తిరువణ్ వండూరు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరువణ్ వండూరు | |
---|---|
భౌగోళికాంశాలు : | 9°20′35″N 76°34′47″E / 9.34306°N 76.57972°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | పాంబణయప్పన్ |
ప్రధాన దేవత: | కమలవల్లి త్తాయార్ |
దిశ, స్థానం: | పశ్చిమ ముఖము |
పుష్కరిణి: | పాపనాశపుష్కరిణి |
విమానం: | వేదాలయ విమానము |
కవులు: | నమ్మాళ్వార్ |
ప్రత్యక్షం: | మార్కండేయునకు, నారదునకు |
తిరువణ్ వండూరు భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఈ క్షేత్రము నకులునిచే ప్రతిష్ఠ చేయబడినదని భావిస్తున్నారు. ఆళ్వార్లు అనేకవిధముల సర్వేశ్వరుని ప్రార్థించియు అభీష్టము లభింపక "దానికేమి కారణమని" ఆలోచించి "శ్రియ:పతి తిరువణ్ వణ్డూరులో ఉండి అచటి పూజలకు పరవశుడై తనను మరచి యుండు" నని భావించి స్వామియొక్క ఆర్తరక్షణ దీక్షను గుర్తుచేయదలచి సముద్రతీరమున సంచరించు పక్షులను శ్రియ:పతి యొద్దకు దూతలుగా పంపారు.
సాహిత్యం
[మార్చు]శ్లో. వణ్ వండూర్ పురి పాపనాశ సరసా యుక్తేతు వేదాలయం
వైమానం సమధిశ్రితో వరుణ దిగ్వక్త్ర స్థితి: ప్రీతిమాన్|
దేవ: పాంబణయప్ప నంబుజలతా నాథ స్సముజ్జృంభతే
మార్కండేయ సునారాదాక్షివిషయ: కీర్త్య:శఠద్వేషిణ:||
పాశురాలు
[మార్చు]పా. వైకల్ పూజ్గழிవాయ్; వన్దుమేయు జ్గురుకినజ్గాళ్;
శెయ్‌గొళ్ శెన్నలుయర్; తిరువణ్వణ్డూరుఱైయుమ్;
కైగొళ్ శక్కరత్తైన్;కనివాయ్ పెరుమానై క్కణ్డు;
కైగళ్ కూప్పి చ్చొల్లీర్; వినై యాట్టియేన్ కాదన్మైయే
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 6-1-1
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
పాంబణయప్పన్ | కమలవల్లి త్తాయార్ | పాపనాశపుష్కరిణి | నిలచున్న భంగిమ | పశ్చిమ ముఖము | నమ్మాళ్వార్ | వేదాలయ విమానము | మార్కండేయునకు, నారదునకు |
చేరే మార్గం
[మార్చు]శెజ్గణూర్‌కు వాయువ్యముగా 5 కి.మీ. వసతులు స్వల్పము. తిరువల్లవాళ్ నుండియు సేవింపవచ్చును.