బాణాసురుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వెయ్యి బాహువులు కలిగిన బాణాసురుడు (Sanskrit: बाणासुर)), బలి చక్రవర్తి కుమారుడు. వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి ఆయన్ని మెప్పించి తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఉండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి, మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.

ఇప్పటి అస్సాంలోని తేజ్ పూర్ ని బాణాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. ఇదివరకు దీనిని శోణాపుర్ లేదా శోనిట్ పూర్ అని కూడా పిలిచేవారు.

బాణాసురుని వంశపరంపర[మార్చు]

ఉషా అనిరుద్ధుల ప్రణయం[మార్చు]

బాణాసురిని కూతురైన ఉష దేవి యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు అందరిని నిరాకరిస్తాడు. ఉషా దేవికి చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలో అసమాన్య ప్రావీణ్యం ఉండేది. ఒకరోజు ఉషా దేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి ఆమెను ఆలింగనం చేసుకొంటాడు. ఆ విషయాన్ని చిత్రలేఖ కు చెప్పగా చిత్రలేఖ తన చిత్రకళా చాతుర్యంతో సమస్త భూగోళంలొ ఉండే రాకుమారుల చిత్తురవులు గీసి చూపుతుంది. అందులొని ఒక చిత్తురువు చూసి ఎవరే ఈ నవమోహన మోహనాంగుడు అని ఉషా దేవి అడుగగా చిత్ర లేఖ రాకుమారిడి చిత్తురవు చూసి ఈ రాకుమారుడా శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధిని బృందావనం నుండి శోణపురానికి తెప్పించి ఉషా దేవి హంస తూలికా పాన్పు పై పడవేస్తుంది. ఆ రోజు నుండి ఉషానిరుద్ధులు ప్రణయ క్రీడలొ మునిగితేలుతారు. ఒక రోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు వెళ్ళి బాణాసురుడికి విన్నపిస్తారు. బాణాసురుడు అనిరుద్ధుడి మీదకు సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్ధుడు అందరిని నాశనం చేయడం తొ బాణాసురుడే యుద్ధానికి వెళ్ళి నాగపాశం విసురుతాడు, ఆ సమయంలొ బాణాసురిడి రథం మీద జండా క్రింద పడుతుంది. ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడుతాడు. బృందావనం లొ అనిరుద్ధుడు కనిపించక పోయేసరికి అందరు చింతిస్తూ ఉంటే జగన్నాధక సూత్రదారి శ్రీకృష్ణుడు నారదుడి ద్వారా ఈ విషాయాన్ని గ్రహిస్తాడు.

శైవజ్వరం వైష్ణవ జ్వరం[మార్చు]

శ్రీకృష్ణుడు బలరామ సాత్యకి యదు వంశ సైన్యం తో బాణుడి మీద యుద్ధానికి బయలుదేరుతాడు. యదవసైన్యం బాణాసురిడి సైన్యాన్ని నాశణం చేస్తుంది. పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడికిచ్చిన మాట ప్రాకరం భూత ప్రేత ప్రమద గణాలతో యాదవుల మీదకు వచ్చి యుద్ధం చేస్తాడు. శివుడికి వాసుదేవుడికి మధ్య యుద్ధం జరగడంతో సమస్త భూగోళం దద్ధరిల్లు తుంది. ఈ యుద్ధాని యక్ష, గంధర్వ,కిన్నెర కింపురుషాదులు గగనతలం నుండి వీక్షించారు. శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వాసుదేవుడు బ్రహ్మాస్త్రం తోనే నిరోధించాడు.శివుడు వేసిన వాయుయ్వాస్త్రాన్ని పర్వతాస్త్రం తో నిలిపాడు శ్రీకృష్ణుడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు అంద్రాస్త్రం సంధించాడు.శివుడు ప్రయోగించిన పాశుపతం శ్రీకృష్ణుడు ప్రయోగించిన నారాయణాస్త్రం తొ చల్లారింది. అప్పుడు నారాయణుడు(శ్రీకృష్ణుడు) సమ్మోహనాన్ని ప్రయోగిస్తే శివుడు మూర్ఛపోయాడు. శివుడు మూర్ఛపోవడంతో బాణుడు కొయ్యబారి నిలబడిపోయాడు. అప్పూదు బాణుడి తల్లి కోతరా జుట్టు వీరపోసుకొని వివస్త్రై శ్రీకృష్ణుడి ముందు నిలబడుతుంది. అప్పుడు కోతరని చూడలేక శ్రీకృష్ణుడు రథంపై నుండి తల వెనుకకు త్రిప్పుకొంటాడు, వేంతాణె బాణుడు పలాయనమంత్రం పఠిస్తాడు. పరం శివుడు మూర్ఛ నించి తేరుకొని యాదవ సైన్యంపైకి శైవజ్వరం ప్రయోగిస్తాడు. నారాయణుడు వైష్ణ్వ జ్వరం ప్రయోగిస్తాడు. శైవ జ్వరాన్ని నారాయణుడు ప్రార్థించడం తొ ఊపశమనం పొందుతుంది. నారాయణుడు ప్రాయోగించైన వైష్ణ్వ జ్వరం శివుడి వద్దకు వెళ్ళి ఉపశాంతి పొందుతుంది. అప్పుడు బాణుడు ఒక్కడే అక్కడ యుద్ధ రంగం లొ నిలబడ్పోవడంతొ శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం బాణుడి సహస్ర కరాలలొ నాలిగింటిని మిగిల్చి మిగతా వాటిని ఖండిస్తుంది. అప్పుడూ శివుడు సకలదేవతలతో శ్రీకృష్ణుడి వేదుకొనగా నారాయణుడు శాంతించి ప్రహ్లాద వంశస్థులను సంహరించను అని మాట ఇచ్చిన కారణమున బాణుడిని విడిచి పెడుతున్నాను. బాణుడు శివభక్తులలొ అగ్రాసేరుడిగా నిలుస్తాడు అని వరమిస్తాడు. తరువాత బాణుడు ఉషా అనిరుద్ధులకు వివాహం జరిపిస్తాడు.

బయటి లింకులు[మార్చు]