ప్రద్యుమ్నుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడికి రుక్మిణికి జన్మించిన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతంలో వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు.

ప్రద్యుమ్నుడు

శంభరాసురుడు ప్రద్యుమ్నుడిని అపహరించడం[మార్చు]

శంభరాసురుడు అనే రాక్షసుడు తనకు భవిష్యత్తులో ప్రద్యుమ్నుడు యముడవుతాడని గ్రహించి శంభరాసురుడు ప్రద్యుమ్నుడిని రుక్మిణి దేవి పురుటి మంచం నుండి అపహరించి సముద్రంలో పారేస్తాడు. ఆ విధంగా పురిటి మంచం నుండి సముద్రం పడిన ప్రద్యుమ్నుడిని ఒక చేప మ్రింగుతుంది. జాలర్లు ఆ వల వేసి చేపలు పట్టుతుండగా ఈ చేప వారికి దొరుకుతుంది. చేప చాలా పెద్దగా ఉండడం చూసి తమ రాజు శంభరాసురుడికి బహుమతిగా ఇస్తారు. శంభరాసురుడు ఆ చేపని వంటశాలకు పంపింస్తాడు. వంటాశాలలో ఆ చేపని కోయగా ఆ చేపనుండి ప్రద్యుమ్నుడు బయట పడాతాడు. అప్పుడు వంటవారు ఆ శిశువు తీసుకొని రాజుకి ఇవ్వగా శంభరాసురుడి కొలువులో ఉన్న మాయావతి ఆ శిశువుని పెంచుకోవాలి అని చెబుతుంది. శంభరాసురుడు దానికి అంగీకరిస్తాడు.

ప్రద్యుమ్నుడి జన్మ వృత్తాంతం[మార్చు]

ప్రద్యుమ్నుడు పూర్వపు జన్మలో మన్మథుడు. శివుడి కోపాగ్నికి గురై భస్మమైన మన్మధుడు నారాయణుడి కృపతో శ్రీ కృష్ణుడి కుమారుడిగా జన్మిస్తాడు. రతి దేవి మన్మధుడు భస్మమై నప్పుటి నుండి మాయావతి అనే పేరుతో ఇక్కడ అక్కడ తిరుగుతూ శంభరాసురుడి వద్దకు చేరు కొంటుంది. మాయావతి (రతి దేవి) ప్రద్యుమ్నుడిని పెంచుకొంటుండగా ఒకరోజు నారదుడు వచ్చి జన్మవృత్తాంతం చెబుతాడు. ప్రద్యుమ్నుడు పెద్దవాడయ్యాక మాయావతి తనని వివాహం చేసుకొవలసిందిగా కోరుతుంది. దానికి ప్రద్యుమ్నుడు చింతించి నీకు కామ వాంఛ కలగడం అనుచితం అంటాడు. అప్పుడు మాయావతి వారిద్దరి జన్మ వృత్తాంతం తెలిపి శంభరాసురుడిని చంపవలెనంటే మాయా విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి మాయాశక్తి విద్యని నేర్పుతుంది.

ప్రద్యుమ్నుడు శంభరాసురుడిని సంహరించడం[మార్చు]

ప్రద్యుమ్నుడు పెద్దవాడయ్యాక శంభరాసురుడిని దూషిస్తూ మాట్లాడుతుండగా శంభరాసురుడు ప్రద్యుమ్నుడి మీద యుద్ధం ప్రకటిస్తాడు. శంభరాసురుడు ప్రద్యుమ్నుడి మీద గద విసురగా ప్రద్యుమ్నుడు తన గదా దండం విసిరి దారి మధ్యలోనే ఆ శంభరాసురిడి గదని విరగ్గొట్టుతాడు. తరువాత శంభరాసురుడు తన మాయావిద్య వినియోగించి ఆకాశం లోకి మాయం అయ్యి శర వర్షం కురిపిస్తండగా ప్రద్యుమ్నుడు మాయాశక్తి వినియోగించి శంభరాసురుడి మాయ పటాపంచెలు చేసి శంభరాసురుడి తలని ఛేధిస్తాడు. ఆ విధంగా శంభరాసురుడి మరణించడం చూసిన దేవ గంధర్వ కిన్నెర కింపురుషులు ప్రద్యుమ్నుడి మీద పూల వర్షం కురిపిస్తారు.

ప్రద్యుమ్నుడు ద్వారకకు తిరిగి రావడం[మార్చు]

మాయావతి (రతి దేవి) తన మాయాశక్తి వినియోగించి ఆకాశ మార్గములో ప్రద్యుమ్నుడితో పాటు ద్వారక నగరం చేరుకొంటుంది. ద్వారక నగరమునకు చేరుకొన్న ప్రద్యుమ్నుడిని చూసిన ప్రజలు కృష్ణుడు వలే ఉన్నాడు కాని వీనిలో కృష్ణుడి లక్షణాలు అన్ని లేవు అని భావిస్తుండగా రుక్మిణి దేవి అక్కడకు వచ్చి తన పురిటినాటి విషయాలని జ్ఞప్తికి తెచ్చుకొని ఈ పిల్లవాడు నా కుమారుడు వలె ఉన్నాడని అనుకుంటుంది. అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడకి వచ్చి జరిగిన విషయాలు అన్ని తెలుసుకొని ప్రద్యుమ్నుడికి మాయావతికి విధ్యుక్తంగా వివాహం జరిపిస్తాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లంకులు[మార్చు]