అమృతేశ్వర దేవాలయం, అమృత్ పుర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమృతేశ్వర దేవాలయం (కన్నడ: ಅಮೃತೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ) కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా చిక్కమగళూరు  పట్టణానికి దగ్గర్లో  ఉన్న అమృత్‌పుర గ్రామంలో ఉంది. హస్సన్ నుంచి 110 కిలోమీటర్లు, శివమొగ్గ నుంచి  35 కిలోమీటర్ల దూరంలో 206వ జాతీయ రహదారిలో ఉంది. ఈ గ్రామంలో ఉన్న అమృతేశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని సా.శ. 1196వ సంవత్సరంలో  నిర్మించారు. హొయసల రాజు వీర బళ్ళాల II కాలంలో ఆయన సైన్యాధ్యక్షుడైన అమృతేశ్వర దండనాయకుడు నిర్మించారు.

అమృతేశ్వర  దేవాలయం

[మార్చు]
ఆలయం(1196 CE)
మెరుస్తున్నట్టుండే అమృతేశ్వర దేవాలయ ముఖ మండపం
ఆలయ శిఖరంపై చెక్కబడి ఉన్న కీర్తిముఖాలు
అమృతేశ్వరాలయంలో లభించిన ప్రాచీన కన్నడ శిలాశాసనాలు (1196 AD)

ఈ దేవాలయానికి విశాలమైన ముఖమంటపం ఉంది. ఈ ఆలయాన్ని హొయసల సామ్రాజ్య నిర్మాణ శైలి ప్రకారం నిర్మించారు.[1] ఈ ఆలయానికి సహజమైన ప్రహారీ గోడ ఉంటుంది. అది కూడా సమానమైన జాగాతో వృత్తాకారంలో ఉండటం విశేషం. ఈ గుడికి ఎకకుటా డిజైన్ లో ఒక విమాన గోపురం ఉంది.[2] అలాగే ఒక మూసిన మంటపం ఉంది. అది ముఖ మంటపాన్నీ, గర్భగుడినీ కలిపే విధంగా ఆ రెండిటి మధ్య నిర్మించారు.

మధ్య పరిమాణ హొయసల శైలి ఆలయం ఇది. హొయసల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ గుడి అదే శైలిలో నిర్మించిన బెలవదిలోని వీర నారాయణ ఆలయంతో పోలి ఉంటుంది. వీరనారాయణ గుడిలోలానే మంటప నిర్మాణం ఉంటుంది. ఈ ఆలయంలో ముఖ మంటపం 29బేయల పొడువు, మూసిన మంటపం 9 బేయలు ఉంటుంది.[3] ఈ మంటపంలో నుంచి దక్షిణం వైపు ఉన్న మరో గర్భాలయంలోకి వెళ్ళవచ్చు. గర్భాలయం చతురస్రాకారంలో  అచ్చం గోపురం ఆకారంలో ఉంటుంది. గర్భాలయ గోపురం పైన కీర్తిముఖాలను చెక్కారు. మూసిన మంటపాన్నీ, గర్భగుడినీ కలిపే సుకనాసీ మంటపం పైన హొయసల సామ్రాజ్య చిహ్నమైన సింహం చెక్కబడి ఉంది.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. Foekema (1996), p37
  2. Quote:"Depending on the number of towers, temples are classified as ekakuta (one), dvikuta (two), trikuta (three), chatushkuta (four) and panchakuta (five).
  3. Quote:"A bay is a square or rectangular compartment in the hall, Foekema (1996) p36, p93
  4. Foekema(1996), p22
  5. Foekema (1996), p22
  6. According to Kamath, Sala fights a tiger.