Jump to content

తిరునెల్వేలి

అక్షాంశ రేఖాంశాలు: 8°42′49″N 77°45′24″E / 8.71361°N 77.75667°E / 8.71361; 77.75667
వికీపీడియా నుండి
Tirunelveli
Nellai (shortened)
Tinnevely (colonial)
Clockwise from Top Left : Swami Nellaiappar Temple, Tirunelveli Junction Railway Station, Thiruvalluvar Bridge – Aerial view, Town Arch, Speaker Chellapandian Flyover near Vannarapettai at night, Tirunelveli City Skyline, Older side of Sulochana Mudaliar Bridge at night across river Thamirabharani connecting Downtown Tirunelveli and Kokkirakulam, NH 44 cutting through the Reddiyarpatti Hillock, Thamirabarani River passing between Downtown Tirunelveli and Kokkirakulam, Tirunelveli City Municipal Corporation Building
Clockwise from Top Left : Swami Nellaiappar Temple, Tirunelveli Junction Railway Station, Thiruvalluvar Bridge – Aerial view, Town Arch, Speaker Chellapandian Flyover near Vannarapettai at night, Tirunelveli City Skyline, Older side of Sulochana Mudaliar Bridge at night across river Thamirabharani connecting Downtown Tirunelveli and Kokkirakulam, NH 44 cutting through the Reddiyarpatti Hillock, Thamirabarani River passing between Downtown Tirunelveli and Kokkirakulam, Tirunelveli City Municipal Corporation Building
Tirunelveli is located in Tamil Nadu
Tirunelveli
Tirunelveli
Tirunelveli, Tamil Nadu
Tirunelveli is located in India
Tirunelveli
Tirunelveli
Tirunelveli (India)
Coordinates: 8°42′49″N 77°45′24″E / 8.71361°N 77.75667°E / 8.71361; 77.75667
Country India
StateTamil Nadu
RegionPandya Nadu
DistrictTirunelveli District
BoroughsTirunelveli Town
Palayamkottai
Melapalayam
Pettai
Thachanallur
Government
 • TypeMunicipal Corporation
 • BodyTirunelveli City Municipal Corporation
 • MayorSaravanan
విస్తీర్ణం
 • Metropolis189.9 కి.మీ2 (73.3 చ. మై)
 • Rank3
Elevation
73 మీ (240 అ.)
జనాభా
 (2011)[1]
 • Metropolis4,97,826
 • Rank8th in Tamil Nadu
 • జనసాంద్రత2,600/కి.మీ2 (6,800/చ. మై.)
 • Metro
9,68,874
Demonym(s)Tirunelvelian, Nellaikaran (Male) and Nellaikari (Female)
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
Pin Codes
627001 To 627012 , 627353, 627357, 627358
Telephone code91 (0)462, (0)4633
Vehicle registrationTN 72
Websitehttps://www.tirunelvelicorporation.in/

తిరునెల్వేలి, ఇది భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లాలోని ఒక ప్రధాన నగరం. దీనిని చారిత్రాత్మకంగా (బ్రిటీష్ పాలనలో) తిన్నెవెల్లి, నెల్లై అని కూడా పిలిచారు, ఇది తిరునెల్వేలి జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. తిరునెల్వేలి నగరపాలక సంస్థ చెన్నై, కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి, సేలం నగరపాలక సంస్థల తరువాత రాష్ట్రంలోఆరవ అతి పెద్ద నగరపాలక సంస్థ. తిరునెల్వేలి రాష్ట్ర రాజధాని చెన్నైకి నైరుతిన 624 కి.మీ. (388 మై.) లోదూరంలో, తూత్తుకుడి నుండి 58 కి.మీ. (36 మై.) దూరంలో,కన్యాకుమారి నుండి డౌన్ టౌన్ తామిరబరాణి నదికి పశ్చిమఒడ్డున 73 కి.మీ. (45 మై.) దూరంలో ఉంది.దాని జంట పట్టణం పాలయంకోట్టై తామిరబరాణి నదికి తూర్పు ఒడ్డున ఉంది.

తిరునెల్వేలి ఇది రెండు సహస్రాబ్దాల పురాతన నగరముగా పేరు పొందింది. దీనిని ప్రారంభ పాండ్యులు, చేరులు, మధ్యయుగ చోళులు, తరువాత చోళులు, తరువాతి పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం ,బ్రిటీష్ వారు వివిధ సమయాలలో పాలించారు. 1797 నుండి 1801 వరకు నగరశివార్లలో వీరపాండియ కట్టబొమ్మన్, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సేనల నేతృత్వంలోని పాలయ్యక్కరర్లు పాల్గొన్న పాలీగర్ యుద్ధం జరిగింది.

