కృష్ణ పక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పౌర్ణమి తరువాతిరోజు పాడ్యమి నుండి మొదలు అమావాస్య వరకు గల ౧౫ (15) రోజులను (పక్షం రోజులు) కృష్ణ పక్షం అని అంటారు.ప్రతీ నెలకు రెండు పక్షాలు ఉంటాయి. అవి శుక్ల పక్షం, కృష్ణ పక్షం. రెండు పక్షాలని కలిపి ఒక నెలగా పరిగణిస్తారు.చంద్రుడు పౌర్ణమి తరువాతనుండి రోజు రోజుకూ ప్రకాశం తగ్గుతూ అమావాస్య రోజున పూర్తిగా ప్రకాశం క్షీణిస్తాడు. ఈ సమయాన్ని కృష్ణ పక్షం అని అంటారు.ఈ సమయంలోని చంద్రుడిని కృష్ణ పక్ష చంద్రుడని అంటారు. అనగా రోజు రోజుకీ క్షీణిస్తున్న చంద్రుడని అర్థం.