వామదేవుడు
వామదేవ మహర్షి ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానసాధకుడు.
జీవిత విశేషాలు
[మార్చు]గ్రంధములందు ఎచ్చటనూ ఈ వామదేవ మహర్షి జననీ జనకులను గురించిన విషయాలులేవు.అందుచేత వారి పేర్లు తెలియవు. ఆత్మ నుపాసించిఅమృతత్వమును సాధించాడు.ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. వామదేవుడు అపర శంకరునిలాతేజరిల్లుచూ శిష్యునితో భూసంచారం చేయుచూ సుమేరు దక్షిణ శృంగమగు కుమార శిఖరమునకు వచ్చాడు.స్కంధ సరోవరమందు స్నానమాచరించి కుమారస్వామిని దర్శించి స్తుతించాడు.స్వామికి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారము లొనర్చాడు. కుమారస్వామి ప్రత్యక్షమై వరమేదేని కోరుకోమనగా ప్రణవోపాసనా విధానము తెలియజేయమని ప్రార్థించాడు.
స్కందుని ఉపదేశం
[మార్చు]అంత స్కందుడు వామదేవా శ్రద్ధగా విను పరమశివుడే ప్రణవార్థ స్వరూపుడు. ఆయన వలననే సర్వమూ జన్మించినది. అతడు స్వయంభువు. సర్వేశ్వరుడు ప్రణవార్థము కూడ అతడే మునీశ్వరా నీకీ రహ్యసం తెలియజేసాను.నిన్ను ఎవరడిగిన వారికి తెలియజేసి లోకకల్యాణమునకు సహకరించు అని మౌనం వహించగా వామదేవుడు స్కంధునికి నమస్కరించాడు. కుమారుస్వామి అటనుండి తిన్నగా కైలాసపర్వతమునకు పయనమయ్యాడు.
కైలాసానికి పయనం - రాక్షసుని శాపవిమోచనం
[మార్చు]స్కంధుని అనుమతిపై వామదేవుడు అతని వెంట పార్వతీ పరమేశ్వరులను దర్శించే తలంపుతో తాను కూడ బయలుదేరి కైలాసపర్వతం చేరుకుని శివపార్వతులను దర్శించి నమస్కరించే స్తుతించి చాలాకాలం అచ్చటనే ఉండిపోయాడు. ఒకనాటి విషయం శివపంచాక్షరీ మంత్రం జపిస్తూ వామదేవుడు భూలోకమంతా తిరుగుతున్నాడు. క్రౌంచారణ్యం చేరాడు.ఆ ఘూరాటడవిలో వామదేవునకు భయంకరాకృతిలో ఒక రాక్షసుడు ఎదురయ్యాడు.వాడు మంచి ఆకలితో ఉన్నాడు. ఆకలి బాధ తార్చుకుందుకు ఆ రాక్షసుడు తనకు ఎదురుగా వచ్చే వామదేవుని పట్టి భక్షింప ప్రయత్నించాడు.వామదేవుడు భయపడ్డాడు. కాని విచిత్రం వామదేవుని సోకుటచే ఆ రాక్షసుడు దానవత్వము మరచి దైవత్వమును పొంది మునివరా నన్ను క్షమించు నేను కడు పాపత్ముడను మిమ్ము ఆకలిబాధతో మ్రింగాలని ప్రయత్నించాను.మిమ్ము తాకగానే నాలోని అజ్ఞానం తొలగి పోయింది.నేను పవిత్రుడనయ్యాను.నన్ను కరుణించండని కాళ్ళపై పడ్డాడు. కాళ్ళపై బడ్డ రాక్షసుని లేవనెత్తి వామదేవుడు నీవెవరవు ఏమిటి నీ కథ అని అడిగాడు.