నగరపాలకసంస్థల చట్టం ద్వారా 1994 జూన్ 1న ఏర్పడిన తిరునల్వేలి నగరపాలక సంస్థ ద్వారా తిరునెల్వేలి పరిపాలన సాగుతుంది.నగరం 189.9 కి.మీ2 (73.3 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభాలెక్కలు ప్రకారం 4,73,637 జనాభాను కలిగి ఉంది. ఇతర పురపాలక సంఘాలను ఈపట్టణ పరిధిలో చేరిన తరువాత మొత్తం 9,68,984 మంది జనాభాను కలిగి ఉంది. తిరునెల్వేలి తమిళనాడు, భారతదేశం లోని మిగిలిన ప్రాంతాలతో రోడ్డు, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడింది. సమీప దేశీయ విమానాశ్రయం తూత్తుకుడి విమానాశ్రయం. మధురై అంతర్జాతీయ విమానాశ్రయం, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. సమీప ఓడరేవు తూత్తుకుడి ఓడరేవు.

తిరునెల్వేలిలోని పరిశ్రమలలో పరిపాలనా సేవలు, వ్యవసాయ, వ్యాపారం, పర్యాటకం, బ్యాంకింగ్, వ్యవసాయయంత్రాలు, సమాచార సాంకేతికత, విద్యా సేవలు ఉన్నాయి. అన్నా విశ్వవిద్యాలయం ప్రాంతీయ క్యాంపస్ - తిరునెల్వేలి, తిరునల్వేలి వైద్య కళాశాల, తిరునెల్వేలి పశువైద్య కళాశాల & పరిశోధన సంస్థ, తిరునల్వేలి న్యాయ కళాశాల, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, మనోన్మానియం సుందరనార్ విశ్వవిద్యాలయం ఇంకా మరిన్ని విద్యా సంస్థలతో ఈ నగరం దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ విద్యా కేంద్రంగా ఉంది. అనేక చారిత్రాత్మక స్మారక చిహ్నాలు తిరునెల్వేలి నగరంలో ఉన్నాయి. నెల్లైయప్పర్ ఆలయం అత్యంత ప్రముఖమైంది. ఈ నగరం 'ఇరుతు కడై హల్వా ' అనే తీపి తినుభండారం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

వ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

తమిళనాడు రాష్ట్రంలోని అనేక ఆలయ పట్టణాలలో తిరునెల్వేలి ఒకటి, ఇది ఒకనిర్దిష్ట రకం చెట్టు లేదా పొద. ప్రధానదేవతకు ఆశ్రయం కల్పించే అదేరకమైన చెట్టు లేదా పొదలతో ఆధిపత్యం చెలాయించే తోటలు, సమూహాలు లేదా అడవులకు ఈపేరు పెట్టబడింది. ఈ ప్రాంతం వేణు (వెదురు) అడవితో కప్పబడినందున, దీనికి వేణువనం అని పేరు సంక్రమించింది. [2]తిరునెల్వేలి సంబందర్ ఏడవ శతాబ్దపు శైవ కానానికల్ రచన తేవరంలో తిరునెల్వేలిగా పిలువబడింది. [3] స్వామి నెల్లైయప్పర్ ఆలయ శాసనాలు శివుడు (వృహివృతేశ్వరునిగా) ఒక భక్తుని వరిపంటను రక్షించడానికి ముళ్లకంపగా, పైకప్పు రూపంలో దిగివచ్చాడని చెబుతున్నాయి. హిందూపురాణంలో దేవత కనిపించిందని నమ్ముతున్న ఆలయంలో వెదురు ఉండటం వల్ల ఈస్థలాన్ని వేణువనం ("వెదురు అడవి") అని పిలుస్తారు.[4] ప్రారంభ పాండ్యులు ఈనగరానికి తేన్‌పాండ్య నాడు లేదా తేన్‌పాండ్య సీమై, చోళులు ముడికొండచోళమండలం నాయకులు తిరునెల్వేలి సీమై అని పేరు పెట్టారు.దీనిని బ్రిటీష్ వారు తిన్నెల్వేలి అని, స్వాతంత్ర్యం తర్వాత తిరునెల్వేలి అని పిలిచేవారు. [5] [6] తిరునెల్వేలి అనే పదం మూడు తమిళపదాల నుండి ఉద్భవించింది: తిరు, నెల్, వెలి, అంటే "పవిత్రమైన వెదురు పొద" అని అర్థం. [7] [6]

