తిరుక్కురుంగుడి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుక్కురుంగుడి Thirukkurungudi Temple | |
---|---|
భౌగోళికాంశాలు : | 8°27′N 77°34′E / 8.45°N 77.56°E |
పేరు | |
ఇతర పేర్లు: | Vamana Shetram, Dakshina Bhadri |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | తిరునెల్వేలి |
ప్రదేశం: | తిరుక్కురుంగుడి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | Sri Sundara Paripooranan |
ప్రధాన దేవత: | Sri Kurungudi Valli Thaayaar |
ఉత్సవ దైవం: | Sri Vadivazhagiya Nambi |
ఉత్సవ దేవత: | Sri Kurungudi Valli Thaayaar, Sri Aandaal |
దిశ, స్థానం: | తూర్పుముఖం |
పుష్కరిణి: | Karanda Maadu |
విమానం: | పంచకేతక విమానం |
కవులు: | Sri Nammazhwar,Sri Periyazhwar,Sri Thirumangai Azhwar,Sri Thirumazhisai Azhwar |
ప్రత్యక్షం: | Sri Nampaaduvaan |
ముఖ్య_ఉత్సవాలు: | Kaisika Puranam, Panguni Brahmotsavam |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
ఇతిహాసం | |
వెబ్ సైట్: | http://www.srivaishnavanambi.org |
తిరుక్కురుంగుడి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఇచట స్వామి వడుగ నంబి రూపముతో ఉడయవరులను (శ్రీరామానుజులను) ఆశ్రయించి వారి నుండి మంత్రోపదేశమును పొంది సకల వేదాంత అంతార్థములను గ్రహించి "మేమును శ్రీభగవద్రామానుజులను ఆశ్రయించితిమి దన్యులమైతి" మని ఆనందముతో ప్రకటించుటచే ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు వచ్చింది. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము మిధునమాసములో జరుగును. వామనుడు వసించిన చోటగుటచే కురుంగుడి యనియు సిద్దాశ్రమమనియు పేరు వచ్చింది. ఉడయవర్ తడివస్త్రములను ఆరబెట్టిన "తిరువట్టప్పారై" ఇచట ఉంది. ఇచట ఉడయవర్ అంజలి ముద్రతో కాక జ్ఞాన ముద్రతో ఉంటాడు. నిన్ఱ-కిడంద (నిలబడి ఉన్న) నంబియార్ల మధ్య శివుని ఆలయము ఉంది.
ఈ సన్నిధికి 10 కి.మీ దూరములో కొండమీద మలైమేల్ నంబి సన్నిధి ఉంది. ఈ దివ్యదేశమున తాయార్ పెరుమాళ్లతో కలసి ఉంటుంది.
ఉత్సవాలు
[మార్చు]మీనం ఉత్తర తీర్థోత్సవము.
సూచన
[మార్చు]ఇచట ఎంబెరుమాళ్ (రామానుజుడు) స్వామికి మంత్రోపదేశము చేయుటచే అన్ని దివ్య దేశములలో ఉన్నట్లు అంజలి ముద్రతో గాక జ్ఞానముద్రతో ఉన్నాడు. తిరుమంగై ఆళ్వార్ శ్రీరంగనాథుని యాజ్ఞానుసారము తిరునాడలంకరించిన ప్రదేశమును వారిని తిరుప్పళ్లి చేర్చిన స్థలమును ఇచట దర్శించవచ్చును.
సాహిత్యం
[మార్చు]శ్లో. శ్రీక్షీరాబ్ది తరజ్గిణీ తటతలే పూర్ణాహ్వయ శ్రీ పతి:|
దివ్యే భాతి తిరుక్కురుజ్గుడి పురే పంచాకృతి ద్యోతిత:|
సంప్రాప్త శ్శుభ పంచకేతిక పదం వైమాన మైంద్రీముఖ
స్థాయీ సాక్షి పదం కురుజ్గుడి లతానాథ శ్శఠారి స్తుత:||
శ్లో. శ్రీ మద్విష్ణు మన శ్శ్రీమత్పర కాల వచ:ప్రియ:|
రామానుజార్య మునిపాత్కృతో భయ విభూతిక:
పాశురాలు
[మార్చు]పా. నిఱైన్ద వన్బழி నజ్కుడిక్కివళెన్ఱు; అన్నై కాణ కొడాళ్;
శిఱన్ద కీర్తి త్తిరుక్కురుజ్గుడి నమ్బియై; నాన్ కణ్డ పిన్;
నిఱైన్దశోతి వెళ్ళమ్ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యొడుమ్;
నిఱైన్దెన్నుళ్లే నిన్నొழிన్దాన్; నేమియజ్గై యుళతే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-5-7
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
వైష్ణవ నంబి, మలైమేల్ నంబి, నిన్ఱ నంబి, ఇరుంద నంబి, కిడంద నంబి, తిరుప్పార్‌కడల్ నంబి. | కురుంగుడి వల్లి తాయార్; | తిరుప్పార్ కడల్ నది | తూర్పు ముఖము | నిలుచున్న భంగిమ | ప్రత్యక్షము, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, తిరుమంగై యాళ్వార్ | పంచకేతక విమానము | పరమ శివునకు |
- ఉడయవరులకు ఉభయ విభూతి నాయకత్వమును అనుగ్రహించిన స్థలము
మార్గం
[మార్చు]నాజ్గునేరి(వానమామలై) నుండి 15 కి.మీ దూరములో గలదు. బస్‌వసతి కలదు. నాంగునేరి నుండి కళక్కాడు పోయి అటనుండి వేరు బస్‌లో తిరుక్కురుంగుడి చేరవచ్చును. ఇక్కడ రామానుజకూటము, జీయర్‌స్వాముల మఠములు ఉన్నాయి. మితమైన సౌకర్యములు ఉంటాయి.
మంచి మాట
[మార్చు] అనాత్మన్యాత్మ బుద్ధి ర్వా అస్వేస్వమితి యామతి:
అవిద్యా తరు సంభూతి:బీజమేతత్‌ద్విథా స్థితమ్||
అవిద్య అనునది యొక వృక్షము.
ఈ వృక్షమునకు పుట్టిన బీజములు రెండు
1. ఆత్మకాని దేహేంద్రియాదులను ఆత్మ అని భావించుట.(అహంకారము)
2. తనదికాని ఆత్మను తనదియని తలంచుట (మమకారము) సంసారులగు చేతనులు ఈ అవిద్యతో కూడియుందురు. ఈఅవిద్య వలన దేవతిర్యక్ మనుష్య స్థావరములను నాల్గు విధములైన జన్మలు కలుగును. కావున ప్రాజ్ఞుడైనవాడు అవిద్యను పారద్రోలవలెను. అనగా అహంకార మమకారములను విడచిపెట్టవలెను.