పంచభక్ష్యాలు
స్వరూపం
మనిషి తినగలిగిన, త్రాగగలిగిన పలు పదార్ధాలను ఐదుగా పెద్దలు నిర్ణయించారు. వాటిని పంచభక్ష్యాలు అంటారు. వాటిని కలిపితే మనం తినే పూర్తి స్థాయి భోజనం అవుతుంది. మనం తినే ఆహారం సమీకృతంగా, జీర్ణక్రియ సక్రమంగా ఉండాలని మన పెద్దలు తయారు చేసిన ఆహార ప్రణాళికలో భాగం ఇది.[1]
పంచ భక్ష్యాలు
[మార్చు]- భక్ష్యము = కొరికి తినేవి (పూర్ణాలు, పండ్లు, గారె, అప్పము వంటివి)
- భోజ్యము = నమిలి తినేవి (అన్నం, పులిహోర, దధ్యోదనం వంటివి)
- చోష్యము = పీల్చుకునేది/జుర్రుకునేది (పాయసం, రసం, సాంబార్, జ్యూస్ లాంటివి)
- లేహ్యము = నాక్కుంటూ తినదగినది (తేనె, బెల్లం పాకం లాంటివి)
- పానీయము = త్రాగేది (నీళ్ళు, కషాయం, పళ్ల రసం వంటివి)
ఈ ఐదు రకాల ఆహారాలను రోజూ తీసుకోలేము. కానీ పండగల సందర్భాలలలో వీటన్నింటినీ తీసుకొంటారు. కనుక వీటిని పంచభక్ష్యాకు అంటారు. ప్రతీదానికి ఒక శాస్త్రీయ కారణం ఉంది.
- భక్ష్యం / భోజ్యం - పళ్లు గట్టిగా అవటానికి, బలం చేకూరుస్తుంది
- చోష్యం - ఆకలి పెంచి, జీవక్రియకి దోహదపడుతుంది
- లేహ్యం - మల్టీ విటమిన్ వంటిది
- పానీయం - జీర్ణ క్రియకి ఉపయోగకారి.
మూలాలు
[మార్చు]- ↑ "పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి?". E-Knowledge hub (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-22. Retrieved 2021-06-08.