చరిత్ర

[మార్చు]
granite column with sculpture showing a person with a bow
నెలైయప్పర్ ఆలయంలో చెక్కబడిన స్తంభం (తిరునెల్వేలిలో అతిపెద్ద ఆలయం)

పాండ్య రాజుల పాలనలో తిరునెల్వేలి వారి ద్వితీయ రాజధానిగా, మదురై సామ్రాజ్యానికి ప్రధాన రాజధానిగా ఉండేది.[8] ఈ ప్రాంతంలోని పాండ్య రాజవంశం అశోకుని (304-232 సా.శ.పూ) శాసనాలు, మహావంశం, బృహత్-సంహిత, మెగస్తనీస్ (సా.శ.350-290) రచనలలో పేర్కొనడం ద్వారా సామాన్య శకానికి అనేక శతాబ్దాల పూర్వం నాటిదని తెలుస్తుంది. ఈ రాజ్యం సా.శ. 1064లో రాజేంద్ర చోళ I ఆధ్వర్యంలో చోళుల పాలనలోకి వచ్చింది. అయితే అతను ఈప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడా లేదా స్వచ్ఛందంగా పొందాడా అనేదానిపై అస్పష్టంగా ఉంది. [9] 13వ శతాబ్దం ప్రారంభం వరకు తిరునెల్వేలి చోళుల ఆధీనంలో ఉంది. పాండ్యన్ సామ్రాజ్యం రెండవ రాజధానిగా మదురై స్థాపించబడింది. [10]

13వ, 14వ శతాబ్దాలలో తరువాతి నెల్లైయప్పర్ ఆలయం, పాండ్యుల రాజ మందిరం, ఆ కాలంలో రాజ ప్రోత్సాహంతో నిర్మించిన ఆనకట్టల నుండి నగరం ప్రయోజనం పొందింది. కులశేఖర పాండియన్ (1268-1308) మరణం తరువాత ఈ ప్రాంతాన్ని 16వ శతాబ్దంలో విజయనగర పాలకులు, మారవ ముఖ్యులు (పాలయకారర్లు లేదా పోలెగార్లు ) ఆక్రమించారు. మారవర్లు పశ్చిమ కనుమలు ఆక్రమించుకున్నారు. కన్నడిగులు నల్ల నేలలు అధికంగా ఉండే తూర్పు భాగంలో స్థిరపడ్డారు. తిరునెల్వేలి మధురై నాయకుల అనుబంధ రాజధానిగా పనిచేసింది. [8] విశ్వనాథ నాయక్ ఆధ్వర్యంలో (1529–64) సుమారు 1560లో నగరం పునర్నిర్మించబడింది. నెలైయప్పర్ ఆలయం నుండి వచ్చిన శాసనాలు ఆలయానికి ఉదారంగా చేసిన విరాళాలను సూచిస్తున్నాయి. [11] నాయక్ పాలన 1736లో ముగిసింది.

