రామేశ్వరం
?Rameswaram తమిళనాడు • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 9°17′N 79°18′E / 9.28°N 79.3°ECoordinates: 9°17′N 79°18′E / 9.28°N 79.3°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 10 మీ (33 అడుగులు) |
జిల్లా (లు) | రామనాధపురం జిల్లా |
జనాభా | 38,035 (2001 నాటికి) |
రామేశ్వరం, తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణంలో రామనాథ స్వామి దేవాలయం ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కి.మి దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం.రామేశ్వరం తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలం కూడా ప్రాముఖ్యత సంపాదించుకొంది.
ఉనికి భౌగోళిక స్వరూపం[మార్చు]
రామేశ్వరం సముద్రమట్టానికి 10 మీటర్ల్ ఎత్తులో ఉన్న ఒక ద్పీపము. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాలువ వేరుచేస్తోంది. 9°17′N 79°18′E / 9.28°N 79.3°E.[1]. ఈ శంఖు ఆకారంలో ఉన్నఈ ద్వీపం విస్తీర్ణం 61.8 చదరపు కి.మి. ఈ ద్వీపం భూభాగాని ఎక్కువగా రామనాథస్వామి దేవాలయం ఆక్రమిస్తుంది.ఈ దేవాలయం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చు తునక.ఇక్కడ నుండి శ్రీలంక దేశం కనిపిస్తూ ఉంటుంది. శ్రీలంక ప్రధాన పట్టణం కొలంబొ 112 కి.మి దూరంలో ఉంది.
జనాభా[మార్చు]
2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకరం రామేశ్వరం జనాభా 38,035, అందు 52% పురుషులు, 48 % స్త్రీలు. రామేశ్వరం అక్షరాస్యత శాతం 72% (జాతీయ సగటు అక్షరాస్యత శాతం 59.5%) అందు పురుషుల అక్షరాస్యత 77%, స్త్రీల అక్షరాస్యత 66%. రామేశ్వరంలో ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న జనాభా శాతం 13%.
చరిత్ర[మార్చు]
భారతీయులలో హిందువులు అనేకమంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాతకాని పూర్తికాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్థం తీసుకు వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లైతే కాశీయాత్ర పూర్తి ఔతుందని దేశంలోని సకల తీర్ధములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రధానదైవం రామనాథస్వామి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమబాహు నిర్మించాడు. భారతీయ నిర్మాణకళా వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయ లోపలి నడవ (నడిచేదారి) దేశంలో అతిపెద్దదని సగర్వంగా చెప్పుకుంటున్నారు.
12వ శతాబ్దం నుండి ఈ ఆలయనిర్మాణం వివిధ రాజులు నిర్మించారు. ఆలయంలోని పెద్ద భాగమైన నడవ లేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధంగా స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది.
రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న వంతెన ఉన్న ప్రదేశాన్ని సేతుకరై (సేతు తీరం) అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
రామనాథేశ్వర దేవాలయం[మార్చు]
దక్షిణభారతదేశంలో ఉన్న దేవాలయాల వలే రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి దేవాలయ ప్రాకారం నాలుగు వైపుల పెద్ద ప్రహారి గోడలతో నిర్మితమై ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరం 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడ ల మధ్య దూరం 657 అడుగులు. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. మూడవ ప్రాకారం
బయటి ప్రాకారం | తూర్పు-పశ్చిమం | 690 అడుగులు |
ఉత్తరం-దక్షిణం | 435 అడుగులు | |
లోపలి ప్రాకారం | తూర్పు-పశ్చిమం | 649 అడుగులు |
ఉత్తరం-దక్షిణం | 395 అడుగులు | |
ఆలయం మొత్తం స్తంభాల సంఖ్య | 1212 | |
ఆలయం లోపలి భాగం ఎత్తు | 22 అడుగులు 7.5 అంగుళాలు |
విశేషాలు[మార్చు]
రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడులో వున్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు ఉన్నాయి. రామనాథస్వామి గుడి, కొటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణాలయం, ఇంకా చాలా చాలా ఉన్నాయి.
చేరుకొనే విధానం[మార్చు]
దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన (పాంబన్ రైలు వంతెన), రోడ్డు వంతెన (ఇందిరా గాంధీ వంతెన) ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలోమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన ఓడలు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది.ఇక్కడ బీచ్లో కూర్చుని సుర్యోదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతత చేకూరుతుంది. చెన్నై నుండి రామేశ్వరానికి దినసరి రైళ్ళు గలవు.
ఇతరవిశేషాలు[మార్చు]
రామేశ్వరం ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇచట శ్రీ కృత కృత్య రామనాథస్వామి వారు ఉన్నారు. కాల క్రమేణ ఈ గుడి ఉన్న ప్రాంతం గుడిమూల ఖండ్రిక గ్రామంలో కలుప బడింది.ఈ గ్రామంలో రంగనాథ, శ్రీ రామ, ఎల్లమ్మ, గంటలమ్మ, ఆలయాలు ఉన్నాయి. వరి, రొయ్యలు, ఇచట ప్రధాన పంటలు.హిందు, క్రైస్తవ ఇచట ముఖ్య మతాలు. జిల్లా పరిషత్ పాఠశాల శ్రీ బళ్ల శ్రీరాములు, గ్రామస్తుల సహకారంతో నిర్మించబడింది. బైర్రాజు ఫౌండేషన్ వారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Falling Rain Genomics, Inc - Rameswaram". Archived from the original on 2007-12-10. Retrieved 2007-09-02.
బయటి లింకులు[మార్చు]
