మిసా భారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిసా భారతి

రాజ్యసభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జూలై 2016 (2016-07-08)
ముందు పవన్ కుమార్ వర్మ
నియోజకవర్గం బీహార్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్
తల్లిదండ్రులు
జీవిత భాగస్వామి శైలేష్ కుమార్
బంధువులు
సంతానం 3

మిసా భారతి (జననం 22 మే 1976) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె జూన్ 2016లో రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైంది. మిసా భారతి బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి కుమార్తె.[2]

వివాహం

[మార్చు]

మిసా భారతి 10 డిసెంబర్ 1999న కంప్యూటర్ ఇంజనీర్‌ శైలేష్ కుమార్‌ను వివాహం చేసుకుంది.[3] వారికీ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

మిసా భారతి తన తల్లితండ్రుల అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్జేడీ తరపున పాటలీపుత్ర లోక్‌సభ స్థానానికి ఎంపీగా పోటీ చేసి ఆర్జేడీ రెబల్ రామ్ కృపాల్ యాదవ్ చేతిలో ఓడిపోయింది.[5] ఆమె 2016, 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆర్జేడీ తరపున ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైంది.[6] మిసా భారతి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్జేడీ తరపున పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది.[7]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (2015). "Lalu Prasad's daughter Misa Bharti bats for brothers Tej Pratap and Tejashwi Pratap". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  2. The Economic Times (3 June 2016). "Piyush Goyal, Chidambaram, Suresh Prabhu, Sharad Yadav elected to Rajya Sabha". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  3. "A marriage made in 1, Anne Marg". Archived from the original on 2018-07-03. Retrieved 2018-07-03.
  4. "Another double for grandfather Lalu". Archived from the original on 2018-07-04. Retrieved 2018-07-03.
  5. India Today (19 March 2014). "Misa Bharti gears up to take on her uncles in Pataliputra" (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  6. The Times of India (3 June 2022). "Lalu Prasad's daughter Misa Bharti, four others elected 'uncontested' to Rajya Sabha from Bihar". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
  7. "Lok Sabha Elections 2019: Misa Yadav, Ram Kripal file nominations from Patliputra seat". 26 April 2019. Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.