తరువాత ఈ ప్రాంతాన్ని మొఘల్ సామ్రాజ్యంలోని చందా సాహిబ్ (1740-1754) స్వాధీనం చేసుకున్నారు. అతను తనను తాను "తిన్నెవెల్లి నవాబ్", కర్ణాటక నవాబ్‌గా ప్రకటించుకున్నాడు. 1743లో దక్కన్ పీఠభూమికి చెందిన లెఫ్టినెంట్ నిజాం-ఉల్-ముల్క్, ఈ ప్రాంతం నుండి చాలా మంది మరాఠాలను బహిష్కరించాడు. తిరునెల్వేలి ఆర్కాట్ నవాబుల పాలనలోకి వచ్చింది. అసలు అధికారం బహుగార్ల చేతుల్లో ఉంది. వీరు నిజానికి నాయకుల సైనిక అధిపతులు. ఈ నగరం నెల్లై చీమై అని పిలువబడేది. చీమాయి అంటే "అభివృద్ధి చెందిన విదేశీ పట్టణం"అనే అర్థాన్ని సూచిస్తుంది. [12] బహుగార్లు కొండలలో కోటలు నిర్మించారు.30,000 మంది సైనికులను కలిగి ఉండేవారు. వారు తమలో తాము యుద్ధం చేసుకున్నారు.1755లో, బ్రిటీష్ ప్రభుత్వం మేజర్ హెరాన్, మహ్ఫుజ్ ఖాన్ ఆధ్వర్యంలోఒక మిషన్‌ను పంపింది.ఇది కొంతవరకు ఆ యుద్దాన్ని నివారించి సామాన్య పరిస్థితిని పునరుద్ధరించింది. మహ్ఫుజ్ ఖాన్‌కు నగరాన్ని అందించింది. తిరునెల్వేలికి ఏడుమైళ్ల దూరంలో మహ్ఫుజ్ ఖాన్‌పై పోలీగార్లు యుద్ధం చేసి ఓడిపోయారు. సహాయంకోసం ఈస్టిండియా కంపెనీ ముహమ్మద్ యూసుఫ్‌ను పంపింది.ఖాన్ పాలకుడు అయ్యాడు.1763లో తిరుగుబాటు చేసి 1764లో ఉరితీయబడ్డాడు.1758లో కల్నల్ ఫుల్లార్టన్ నేతృత్వంలోని బ్రిటీష్ దళాలు వీరపాండ్య కట్టబ్రహ్మన ఆధ్వర్యంలోని పాలిగార్ కోటను చుట్టుముట్టారు.1797లో, బ్రిటీష్ వారికి (మేజర్ బ్యానర్‌మన్‌ ఆధ్వర్యంలో) బహుగార్లకు (కట్టబొమ్మన్‌ నేతృత్వంలో) మధ్య మొదటి పాలిగార్ యుద్ధం జరిగింది. కొంతమంది బహుగార్లు (ఎట్టయ్యపురం అధిపతి వంటివారు) బ్రిటిష్ వారికి సహాయం చేశారు.కట్టబొమ్మన్ ఓడిపోయి అతని సొంత రాజ్యం పాంచాలగురుచిలో ఉరి తీయబడ్డాడు. రెండు సంవత్సరాల తరువాత మరొక తిరుగుబాటు రెండవ పాలిగార్ యుద్ధంగా జరిగింది. పాంచాలంగురుచి గట్టిప్రతిఘటన తర్వాత బ్రిటిష్ వారి వశమైంది. ఆతర్వాత కర్ణాటక ప్రాంతం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. [13] [14] [15]

భౌగోళిక శాస్త్రం

[మార్చు]

తిరునెల్వేలి నగరం సముద్రమట్టానికి 47 మీటర్లు (154 అ.) సగటు ఎత్తులో 8°43′41.82″N 77°41′43.94″E / 8.7282833°N 77.6955389°E / 8.7282833; 77.6955389 అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది.[16] ఇది దక్కన్ పీఠభూమి దక్షిణకొనవద్ద ఉంది. తామిరబరాణి నది, నగరాన్ని తిరునెల్వేలి క్వార్టర్, పాలయంకోట్టై ప్రాంతంగా విభజిస్తుంది.ఈ నది (చిత్తార్ వంటి దాని ఉపనదులతో) నీటిపారుదలకి ప్రధాన వనరుగా ఉంది. ఈశాన్య, నైరుతి రుతుపవనాల వర్షాల ద్వారా వీటికి నీరు అందించబడుతుంది. [17] నగరంలో అనేక చిన్నచెరువులు (కుళం అని పిలుస్తారు) ఉన్నాయి. వీటిలో నైనార్ కుళం, వెయింతన్ కుళం, ఎలంత కుళం, ఉడయార్పెట్టి కుళం ఉన్నాయి. తామిరబరణి నది, చిత్తార్ చుట్టూ ఉన్నప్రాంతంలో కొడగన్, పలయన్, తిరునెల్వేలి, మరుదూర్ తూర్పు, మరుదూర్ పడమర అనే ఐదు ప్రవాహాలు ఉన్నాయి. చిత్తార్ మరో పదిహేను మార్గాలను అందిస్తుంది. నేల చిన్న, ఎరుపు, ఇసుకతో ఉంటుంది. [11]

