Jump to content

కపోతం

వికీపీడియా నుండి
(కపోతము నుండి దారిమార్పు చెందింది)

పావురాలు
ఎగురుతున్న ఫెరల్ కపోతము (Columba livia domestica)
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
కొలంబిడే
ఉపకుటుంబాలు

see article text

కపోతం (ఆంగ్లం Pigeon) ఒక రకమైన పక్షి. ఇవి కొలంబిఫార్మిస్ క్రమంలోకొలంబిడే కుటుంబానికి చెందినవి. వీటిలో సుమారు 300 జాతులు ఉన్నాయి. వీటిలో పెద్దగా ఉండే జాతులను కపోతాలు అని, చిన్నగా ఉండే జాతులను పావురాలు అని అంటారు [1] పావురం (Dove) 'శాంతి'కి చిహ్నం.

ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి కానీ ముఖ్యంగా ఇండోమలేసియా, ఆస్ట్రేలాసియా ప్రాంతాలలో ఎక్కువ రకాలున్నాయి.

కపోతాలు పొట్టిగా లావుగా ఉండి, చిన్న మెడ, ముక్కు కలిగివుంటాయి. సామాన్యంగా మనం పట్టణాలలో ఇంటి పరిసరాల్లో చూసే కపోతాలను ఫెరల్ కపోతాలు (Feral Pigeon) అంటారు.

కపోతాలు చెట్లు, కొండచరియలు, ఆపార్టుమెంటుల మీద పుల్లలతో గూడు కట్టుకుంటాయి. ఇవి ఒకటి లేదా రెండు గుడ్లు పెడతాయి. పిల్లల్ని ఆడమగ పక్షులు రెండూ సంరక్షిస్తాయి. పిల్లలు 7 నుండి 28 రోజుల తర్వాత గూడు వదిలి ఎగిరిపోతాయి.[2] పావురాలు గింజలు, పండ్లు, చిన్న మొక్కల్ని తింటాయి. చాలామంది కపోతం అనే పేరు బదులు పావురం అనే పదం వాడతారు. పావురాల విసర్జన, దాని నుండి వెలువడే దుర్వాసన కారణంగా ప్రజలు పావురాలకు దూరంగా ఉంటారు. అలాగే, పావురాలు తమ ఇళ్లలోకి రాకుండా ఉండేందుకు ఇళ్ల బాల్కనీలపై పక్షి భద్రత వలలను ఏర్పాటు చేస్తారు.[3]

కపోతాలు గురించి కొన్ని విశేషాలు

[మార్చు]
  • కపోతం, పావురం చూడటానికి సుమారు ఒకేలా ఉంటాయి.
  • పావురాలు కపోతాలకంటే చిన్నవి. పావురాలు జనారణ్యాల్లో కనిపించవు.
  • కపోతం, పావురం - ఈ రెండూ ఒకే కుటుంబానికి శాస్త్రీయ వర్గీకరణ ...

ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి కానీ ముఖ్యంగా ఇండోమలయా, ఆస్ట్రేలాసియా ప్రాంతాలలో ఎక్కువగా రకాలున్నాయి.

కపోతాలు పొట్టిగా లావుగా ఉండి, చిన్న మెడ, ముక్కు కలిగివుంటాయి. సామాన్యంగా మనం పట్టణాలలో ఇంటి పరిసరాల్లో చూసే కప, జాతులు వేరు. అందుకే కపోతాన్ని పావురముగా పొరబడుతుంటారు.

  • పూర్తిగా ఎదిగిన కపోతం ఒంటిమీద దాదాపు పదివేల ఈకలుంటాయి!
  • పావురాలు దాదాపు 26 మైళ్ల దూరంలో ఉన్నవాటిని కూడా గుర్తిస్తాయి. అందుకే యుద్ధాల్లో శత్రు సైన్యాలను గుర్తించేందుకు పావురాలను ఉపయోగించేవారు. అంతేకాదు, వీటికి ఏకాగ్రత ఎక్కువ. ఎలాంటి దారిలోనయినా కన్‌ఫ్యూజ్ అవకుండా వెళ్లిపోగలవు. అందుకే సందేశాలను వీటితో పంపించేవారు!
  • వీటి గుండె నిమిషానికి ఆరు వందలసార్లు కొట్టుకుంటుంది. ఇవి సెకనుకు పదిసార్లకు పైగా రెక్కలు ఆడిస్తాయి. పదహారు గంటలపాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి!
  • తలను పైకి ఎత్తకుండా మింగే శక్తి ఉన్న పక్షి పావురం మాత్రమే. ఇతర పక్షులన్నీ నీటినిగానీ, ఆహారాన్నిగానీ నోటిలోకి తీసుకున్న తర్వాత తలను పెకైత్తి మింగుతాయి!
  • పావురాలు జీవితంలో ఒక్కదానితోనే జతకడతాయి. చాలా పావురాలు తమ జంట పావురం చనిపోతే మరో దానికి దగ్గర కాకుండా అలాగే ఉండిపోతాయని పరిశోధనల్లో తేలింది!
  • వీటి గొంతులో ఓ సంచిలాంటి గ్రంథి ఉంటుంది. అందులో పాలలాంటి తెల్లటి ద్రవం ఉత్పత్తి అవుతుంది. ఈ ద్రవాన్ని పిల్లల నోటిలో వేస్తాయి పావురాలు. కొంతకాలం పాటు తల్లిదండ్రులిచ్చే ఈ పాలతోనే పిల్లలు పెరుగుతాయి!
  • అన్ని పక్షుల పిల్లలూ కనిపిస్తాయి కానీ, పావురాల పిల్లలు సాధారణంగా ఎక్కడా కనిపించవు. అన్ని పక్షుల పిల్లలూ పుట్టిన పది, పదిహేను రోజులకు ఎగరడం మొదలుపెడతాయి. కానీ పావురాల పిల్లలు మాత్రం రెండు నెలలకు గానీ ఎగరవు!
  • పావురాలతోనే ఎందుకు లేఖలు పంపేవారు పావురం[4]

చిత్రమాలిక

[మార్చు]
పావురం
పావురం

మూలాలు

[మార్చు]
  1. Baptista, L. F.; Trail, P. W. & Horblit, H. M. (1997). Family Columbidae (Doves and Pigeons). In: del Hoyo, J.; Elliott, A. & Sargatal, J. (editors): Handbook of birds of the world, Volume 4: Sandgrouse to Cuckoos. Lynx Edicions, Barcelona. ISBN 84-87334-22-9.
  2. Crome, Francis H.J. (1991). Forshaw, Joseph (ed.). Encyclopaedia of Animals: Birds. London: Merehurst Press. pp. 115–116. ISBN 1-85391-186-0.
  3. "Anti Birds Nets". eyan safety nets.
  4. "అన్ని రకాల పక్షులుంటే.. పావురాలతోనే ఎందుకు లేఖలు పంపేవారు? అసలు కారణం ఏంటంటే?". Telugu Action. 2023-12-24.

బయట లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కపోతం&oldid=4075964" నుండి వెలికితీశారు