రాక్షసుని వృత్తాంతము
[మార్చు]రాక్షసుడు ఒక యవన రాజును. ఆడువారి నెందరినో చెరపట్టి వారిని బాధించి కామవాంఛ తీర్చుకున్న పరమకాముకుడు. ప్రతి రాత్రి ఒక అందాల రాశి ఆయన బాహుబంధాలలో నలిగిపోయేది. అలా ఎందరినో స్త్రీలను పాడు చేశాడు. కొంతకాలమునకు రోగి ఐనాడు. ఆ రోగముతోనే మరణించాడు. అనేక సంవత్సరములు నరక యాతనలు అనుభవించాడు. పిశాచియై పుట్టాడు. పెద్దపులినై జన్మించాడు. పాముగ,తోడేలుగ,పంది,లేడి, తొండ,ఏనుగు,నక్క మొదలైన జంతువులుగా జన్మించాడు.తుదకీ నాడు మరల బ్రహ్మ రాక్షసుడనై జన్మించాడు.ఆకలి బాధ తట్టుకోలేక వామదేవుడుని చంపితినాలనే తలంపుతో ఆయన వెంట పడ్డాడు. వామదేవుని ముట్టుకోగానే రాక్షసునికి పూర్వ జ్ఞానం కలిగింది. పాపాత్ముడనైన తనను కరుణించమని వామదేవుని వేడుకున్నాడు.
యవన రాజుకు ఉపదేశం
[మార్చు]రాక్షసుని కథను విని వామదేవుడు ఓ బ్రహ్మరాక్షసుడా నీవు శివుని విభూతిని ధరించు.నీ ఈ పిశాచరూపం పోయి దివ్వరూపం కలుగుతుంది. పాపాటు నశించి పుణ్యాత్ముడవుతావు.అని చెప్పి తనవద్దగల విభూతిని ఆతడికి దివ్వరూపం ప్రాప్తించింది.అంత అతడు వామదేవుని కీర్తించి ఆయను అనుజ్ఞ పొంది వెళ్ళిపోయాడు.
నృగుడికి కలిగిన అనుభూతి
[మార్చు]పూర్వకాలమున నృగుడను మహారాజు ఉండేవాడు.అతడు వేటయందు ఆసక్తి గలవాడు.ఒకనాడు ఆ మహారాజు సేనను వెంటబెట్టుకుని వేటకై అడవికి వెళ్ళి అచ్చట అనేక మృగములను వేటాడి అలసిపోయాడు.ఇంతలో అతని దృష్టిని ఒక శరభ మృగము ఆకర్షించింది.దాని వెంట పడ్డాడు.అది దొరకలేదు సరికదా మహారాజును చాల దూరంగా తీసికొని పోయింది.రాజు పూర్తిగా అలసిపోయాడు.గుర్రం దిగి దానిని చెట్టుకు కట్టి తానా చెట్టునీడను విశ్రాంతి తీసికొంటున్నాడు.ఇంతలో హఠాత్తుగా అటుగా కిరాతరాజు సైన్యంతో వచ్చాడు. అలసి పడి వున్న రాజును చూసి అతని వంటిపై ఉన్న సొమ్ములను దోచుకోమని సైనికులకు అజ్ఞాపించాడు.వారు వేంటనే రాజును సమీపించారు. ఇంతలో ఒక వింత జరిగింది.అది రాజు శరీరం నుండి ఒక స్త్రీ బయటకు వచ్చి కిరాత రాజు సేనపై బడి వారందరిని పారద్రోలి మెరుపువలె మరల నృగ మహారాజు శరీరంలో ప్రవేశించింది. ఆ దృశ్యం కళ్ళారా చూసిన మహారాజు ఆలస్యం చేయక వేంటనే వామదేవ మహర్షి ఆశ్రమమునకు పోయి జరిగినదంతయు ఆ మునికి విన్నవించి ఏమిటిదని అడిగాడు. విన్న వామదేవుడు రాజుతో రాజా నీవు పూర్వ జన్మమున ఒక శూద్రుడవు.అయినా బ్రాహ్మణులను ఆరాధించావు.వారి ప్రేరణతో బుద్ధవ్రతం ఆచరించావు.రాజువయ్యావు.నీ వాచరించిన పుణ్యవ్రత ఫలమే స్త్రీ రూపం దాల్చి నిన్ను రక్షించింది అని తెలిపి రాజును ఆశీర్వదించి పంపాడు.