జనాభా శాస్త్రం

[మార్చు]
మతాల ప్రకారం జనాభా
మత వివరం శాతం (%)
హిందూ
  
69.00%
ముస్లిం
  
20.02%
క్రిష్టియన్లు
  
10.59%
జైనులు
  
0.02%
సిక్కులు
  
0.01%
బౌద్ధులు
  
0.01%
ఇతరులు
  
0.35%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తిరునెల్వేలిలో 473,637 జనాభా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 1,027 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే చాలాఎక్కువ.[18]మొత్తం జనాభాలో 46,624 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జనాభా ఉన్నారు. వారిలో పురుషులు 23,894 మంది ఉండగా, 22,730 మంది మహిళలు ఉన్నారు. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 13.17% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.32% మంది ఉన్నారు. నగర సగటు అక్షరాస్యత 81.49%, ఇది జాతీయ సగటు 72.99% కంటే ఎక్కువ ఉంది. [18] నగర పరిధిలో మొత్తం 120,466 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 1,82,471 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 2,088 మంది సాగుదారులు, 5,515 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు 18,914 మంది గృహ పరిశ్రమలు 1, 42,435 మంది ఇతర కార్మికులు, 13,519 మంది సన్నకారు కార్మికులు,166 మంది సన్నకారు కార్మికులు, 9,813 మంది ఇతర వ్యవసాయ కార్మికులు ఉన్నారు. [19] 2011 మతపరమైన జనాభా లెక్కల ప్రకారం, తిరునెల్వేలిలో 69.0% హిందువులు, 20.02% ముస్లింలు 10.59%, క్రైస్తవులు 0.01%, సిక్కులు 0.01%, బౌద్ధులు 0.02%, జైనులు 0.35% మంది ఇతర మతాలను అనుసరిస్తున్నారు.

తిరునెల్వేలి నగరం 108.65 చదరపు కిలోమీటర్లు (41.95 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా సాంద్రత, చదరపు కిలోమీటరుకు 3,781 మంది ఉన్నారు. పట్టణ జనాభాలో హిందువుల శాతం అధిక్యంలో ఉంది. తరువాత స్థానం ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. నగరంలో మాట్లాడే ప్రధాన భాష తమిళం, కానీ ఆంగ్ల వాడకం చాలా సాధారణం.సేవా రంగంలోని చాలా విద్యాసంస్థలలో బోధనా మాధ్యమం ఆంగ్లభాష బోదించబడుతుంది. ఈ ప్రాంతంలో మాట్లాడే తమిళ మాండలికం విభిన్నమైంది. తమిళనాడు అంతటా విస్తృతంగా మాట్లాడతారు. [20] [21]

రాజకీయాలు

[మార్చు]

ఈ నగరం తిరునెల్వేలి శాసనసభ నియోజకవర్గంలోభాగంగా ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్, మాజీ మంత్రి, శాసనసభాపక్షనాయకుడు [22]ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి [23] తిరునెల్వేలి నగరం తిరునల్వేలి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక భాగం. ఈ నియోజకవర్గంలో తిరునెల్వేలి, నంగునేరి, అంబసముద్రం, అలంగులం, రాధాపురం, పాలయంకోట్టై అనే ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[24] ఈ నియోజకవర్గ ప్రస్తుత పార్లమెంటు సభ్యుడుగా డిఎంకెకు చెందిన ఎస్. జ్ఞానతీరవియం కొనసాగుచున్నాడు. [25]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

తిరునెల్వేలి నగరానికి విస్తృతమైన రవాణా సదుపాయాలు ఉన్నాయి. రోడ్డు, రైలు విమాన మార్గాల ద్వారా ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. 2003లో వెయింతంకులంలో కొత్తగా నిర్మించబడిన ప్రధాన బస్ స్టాండ్ 2003లో ప్రారంభించారు.ఇది కొత్త బస్టాండ్‌గా ప్రసిద్ధిచెందింది. నగరంనుండి పొరుగు గ్రామాలకు సేవలందించే స్థానిక బస్సులను కూడానిర్వహిస్తుంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు, చెన్నై, కన్యాకుమారి, త్రివేండ్రం, ఇతర నగరాలకు ఇంటర్‌సిటీ సర్వీసులను కలిగి ఉంది. [20] తిరునెల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. తిరునెల్వేలి నుండి సెంగోట్టై వరకు 1903లో ప్రారంభించబడింది. బ్రిటీష్ ఇండియాలోని ట్రావెన్‌కోర్ ప్రావిన్స్‌కు క్విలాన్‌కు అనుసంధానం అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గం. [26]

