Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

ద్వారకాధీశుడి ఆలయం

వికీపీడియా నుండి
ద్వారకాధీశుడి ఆలయం
ద్వారకాధీశుని ఆలయ గోపురాలు.
ద్వారకాధీశుని ఆలయ గోపురాలు.
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:గుజరాత్
జిల్లా:ద్వారక
ప్రదేశం:ద్వారక
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ద్వారకాధీశుడు కృష్ణుడు
ముఖ్య_ఉత్సవాలు:జన్మాష్టమి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :చాళుక్యుల నిర్మాణ శైలి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:16వ శతాబ్దం
సృష్టికర్త:వజ్రనాభుడు

ద్వారకాధీశ్, ద్వారక రాజు అన్న నామాలతో ఆరాధించబడుతూ శ్రీకృష్ణునికి అంకితం అయిన ఆలయమే ద్వారకాధీశ్ అనే హిందూ దేవాలయం. గుజరాత్ లోని ద్వారకలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయనిర్మాణం చారిత్మాతకమైన ద్వారకా నగరనిర్మాణం తరువాత నిర్మించబడినదని విశ్వసించబడుతున్నది. మహాభారత యుద్ధానంతరం, శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత శ్రీకృష్ణుని రాజ్యం సముద్రంలో మునిగి పోయింది. ప్రధాన ఆలయమైన జగత్ మందిర్ లేక నిజ మందిర్ ఆలయం 17 మూలస్తంభాల ఆధారంగా 5 అంతస్తులతో నిర్మించబడి ఉంది. ఈ ఆలయ నిర్మాణం జరిగి 2,500 ఏళ్లు అయిందని అంచనా. వల్లభాచార్యుడు, విఠల్‌నాథ్‌జీ ల మార్గనిర్దేశకత్వంలో పూజాదికాలు నిర్వహించబడుతున్న ఈ ఆలయం పుష్టిమార్గ ఆలయాలలో ఒకటి. ప్రస్తుత ఆలయం సా.శ. 16వ శతాబ్దంలో నిర్మించబడింది. మూల ఆలయనిర్మాణం శ్రీకృష్ణుని మనుమడైన వజ్రనాభుని చేత హరిగృహం (శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం) ఉన్న ప్రదేశంలో నిర్మించబడిందని విశ్వసించబడుతున్నది. ఈ ఆలయం భారదేశంలోని పవిత్రమైన చార్‌ధాం హిందూ భక్తియాత్రలో ఒకటిగా భావించబడుతుంది. అధ్యాత్మికవాది, సంస్కర్త అయిన 8వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయంలో కూడా ఒక మందిరం ఈ సందర్భానికి గుర్తుగా నిర్మించబడి శంకరాచార్యునికి అంకితం చేయబడి ఉంది. దివ్యప్రబంధాలలో సూచించబడిన విష్ణుభగవానుని 108 దివ్యప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

పేరులో మొదటి భాగం ద్వారక అనేది నగరాన్ని సూచిస్తుంది. ఆది అనేది మొదటి అనేది సూచిస్తుంది. మొదటి వాడు భగవంతుడు కనుక దానికి అధిపతి ఆధీశుడు అయ్యాడు. ద్వారకానాధుని ఆలయం కనుక ఈ ఆలయం ద్వారకాధీశ్ అయింది.

చరిత్ర

[మార్చు]

ద్వారకా నగరం మహాభారత కాలంలో గోమతీ నదీ తీరంలో నిర్మించబడినట్లు పురాణాలు వర్ణిస్తున్నాయి. పురాణకాల పురాతన నగరమైన ఈ నగరం భగవంతుడైన శ్రీకృష్ణుని రాజధాని నగరంగా ఉంటూ వచ్చింది. పురాతన నగరం సముద్రంలో మునిగి పోయినట్లు గుర్తించబడింది. సముద్రాంతర్భాగ పరిశోధనలు ఈ విషయాన్ని ధృవపరిచాయి.

నిర్మాణ శైలి

[మార్చు]
ద్వారకాధీశ్ ఆలయంలో ప్రవేశించే మెట్లు ద్వారక

సా.శ.పూ. 400 సంవత్సరంలో శ్రీకృష్ణుని మునిమనుమడైన వజ్రనాభుని చేత నిర్మించబడిందని విశ్వసించబడింది. అయినప్పటికీ ప్రస్తుత నిర్మాణం సాశ. 16వ శతాబ్దంలో అచ్చమైన చాళుక్యుల శైలిలో నిర్మించబడింది. ఈ అద్భుత ఆలయం ఎత్తు 51.8 మీటర్లు. జగత్ మందిర్ అని కూడా పిలువబడుతున్న ఈ ఆలయానికి రెండు శిఖరాలు ఉన్నాయి. నిజశిఖరం అనబడే పెద్దశిఖరం గర్భాలయంలో శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నాడు. ఈ బృహత్తరమైన ఆలయంలో అద్భుతమైన శిల్పకళానైపుణ్యం కలిగిన 60 స్తంభాలు, అనేకశిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు ద్వారకను తరువాతి కాలంలో పాలించిన వివిధ గుప్తులు, పల్లవులు, చవద సామ్రాజ్యాలకు చెందినవని భావించబడుతుంది.