శలుని వృత్తాంతము
[మార్చు]శలుడను రాజు ఉండేవాడు.అతడు అయోధ్యను పాలించే వాడు.ఒకనాడు రథముపై వేటకు వెళ్ళి అనేక మృగములను వేటాడాడు.ఒక మృగము తప్పించుకొని పారిపోయింది.పట్టుదలతో దానినిన పట్టి నేలపడకొట్టాలని వెంట బడ్డాడు.గుర్రములు అలసిపోయినవి.మృగము దొరకలేదు.అంత సారధి ప్రభూ రథం ముందుకు కదలదు.గుర్రములు అలసిపోయినవి.వామ్యాశ్వములు తప్ప ఇక ఏ అశ్వములు ఈ మృగము వేగమును దాటలేవు.అనగా విని రాజు వామ్యాశ్వములను గురించి తెలుపమనగా అవి వామదేవ మహర్షి గుర్రములని,అతి వేగముగా పోగలవని తెలియజేశాడు. శలుడు వామదేవుని వద్దకు వెళ్ళి గుర్రములను అర్థించాడు.వేట పూర్తికాగానే తిరిగి అశ్వములను ఇవ్వగలనని వాగ్ధానం చేసి వాటిని రథమునకు కట్టి వేటకు బయలుదేరాడు.మృగమును వధించాడు. శలుడు మాట తప్పాడు.తిరిగి గుర్రములను వామదేవునకు ఇవ్వలేదు.తన వెంట తీసికొని పోయాడు.ఆ విషయం తెలియగానే వామదేవుడు ఆత్రేయుడను శిష్యుని పంపి గుర్రములను తీసికొని రమ్మన్నాడు.శలుని చేరి ఈ ఆత్రేయుడు గురువు గారి గుర్రములను అడిగాడు శలుడు ఇవ్వనన్నాడు.ఇవి ద్విజుల వద్ద ఉండదగ్గవి కావు.రాజుల దగ్గర ఉండదగ్గవి పోమ్మన్నాడు.చేసేది లేక ఆత్రేయుడు జరిగిన విషయం గురువుకు తెలిపాడు.అంత గురువు కోపించి స్వయంగా తానే బయలుదేరి వెళ్ళాడు. అడిగాడు లాభం లేకపోయింది.చేసేది లేక వాయదేవుడు రాక్షసులను సృష్టించి శలుని పైకి పంపాడు.రక్కసుల చేతిలో శలుడు మరణించాడు.అంత శలుని సోదరుడు దలుడు దండెత్తాడు.వాడొక విషపూరితమైన బాణమును ప్రయోగించగా అది వామదేవుని ఆదేశానుసారం తిరిగి వెనుక పోయి దలుని కుమారుని సంహరించింది.దలుడు మరొక బాణం ప్రయోగించబోగా అతని హస్తం స్థంబించి పోయింది.కరుణించమని దలుడు ప్రాధేయపడ్డాడు.వామదేవుని కరుణించి దలా నీవు నీ భార్యను తాకిన నీకీ స్థంభన ఉండదు.వెళ్ళి నీ భార్యను తాకిరా అనగా దలుడు అట్లు చేయగా వాడకి చేతులు కదలసాగినవి. దలుని భార్య వామదేవుని కాళ్ళపై బడి పతిభిక్ష పెట్టమని వేడుకొంది.వామదేవుడు కరుణించాడు.దలుడు సవినయంగా వామదేవునకు గుర్రములను తిరిగి యిచ్చి క్షమించమని వేడుకొన్నాడు.ఋషి శాంత స్వభావుడు కనుక క్షమించి అశ్వములను తీసికొని తన ఆశ్రమమునకు వెళ్ళిపోయి జీవించసాగాడు.
బలరామకృష్ణుల దర్శనము
[మార్చు]అనంతరం మొకనాడు భరద్వాజ మహర్షితో కలిసి వామదేవుడు తీర్థయాత్రలు చేయూచూ యమునా నదీ ప్రాంతమున తిరుగుచూ బలరామకృష్ణులను దర్శించాడు.శ్రీకృష్ణుడు భరద్వాజ వామదేవులను పూజించి నమస్కరించాడు. వామదేవుడు వసుమనుడను రాజు కోరగా రాజధర్మం ఉపదేశిస్తూ అనేక విషయాలు తెలియజేశాడు.సుబాషుడను రాజును అతని దుస్ధితిని దివ్వదృష్టితో తెలిసికొని వారిని కటాక్షించాడు. ఈ విధముగా వామదేవ మహర్షి అనేకులను అనేక విధములుగా కరుణించి వారికి తరుణోపాయ ముపదేశించాడు.