Jump to content

ముద్ర

వికీపీడియా నుండి
10వ శతాబ్దంలోని చోళ సామ్రాజ్యంలో కంచు శిల్పకళలో నటరాజ విగ్రహం. అందులో వివిధ ముద్రలున్నాయి.

ముద్ర, అనగా హిందూ మతంలో, బౌద్ధ మతంలో చేతులతో, వేళ్ళతో చేసే సంజ్ఞలు లేదా గుర్తులు. వీటిని కార్యాల్లోనూ, నృత్య రూపకాల్లోనూ, శిల్పకళ, చిత్రకళల్లోనూ గమనించవచ్చు.[1] ముఖ్యంగా నాట్యాల్లో ప్రదర్శించే ముద్రలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇవి చాలా సంక్లిష్టంగా, గూఢార్థాలను కలిగి ఉంటాయి. భారతీయ శాస్త్రీయ నాట్యంలో ప్రదర్శించే హస్త ముద్రల్లో సుమారు 500 రకాలైన అర్థాలను వ్యక్తపరచవచ్చని ఒక అంచనా. వీటిని ప్రదర్శించడానికి కేవలం హస్తాలనే కాక, ముంజేతులు, భుజాలను కూడా వాడతారు. శిల్పాల్లో కనిపించే ముద్రలు వీటితో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉంటాయి.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో ముద్ర పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[2] ముద్ర [ mudra ] mudra. సంస్కృతం n. A seal: a seal ring, or signet. The stamp, print, or impression of a seal. A distinguishing mark impressed or burned upon a man or beast. Coinage. మునుపటి ముద్ర రూపాయి a rupee of the old coinage. Gesticulation, attitude. మౌనముద్ర the seal of silence, i.e., silence. నిద్రాముద్ర the seal of sleep, i.e., sound sleep. జ్ఞానముద్ర a particular position of the fingers used in religious ceremonies. ముద్రలు marks impressed upon sand or clay placed on heaps of grain, the permanent marks made on the shoulders representing the insignia of Vishnu which are the shell and the wheel, &c. వాడు ముద్రాధారణము చేసికొనినాడు he received the seals, i.e., his shoulders were sealed with the shell and wheel of Vishṇu. మధ్యులు గోపిముద్రలు వేసికొందురు they wear patches of brown clay. వానికి శునక ముద్ర వేసినారు they stamped him with the figure of a dog. ముద్రకర్త mudra-karta. n. An apparitor, the lowest local officer attached to a Guru or priest, ఆయా స్థలములలో గురువు యొక్క తాబేదారుగా నుండేవాడు. ముద్రకోల mudra-kōla. n. A stamp to mark or seal with. The insignia of Vishnu, being the shell and wheel made in copper. ముద్ర వేయు సాధనము, ముద్రధారణము చేయు సుదర్శన పాంచజన్యములు. ముద్రగడ mudra-gaḍa. n. A sceptre, a royal staff. "తన ముద్రగడ వేరు తలగ బట్టించి." Pal. 450. A wooden stamp. ముద్ర గరిటె mudra-gariṭe. n. A ladle shaped mace or large spoon borne in state before a person in authority, దేశాయీలు మొదలైనవారి ముందర బిరుదుగా తీసికొనిపోవు గంటలు గల యిత్తడి గరిటె. ముద్రణము mudraṇamu. n. Setting one's seal to. ముద్రించుట. Dooming, giving a decision, సిద్ధాంత ప్రతిపాదనము. "కనకాద్రి ముద్రణ గ్రంథకర్త." A. ii. 45. టీ మేరుపు నందును తన ముద్ర చెల్లించువాడు. ముద్ర తీసివేయు mudra-tīsi-vēyu. v. a. To unseal. ముద్రాధారణము mudrā-dhāra-ṇamu. n. Sealing , i.e., the act of impressing the shell and wheel of Vishnu on either shoulder. చక్రంకనము చేసికొనుట. ముద్రపలక mudra-palaka. n. A wooden stamp for sealing a heap of corn. ధాన్యరాశిమీద ముద్ర వేసేపలక. ముద్రమనిషి mudra-manishi. n. A sealer, i.e., a bailiff who seals heaps of corn. అంబారములకు ముద్ర వేయు బంట్రౌతు. ముద్రవేయు mudra-vēyu. v. a. To seal. ఈ బోగము వాండ్లు ఆగుడికి ముద్ర వేయబడినారు these dancing girls are dedicated to that temple. ముద్రాంకితము mudr-ānkitamu. adj. Sealed, marked with a seal. ముద్ర వేయబడిన. ముద్రాంకితుడు mudr-āankituḍu. adj. One who is impressed with shoulder. సమాశ్రయణము. చేసికొన్నవాడు. ముద్రాక్షరశాల mudr-āksharu-ṣāla. n. A press or printing office. అచ్చుయిల్లు, అచ్చుకూటము. ముద్రించు mudrinṭsu. v. a. To seal. ముద్రవేయు, అచ్చువేయు. "మృషావాదింజేయుదు ననుతలంపు ముద్రించి." HN. v. 176. ముద్రిక mudrika. n. A seal ring, శిఖా ఉంగరము. ముద్రితము mudritamu. adj. Sealed, marked, stamped, closed. ముద్ర వేయబడిన, మూసికొనిన, ముకుళితమైన.

కొన్ని ముద్రలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "గూగుల్ బుక్స్ లో ముద్ర గురించిన వ్యాసం".
  2. బ్రౌన్ నిఘంటువు ప్రకారం ముద్ర పదప్రయోగాలు.[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ముద్ర&oldid=3881873" నుండి వెలికితీశారు