భైరవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాల భైరవుడు
కుక్కతో భైరవుడు.
కుక్కతో భైరవుడు.
Destruction (guard god)
దేవనాగరిभैरव (भैराद्य: in Nepal Bhasa)
సంప్రదాయభావంAspect of శివుడు
ఆయుధంత్రిశూలం
వాహనంకుక్క

భైరవ లేదా భైరవుడు (సంస్కృతం: भैरव, "Terrible" or "Frightful") [1] శివుని అవతారం.[2] భైరవుడు నేపాల్ దేశంలో ఒక ముఖ్యమైన దేవుడు;, హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైన దేవుడు.

భైరవుడు నాగుల్ని చెవిపోగులుగా, దండలకు, కాలికి, యజ్ఞోపవీతంగా అలంకరింబడి ఉంటాడు. ఇతడు పులి చర్మాన్ని, ఎముకల్ని ధరిస్తాడు.[3] ఇతని వాహనం శునకం.

కాల భైరవుడు మనకి వివిధ క్షేత్రాలలో ఎనిమిది రకాలుగా కనిపిస్తారు :- 1. అసితాంగ భైరవుడు, 2. సంహార భైరవుడు, 3. రురు భైరవుడు, 4. క్రోధ భైరవుడు, 5. కపాల భైరవుడు, 6. రుద్ర భైరవుడు, 7. భీషణ భైరవుడు,, 8. ఉన్మత్త భైరవుడు.

కాల భైరవ వృత్తాంతం[మార్చు]

పరమశివుని అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురియై భైరవుడిని సృష్టించి బ్రహ్మ దేవుని తలని ఖండించమని ఆదేశిస్తాడు. వేంటనే భైరవుడు శివుడని అవమానించిన బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో ఒకదానిని ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికి శివుని అనుగ్రహం మేరకు బ్రహ్మ దేవుని కపాలమును చేతిలో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్తాడు. చివరకు ఆ కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరాన్ని బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారు.

మూలాలు[మార్చు]

  1. For भैरव as one of the eight forms of Shiva, and translation of the adjectival form as "terrible" or "frightful" see: Apte, p. 727, left column.
  2. For Bhairava form as associated with terror see: Kramrisch, p. 471.
  3. Bhairava statuette Archived 2011-01-30 at the Wayback Machine in copper from 15th-16th century Nepal, in collection of Smithsonian Institution. Accessed August 11, 2007.
"https://te.wikipedia.org/w/index.php?title=భైరవుడు&oldid=3017821" నుండి వెలికితీశారు