గోకుల్
గోకుల్ | |
---|---|
Coordinates: 27°27′N 77°43′E / 27.45°N 77.72°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | మథుర జిల్లా |
Elevation | 163 మీ (535 అ.) |
జనాభా (2001) | |
• Total | 4,041 |
Demonym | గోకుల్ వాసి |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | యుపి-85 |
గోకుల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, మథుర జిల్లాలోని ఒక పట్టణం. మధురకు ఆగ్నేయంగా 15 కిలోమీటర్లు (9.3 మై.) దూరంలో ఉంది. భాగవత పురాణం ప్రకారం, శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గోకులంలో గడిపాడు.[1]
భౌగోళిక శాస్త్రం
[మార్చు]ఈ పట్టణం సముద్రమట్టానికి సగటున 163 మీటర్లు (535 అ.) ఎత్తులో ఉంది.
గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం గోకుల్ ప్రాంతంలో 4041 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 55% మంది, స్త్రీలు 45% మంది ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 60%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 68% కాగా, స్త్రీల అక్షరాస్యత 49%గా ఉంది. జనాభాలో 18% మంది 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[2]
ఆసక్తికరమైన ప్రదేశాలు
[మార్చు]మహాప్రభు శ్రీమద్ వల్లభాచార్య బైఠక్జీ
[మార్చు]శ్రీ వల్లభాచార్య మహాప్రభు గోకుల్, పురుషోత్తముడు శ్రీ కృష్ణుడు లీల చేసిన ప్రదేశాలను తిరిగి కనుగొన్నాడు. అక్కడ బైఠక్జీ అనే రెండు చోట్ల (1. గోవింద్‌ఘాట్ 2. బడి భీతర్ బైఠక్) శ్రీమద్ భగవత్ పారాయణ చేశాడు.
రాజా ఠాకూర్ దేవాలయం
[మార్చు]వల్లభ సంప్రదాయ పుష్టిమార్గ్‌లోని ప్రముఖ దేవాలయం. గుసాయిజీకి నిలయంగా ఉంది. స్వయం ప్రకటిత దైవుడైన శ్రీ నవనిట్లాల్ నివసించిన ప్రదేశమిది.
మూలాలు
[మార్చు]- ↑ "Gokul-Lord Krishna's Childhood". greatholidayideas. Archived from the original on 2019-04-12. Retrieved 2022-11-06.
- ↑ . "India - Census, Standards & Statistics".