లి తండ్రులు కుందన్ రాయ్, మరచ్చియా దేవి. లాలూ పాట్నా విశ్వవిద్యాలయం నుండి రాజనీతిశాస్త్రములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. లాలూకు 1973, జూన్ 1న రబ్రీదేవితో వివాహమైంది. ఈయన భార్య రబ్రీదేవి కూడా కొన్నాళ్ళు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసింది. లాలూ, రబ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు.
రాజకీయ గమనము
[మార్చు]లాలూ రాజకీయ జీవితానికి తొలి మెట్టు పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడము. జయ ప్రకాష్ నారాయణ్ వల్ల ప్రభావితమైన విద్యార్థుల ఉద్యమానికి 1970లో లాలూ నాయకత్వము వహించారు. విద్యార్థి నాయకుడైన లాలూ భారతదేశ ఎమర్జెన్సీ కాలములో అప్పటి ప్రధాన మంత్రి, ఇందిరా గాంధీకి ఒక వినతి శాసనాన్ని (charter of demands) అందించిన ధీశాలి.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హా (ఛోటే సాబ్) 1977లో లాలూను లోక్‌సభ స్థానానికి పోటీ చేయించి, లాలూ తరపున ప్రచారము చేశాడు. ఫలితంగా 29 సంవత్సరముల పిన్న వయస్సులోనే లాలూ 6వ లోక్‌సభకు ఎన్నికైనాడు.
కేవలము 10 సంవత్సరముల వ్యవధిలోనే లాలూ, బీహార్లో ఒక ఉజ్జ్వల శక్తిగా ఎదిగాడు. 1989లో బీహార్లో జరిగిన ఎన్నికలలో, రాష్ట్ర ఎన్నికలలో లాలూ నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయపథాన నడిపించాడు. అందువల్ల 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. 1990లో బీహార్లో జరిగిన ఆర్థిక అభివృద్ధికిగాను ప్రపంచ బ్యాంకు ప్రశంసలు అందుకొన్నది.
1996లో బీహార్‌లో బయటపడిన రూ. 950 కోట్ల పశుగ్రాస కుంభకోణములో లాలూతో పాటు ఇతర ముఖ్య ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చినవి (ఈ దర్యాప్తును లాలూ ఆదేశించడము విశేషము). పశుగ్రాస కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల వల్ల లాలూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన స్థానములో సతీమణి రాబ్డీ దేవిని ముఖ్యమంత్రిగా నియమించాడు.
1997లో లాలూ, జనతా దళ్ నుండి విడిపోయి రాష్ట్రీయ జనతా దళ్ అనే సొంత పార్టీని స్థాపించాడు.
అంతర్జాతీయ ఖ్యాతి
[మార్చు]హార్వర్డ్, హె.ఇ.సి మేనేజ్‌మెంట్ స్కూల్, ఫ్రాన్స్ వంటి వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, దౌత్య కార్యాలయములు లాలూ జీవిత చరిత్రపై అసక్తిని కనబరిచాయి [2]. కేంద్ర మంత్రైన తరువాత నష్టాలలో నడుస్తున్న భారతీయ రైల్వేలను లాభాల దిశగా నడిపించిచటంలో ఉపయోగించిన విన్నూత యాజమాన్య పద్ధతులకై లాలూ ఖ్యాతి గడించాడు. ఆసియా టైమ్స్ ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ లాలూ "ప్రపంచములోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఒక ఆవుల కాపరి కొడుకు ఇంతటి స్థాయికి ఎలా చేరుకోగలిగాడు అని ఆశ్చర్యమును, ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఉత్సుకత భారత ప్రజాస్వామ్య విజయానికి చిహ్నము" అని అన్నాడు.
జైలు శిక్ష
[మార్చు]బిహార్ రాష్ట్రాన్ని కుదిపేసిన దాణా కుంభకోణంలో ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో తీర్పులు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి కేసులోనూ లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలు శిక్షలు విధించింది. చిట్టచివరిది, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో ఆయనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2022 ఫిబ్రవరి 21న ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.[3]
వనరులు
[మార్చు]- ↑ "Profile: Lalu Prasad Yadav". Times of India. Archived from the original on 22 October 2013.
- ↑ "Lalu goes to Harvard". The Times of India/City Supplement. July 8, 2006. Retrieved 2006-08-10.
- ↑ "Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల శిక్ష". Sakshi. 2022-02-21. Retrieved 2022-02-21.