ఆలయానికి ఉత్తరాన ఉన్న ద్వారాన్ని మోక్ష ద్వారం అని పిలుస్తారు. దక్షిణ ద్వారం స్వర్గ ద్వారం అని పిలువబడుతుంది. పురాణకథనాన్ని అనుసరించి ఈ ఆలయం విశ్వకర్మ చేత ఒక్కరోజులో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. 2.25 అడుగుల శ్రీకృష్ణుని విగ్రహం చెక్కడానికి మెరిసే నల్లరాయి ఉపయోగించబడింది. భగవానుడి నాలుగు చేతులలో ఒకదానిలో శంఖం, మరొక చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో గద, నాలుగవ చేతిలో తామర పుష్పం ఉన్నాయి. ఈ విగ్రహాన్ని శంఖ, చక్ర, గదా, పద్మ చతుర్భుజి అంటారు. శత్రువుల దాడి నుండి రక్షించడానికి ఈ విగ్రహం సంవత్సరాల కాలం దాచి ఉంచబడింది. మధ్యకాలంలో రుక్మిణీ మందిరంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ప్రస్తుత ఆలయం నిర్మించబడిన తరువాత అసలైన విగ్రహం ప్రతిష్ఠించబడింది.

ఆలయ ప్రత్యేకతలు

[మార్చు]
  • సూర్యచంద్రుల చిత్రాలు కలిగిన జండా గోపురం మీద ఎగురుతూ ఉంటుంది.
  • చిహ్నం మాత్రం అలాగే ఉన్న జండాలు ఒక రోజులో ఐదు మార్లు మార్చబడుతూ ఉంటుంది.
  • ఆలయపరిసరాలలో జరుగుతున్న విశేషపరిశోధనలు, విలువైన ఆలయనిర్మాణం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించపడుతూ ఉంది.
  • ఈ ఆలయం నిర్మాణంలో రెండు సంప్రదాయాలు చోటు చేసుకున్నాయి. ద్వారకాధీశ్ ఆలయం శైవసంప్రదాయంలో నిర్మితమై ఉంది. బెట్ ద్వారకలోని ఆలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మితమై ఉంది.

ఇతర ప్రాముఖ్యతలు

[మార్చు]
  • ఆలయం ఎత్తు 78.3 మీటర్లు.
  • సున్నపురాయితో నిర్మించబడిన ఈ ఆలయం ఇంకా చెక్కుచెదర కుండా ఉంది.
  • ఆలయం నిర్మాణంలో ఈ భూమిపాలించిన సాంరాజ్యాల నిర్మాణశైలులన్నీ చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఆలయవైశాల్యంలో మాత్రం మార్పు చేయబడలేదు.
  • శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశంలో శ్రీకృష్ణుని మనుమడైన వజ్రనాభుని చేత ఈ ఆలయం నిర్మించబడిందని విశ్వసించబడింది.
  • జగత్ మందిర్ లేక నిజమందిర్ అనబడే పవిత్రాలయ నిర్మాణం జరిగి 2,500 సంవత్సరాలు అయిందని అంచనా.
  • ఆలయ ఉత్తర ద్వారాన్ని మోక్ష ద్వారం, దక్షిణ ద్వారాన్ని స్వర్గ ద్వారం అంటారు.
  • ఆలయం వెలుపలి ద్వారం నుండి 56 మెట్లు దిగువన గోమతీ నది ప్రవహిస్తుంది.

చార్ ధాం

[మార్చు]

పవిత్రమైన చార్ ధాం ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. నాలుగు పవిత్ర ఆలయాలు రామేశ్వరం, బద్రీనాథ్, పూరి, ద్వారక. ఆధారపూరితం కానప్పటికీ ఇక్కడ అద్వైత పాఠశాల హిందూ సన్యాస సంస్థలను దేశమంతటా స్థాపించిన శంకరాచార్యుల చేత ఆరంభించబడిందని విశ్వసిస్తున్నారు. నాలుగు చార్ ధాం ఆలయాలు దేశం నాలుగు మూలలలో స్థాపించబడ్డాయి. బద్రీనాథ్ దేశానికి ఉత్తరదిశలోనూ, జగన్నాథ్ ఆలయం తూర్పున పూరీ నగరం లోనూ, రామేశ్వరం ఆలయం దేశానికి దక్షిణంలో ఉన్న రామేశ్వరం లోనూ, పడమరలో ద్వారకాపురిలో ద్వారకాధీశ్ ఆలయం ఉన్నాయి. దేశానికి నాలుగు చెరగులా ఉన్న ఆలయాలు సిద్ధాంతపరంగా శైవ, వైష్ణవ మతాలకు ప్రతీకగా హిందూ సాంప్రదాయక యాత్రకు లక్ష్యాలుగా ఉన్నాయి. అయినప్పటికీ హిమాలయాలలో మరి ఒక చిన్న చార్ ధం యాత్ర ఉంది. అవి వరుసగా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. ఇవి అన్నీ హిమాలయ శిఖరాలలో ఉన్నాయి. అసలైన చార్ ధాం నుండి వైరుధ్యం చూపడానికి వీటిని చోటా (చిన్న) చార్ ధం అంటారు. 20వ శతాబ్దపు మధ్యకాలంలో ఈ చోటా చార్ ధాం పిలువబడుతూ ఉంది. హిందువులు జీవితకాలంలో ఒక సారి ఈ ఆలయాలను దర్శించాలని లక్ష్యంగా పెట్టుకోవడం సాధారణం. సంప్రదాయకంగా ఈ యాత్ర పూరీ జగన్నాథ్ ఆలయదర్శనంతో మొదలై గడియారపు భ్రమణదిశగా సాగడం అలవాటు.

