Jump to content

మమతా బెనర్జీ

వికీపీడియా నుండి
మమతా బెనర్జీ
మమతా బెనర్జీ


గవర్నరు ఎం. కె. నారాయణన్
ముందు బుద్ధదేవ్ భట్టాచార్జీ
తరువాత సువెందు అధికారి
నియోజకవర్గం భబానీపూర్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2011 మే 20

పదవీ కాలం
2009 మే 22 – 2011 మే 2011
ముందు లాలూ ప్రసాద్ యాదవ్
తరువాత మన్మోహన్ సింగ్

పదవీ కాలం
1991 – 2011
ముందు బిప్లాబ్ దాస్‌గుప్తా , కోల్‌కతా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం
తరువాత సుబ్రతా బక్షి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-01-05) 1955 జనవరి 5 (వయసు: 71)[1]
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (1970–1997)
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
(1997–ప్రస్తుతం)
నివాసం హరీష్ ఛటర్జీ స్ట్రీట్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
పూర్వ విద్యార్థి కలకత్తా విశ్వవిద్యాలయం
శ్రీ శిక్షాయతన్ కళాశాల
జోగమయా దేవి కళాశాల
జోగేష్ చంద్ర చౌధురి న్యాయ కళాశాల
వృత్తి రాజకీయ వేత్త
మతం హిందూ

మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. మమతా బెనర్జీ (బందోపాధ్యాయ) 1955 జనవరి 5 దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రోమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీలకు జన్మించింది. 1970 దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించి, అతివేగంగా, (1976-1980) రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని పొందింది. జాగమయాదేవి కాలేజిలో ఆనర్స్ డిగ్రీ, కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఏ (ఇస్లామిక్ చరిత్ర) పట్టాను పొందింది. శ్రీ శిక్షాయతన్ కాలేజి నుంచి ఉపాధ్యాయ విద్యలో పట్టా పొందింది. జోగేష్ చంద్ర కళాశాల నుంచి 'లా' డిగ్రీని పొందింది. మొండి పట్టుదలకు మొదటి పేరు, భారత దేశమంతటా పేరున్నవనిత. 1984 నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి మహాయోధులు రాజకీయ రంగ ప్రముఖులుగా వున్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థినాయకురాలు.

కాంగ్రెస్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ నాయకత్వంలో, విద్యార్థి రాజకీయాల్లో ముఖ్యంగా కనిపించే, ఈ 'అగ్నిజ్వాల', ఆ కాలంలో వామపక్షంలో, బాగా పేరు ప్రతిష్ఠలున్న నాయకుడు 'సోమనాధ ఛటర్జీ' తో 1984 ఎన్నికలలో పోటీచేసింది. జాదవ్‌పూర్ నియోజక వర్గంలో 'సోమనాధ ఛటర్జీ' తో పోటీ చేయటానికి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు వెనకడుగు వేసిన కాలమది.

సోమనాఢ ఛటర్జీకి జాదవ్‌పూర్ నియోజక వర్గం కంచుకోట. చిచ్చర పిడుగు మమతా బెనర్జీ, ఇంటింటికీ వెళ్ళి, పేదసాదలతో ముచ్చటించి, వారితోపాటే తేనీరు సేవించి, వారిని కౌగిలించుకుని, నేనూ మీలో ఒక మనిషినని, మీరు పంపితే, నేను లోక్‌సభ వెళ్లగలను అని ప్రజలతో పాలు నీళ్ళలా కలిసిపోయింది. అటువంటి ప్రచారాన్ని, అట్టడుగు ప్రజలకు చేర్చి, సోమనాధ ఛటర్జీని మట్టి కరిపించింది. 1984లో వామపక్షాల దిమ్మ తిరిగిపోయింది. అప్పటినుంచి మమతా బెనర్జీకి 'ఫైర్ బ్రాండ్' అనే పేరు స్థిరపడింది.

ఈమె పెళ్ళి చేసుకోలేదు. సింగూరులో టాటా కంపెనీని గుజరాత్కు తరిమేసి, అక్కడి బలవంతపు భూసేకరణను ఆపిించి, రైతుబంధుగా రైతుల అభిమానాన్ని పొందింది. ఆనాటి పాలక వామపక్షం దౌర్జన్నాన్ని అతి వీరోచితంగా ఎదుర్కొంది. ఆ సంఘటనతో, వామపక్షం పరువు పోగొట్టుకొని, ప్రజలకు దూరమయ్యింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసింది.

2011 మే 13 నాడు, 34 ఏళ్ల కమ్యూనిష్ట్ పాలనను, పశ్చిమ బెంగాల్లో కూకటి వేళ్లతో పెకలించి వేసింది. మమతా బెనర్జీ నిరాడంబర మహిళ (పుచ్చలపల్లి సుందరయ్య లాగ). బట్టలు, వస్తువులు, అలంకారాలు ఏమీ వేసుకోకుండా, అతి సామాన్యంగా గడుపుతుంది. చూపుకి అతి బీదరాలులా కనిపిస్తుంది. ఏవిధమైన అలంకరణ చేసుకోదు. భుజానికి ఓ గుడ్డ సంచి (వావిలాల గోపాలకృష్ణయ్య లాగ), గుండెనిండా పట్టుదల, మెదడు నిండా పశ్చిమ బెంగాల్ అభివృద్ధి ఆలోచనలు, మాటలనిండా ఆదర్శపు నిప్పు కణికలు ధరించి చేతల్లో నిరూపించిన ధీరవనిత, వీరవనిత.1996లో తనపై ప్ర్రాణాంతకమైన దాడిని సైతం గుండె నిబ్బరంతో ఎదురొన్న ధీశాలిని. మరో దుర్గామాతగా బెంగాల్ ప్రజలు భావిస్తారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా

[మార్చు]

మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా 2021 మే 5న ప్రమాణస్వీకారం చేసింది. గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ఆమెచేత ప్రమాణ స్వీకార చేయించాడు. మమతా బెనర్జీ వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టింది.[2]

[3]పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఓటమి 2026 లో

మూలాలు

[మార్చు]
  1. "Mamata Banerjee's Biodata in Lok Sabha's Document". loksabha.nic.in. the original నుండి 2012-05-25 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-01-04.
  2. NDTV (5 May 2021). "Mamata Banerjee Takes Oath As Bengal Chief Minister For 3rd Time". ఒరిజినల్ నుండి 5 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 May 2021.
  3. Sakshi (5 May 2021). "బెంగాల్‌ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం". ఒరిజినల్ నుండి 5 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 May 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]