నక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నక్క
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Tribe:
Vulpini

నక్క (ఆంగ్లం Fox; సంస్కృతం: జంబుకము) ఒకరకమైన అడవి జంతువు. ఇది ఒక క్షీరదము, మాంసాహారి. కుక్క, తోడేలు మొదలగు జంతువుల కుటుంబమైన కానిడేకు చెందినది. ఈ జంతువు వేటాడము చాలా తక్కువ, పెద్ద జంతువులు తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. కళేబరాలను తిని, అడవుల పరిసరాలను ఓ విధంగా శుభ్రంగా వుంచుతుంది.

నక్కలు అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా అన్ని ఖండాల్లోనూ కనిపిస్తాయి. అన్ని చోట్లా ఎక్కువగా కనిపించేది ఎర్రనక్క (రెడ్ ఫాక్స్) జాతి. వీటిలో మళ్ళీ 47 రకాలైన ఉపజాతులు ఉన్నాయి.[1] ప్రపంచంలో అన్ని చోట్లా ఉండటం వల్ల, అందరికీ వీటి జిత్తులమారితనం పరిచితం కాబట్టి పాపులర్ కల్చర్ లో, జానపదాల్లో వీటి ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వేట కుక్కల సాయంతో వీటిని వేటాడటం ఐరోపాలో ముఖ్యంగా బ్రిటిష్ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందింది. ఈ అలవాటును వీరు వలస ప్రాంతాల్లో కూడా కొనసాగించారు.

మూలాలు[మార్చు]

  1. Lloyd, H.G. (1981). The red fox (2. impr. ed.). London: Batsford. p. 21. ISBN 978-0-7134-11904.
"https://te.wikipedia.org/w/index.php?title=నక్క&oldid=3875269" నుండి వెలికితీశారు