తిరునెల్వేలికి సమీప విమానాశ్రయం తూత్తుక్కుడి జిల్లాలోని వాగైకులం వద్ద టుటికోరిన్ విమానాశ్రయం (టిసిఆర్), 22 కి.మీ. (14 మై.) నగరానికి తూర్పున ఉంది. ఇది చెన్నై, బెంగళూరు నగరాలకు రోజువారీ విమానాలను అందిస్తుంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయాలు మధురై అంతర్జాతీయ విమానాశ్రయం,150 కి.మీ. (93 మై.) దూరంలో, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం (టి.ఆర్.వి), సుమారు 130 కి.మీ. (81 మై.) దూరంలో ఉన్నాయి. [20]

చదువు

[మార్చు]

తిరునెల్వేలి నగరంలో 41 ఉన్నత పాఠశాలలు, 22 మధ్య పాఠశాలలు, 17 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 33 పాఠశాలలను నగర పాలస సంస్థ నిర్వహిస్తోంది. నగరంలో ఎనిమిది ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, ఆరు వృత్తి కళాశాలలు ఉన్నాయి. "తమిళ థాయ్ వజ్తు" రాష్ట్ర గీతాన్ని రాసిన కవి మనోన్మణియం సుందరనార్ పేరు మీద మనోన్మనీయమ్ సుందరనార్ విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టబడింది. [27] నగరంలోని చాలా క్రైస్తవ పాఠశాలలు, కళాశాలలు పాలయంకోట్టై ప్రాంతంలో ఉన్నాయి. [28]

అన్నా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ తిరునెల్వేలి 2007లో స్థాపించబడింది, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం వివిధ రకాల ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది.తిరునెల్వేలి మెడికల్ కాలేజ్, [29] వెటర్నరీ కాలేజ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, [30] గవర్నమెంట్ లా కాలేజ్, తిరునెల్వేలి, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరునెల్వేలి [31] తమిళనాడు ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న వృత్తిపరమైన కళాశాలలు, దక్షిణ భారతదేశంలో మహిళల కోసం ఏర్పడిన మొదటి కళాశాల సారా టక్కర్ కళాశాల ఉన్నాయి. [32]

a panoramic view of a river and the city skyline in the harbour
తిరునెల్వేలి విశాల దృశ్యం తమిరబరాణి పాలయంకోట్టై నది ఒడ్డు నుండి వీక్షించబడింది. సులోచన ముదలియార్ వంతెన, రెండు నగరాల మధ్య 12-ఆర్చ్ లింక్, దీపావళి 2009 నాటి చిత్ర.

మూలాలు

[మార్చు]
  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 29 May 2016.
  2. Reddy 2013, p. 10.
  3. Moondram Thirumurai.
  4. Ayyar 1991, pp. 498–499.
  5. Kanmony 2010, p. 42.
  6. 6.0 6.1 Caldwell 1989, p. 88.
  7. P. 2008, p. 67.
  8. 8.0 8.1 Stein et al. 1989, p. 79.
  9. Caldwell 1989, pp. 23–30.
  10. Salma Ahmed 2011, p. 26.
  11. 11.0 11.1 Hunter 1908, pp. 379–380.
  12. The Hindu & 19 May 2007.
  13. Hunter 1908, pp. 375–379.
  14. Caldwell 1989, pp. 93–96.
  15. W. 2002, pp. 214–221.
  16. Falling Rain Genomics.
  17. Hunter 1908, p. 215.
  18. 18.0 18.1 Census dashboard 2011.
  19. Census of India 2011.
  20. 20.0 20.1 20.2 About the city.
  21. Census of India 2001.
  22. 100010509524078 (2021-05-10). "Nainar Nagendran elected BJP's legislative party leader". dtNext.in (in ఇంగ్లీష్). Archived from the original on 2 June 2021. Retrieved 2021-06-01. {{cite web}}: |last= has numeric name (help)
  23. MLA of Tirunelveli 2011.
  24. Parliamentary constituency map 2008.
  25. MP of Tirunelveli 2014.
  26. Hunter 1908, p. 373.
  27. Urban Infrastructure report 2007, p. 21.
  28. Ramchandani 2000, p. 144.
  29. Nellai Medical College.
  30. Veterinary College.
  31. Government College of Engineering, Tirunelveli.
  32. "First Women's Colleges in India". The Hindu. 26 January 2014. Archived from the original on 1 April 2019. Retrieved 28 January 2023.

వెలుపలి లంకెలు

[మార్చు]