పంచభూతలింగ క్షేత్రములు
(పంచభూత లింగాలు నుండి దారిమార్పు చెందింది)
పంచ భూత స్థలాలు అయిదు ప్రముఖ శివాలయాలను సూచించును. ఈ అయిదింటిలోఒకొక్కటీ ఒక్కొక్క మూలకమునకు ప్రాతినిధ్యము వహియించును. పంచ భూతములనగా 1.నింగి 2.నేల 3. గాలి 4. నీరు 5. నిప్పు.ఈ అయిదు మూలకాల అభివ్యక్తీకరణమే పంచ భూత క్షేత్రాలు. పంచభూత స్థలములన్నియు దక్షిణ భారతదేశమందే గలవు.ఇందు నాలుగు తమిళనాడులోనూ మిగిలిన ఒకటి ఆంధ్రమునందును గలదు. అవి:
మూలకము | లింగము | కోవెల | ప్రాంతము | అక్షాంశ రేఖాంశములు |
నింగి | ఆకాశ లింగము | నటరాజ స్వామి కోవెల [1] | చిదంబరము | 11.399596, 79.693559 |
నేల | పృథ్వీ లింగము[2] | ఏకాంబరేశ్వరాలయము[1] | కంచి | 12.847604, 79.699798 |
గాలి | వాయులింగము | శీకాళహస్తీశ్వరాలయము[1][3] | శ్రీకాళహస్తి | 13.749802, 79.698410 |
నీరు | జలలింగము | జంబుకేశ్వర కోవెల | తిరువానైక్కావల్ | 10.853383, 78.705455 |
నిప్పు | అగ్నిలింగము | అరుణాచలేశ్వరాలయము | తిరువణ్ణామలై | 12.231942, 79.067694 |