వైష్ణవ దివ్యక్షేత్రం

[మార్చు]

శ్రీ ద్వారక

[మార్చు]

ఇది 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి.

వివరాలు

[మార్చు]

కల్యాణ నారాయణన్-కల్యాణదేవి-గోమతీదేవి-అష్టమహిషలు-హేమకూట విమానము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-ద్రౌపతికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్-తిరుమంగై ఆళ్వార్-ఆండాళ్-పెరియాళ్వార్ కీర్తించింది.

విశేషాలు

[మార్చు]

విశే: ఇయ్యది ముక్తి ప్రద క్షేత్రములలో నొకటి. సన్నిధికి సమీపముననే గోమతీ నది సముద్రములో కలియుచున్నది. అక్కడ నుండి బస్సుమార్గమున పోయి బేటి ద్వారక చేరవలెను. ఇది శ్రీకృష్ణుని నివాస స్థలము. ఇచట 1500 గృహములు ఉన్నాయి. ఇచట మాలవరులు శంఖ చక్రధారియై వేంచేసియున్నారు. దీనికి 5 కి.మీ. దూరమున శంఖతీర్థము ఉంది. ఇచట పెరుమాళ్ళ వక్షస్థలమున పిరాట్టి వేంచేసియున్నారు. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. అనేక సన్నిధులు ఉన్నాయి. ప్రతిదినము తిరుమంజనము జరుగును. పసిపిల్లవానివలె-రాజువలె-వైదికోత్తమునివలె అలంకారములు జరుగును.

ద్వారక నుండి ఓఘ పోవుమార్గములో 5 కి.మీ. దూరమున రుక్మిణీదేవి సన్నిధి గలదు. ఇదియే రుక్మిణీ కల్యాణము జరిగిన ప్రదేశము. ద్వారక సమీపమున తోతాద్రి మఠము ఉంది. విరావన్‌స్టేషన్‌లో దిగి 160 కి.మీ. దూరమునగల రైవతక పర్వతమును చేరవచ్చును. ఇచట అనేక సన్నిధులు గలవు. కృష్ణావతారమునకు ముందుగానే సేవసాయించిన ప్రదేశము. శయనతిరుక్కోలము.

మార్గము:బొంబాయి-ఓగా రైలుమార్గములో ఓగారేవు ముఖద్వారానికి 35 కి.మీ. దూరము. అహమ్మదాబాద్ నుండి బస్‌లు గలవు. అన్నివసతులు ఉన్నాయి.

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీ గోమతీ పుణ్య సరస్తటస్థే శ్రీ ద్వారకాఖ్య నగరే విరాజన్
   కల్యాణ నారాయణ నామధేయ:కళ్యాణదేవ్యా పరిభూషితాజ్గ:||
   దివ్యాష్ట మహిషీ నాథో ద్రౌపదీ దృష్టి గోచర:
   హేమకూట విమానస్థ: పశ్చిమాభి ముఖానస:|
   పరాంకుశ కలిధ్వంసి గోదావిష్ణు మనస్తుత:||

పాశురాలు

[మార్చు]

పా. కూట్టిలిరున్దు కిళియెప్పోదుమ్‌ కోవిన్దా! కోవిన్దా! ఎన్నழைక్కుమ్‌
   ఊట్టక్కొడాదు శెఱుప్పనాగిల్ ఉలగళన్దాన్! ఎన్ఱు ఉయరక్కూవుమ్;
   నాట్టిల్ తలైప్పழிయెయ్‌ది యుజ్గళ్ నన్మైయిழన్దు తழయిడాదే
   శూట్టుయర్ మాడజ్గళ్ శూழ்న్దు తోన్ఱుమ్‌ తువరావదిక్కెన్నైయుయ్ త్తిడుమిన్.
            ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 0-12-9

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

పరిశీలనకు

[మార్చు]