Jump to content

పుదుక్కొట్టై

అక్షాంశ రేఖాంశాలు: 10°23′00″N 78°48′00″E / 10.383300°N 78.800100°E / 10.383300; 78.800100
వికీపీడియా నుండి
Pudukkottai
Selection-grade municipality
East Raja Street, Pudukkottai
East Raja Street, Pudukkottai
Nickname: 
Pudugai
Pudukkottai is located in Tamil Nadu
Pudukkottai
Pudukkottai
Location in Tamil Nadu, India
Coordinates: 10°23′00″N 78°48′00″E / 10.383300°N 78.800100°E / 10.383300; 78.800100
Country India
StateTamil Nadu
DistrictPudukkottai
CollectorKavitha Ramu, IAS
Superintendent of PoliceVandita Pandey, IPS
Government
 • BodyMunicipality
విస్తీర్ణం
 • Total21.25 కి.మీ2 (8.20 చ. మై)
Elevation
116 మీ (381 అ.)
జనాభా
 (2011)
 • Total1,17,745
 • జనసాంద్రత5,500/కి.మీ2 (14,000/చ. మై.)
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
PIN
622001 - 622006
Telephone code04322
Vehicle registrationTN-55
Sex ratio995 per 1,000 males /

పుదుక్కోట్టై, భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టై జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఇది వెల్లార్ నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద నగరం. ఇది వివిధ సమయాల్లో, ముత్తరైయర్ రాజవంశం, చోళులు, ప్రారంభ పాండ్యులు, తొండమాన్లు, బ్రిటిష్ వారి పరిపాలనలో సాగింది. ఇది దాదాపు రాష్ట్ర రాజధాని చెన్నైకి నైరుతిన 395 కిలోమీటర్లు (245 మై.), దాదాపు తిరుచిరాపల్లికి ఆగ్నేయంగా 55 కిలోమీటర్లు (34 మై.) దూరంలో ఉంది. శాంతి సౌందరరాజన్ పుదుక్కోట్టైకి చెందిన తొలి తమిళనాడు మహిళా ఆసియా క్రీడాకారిణి [1]

పుదుక్కోట్టైలో ప్రభుత్వ విద్యా సంస్థలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు జిల్లాకు చెందిన పరిపాలనా కార్యాలయాలు ఉన్నాయి. పుదుక్కోట్టై నగరం పుదుక్కోట్టై నియోజకవర్గంలో ఒక భాగం. రామనాథపురం, శివగంగ, తిరుచిరాపల్లి, కరూర్‌లతో కూడిన లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. పుదుక్కోట్టై పురపాలిక, పురపాలక సంఘ చట్టం ప్రకారం 1912లో స్థాపించబడిన ప్రత్వేక తరగతి పురపాలిక ద్వారా నగర పరిపాలనను నిర్వహిస్తుంది. పుదుక్కోట్టై నగరం 21.25 కిమీ2 విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 1,17,745 జనాభాను కలిగి ఉంది. రైలు ప్రయాణ సౌకర్యానికి అనుసంధానం కలిగి ఉంది. రోడ్డు మార్గాలు నగరానికి ప్రధాన రవాణా మార్గం. సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది నగరం నుండి 45 కి.మీ దూరంలో ఉంది.

భౌగోళికం, వాతావరణం

[మార్చు]

పుదుక్కోట్టై వెల్లర్ నది లోయలో 10°23′N 78°49′E / 10.38°N 78.82°E / 10.38; 78.82 వద్ద ఉంది. నగర వాతావరణం ఏడాది పొడవునా అధిక ఉష్ణోగ్రతలు, సాపేక్షంగా తక్కువ వర్షపాతంతో పాక్షిక-శుష్క వాతావరణం కలిగిఉంటుంది. పుదుక్కోట్టై శివార్లలో కొన్ని రాతి కొండలతో సాదా భూభాగాన్ని కలిగి ఉంది. నగరాన్ని చుట్టుముట్టే ఉరుగుమలై, అతిమలై, చెన్నైమలై కొండలు ఉన్నాయి. అమరావతి, నోయల్, భవానీ కావేరి నదులు పుదుక్కోట్టై సమీపంలో ప్రవహించే నదులు. పుదుక్కోట్టైలో నగరం చుట్టు పక్కల గుర్తించదగిన ఖనిజవనరులు అందుబాటులో లేవు. పట్టణంలో మట్టి ఎర్రమట్టి, ఎర్ర ఇసుకలతో కనిపిస్తింది. వరి, వేరుశనగ, అరటి, చెరకు ఈ ప్రాంత ప్రధాన పంటలు. పుదుక్కోట్టైలో ఏడాది పొడవునా వేడి, పొడి వాతావరణం కలగలుపుగా ఉంటుంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 39.7 °C (103.5 °F) నుండి కనిష్టంగా 17.8 °C (64.0 °F) ఉంటుంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే, ఏప్రిల్ నుండి జూన్ వరకు వేడిగా ఉంటుంది. డిసెంబరు నుండి జనవరి వరకు చలిగా ఉంటుంది. పుదుక్కోట్టై సగటున 978.8 mమీ. (38.54 అం.) వార్షిక వర్షపాతం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు, జూన్‌లో ప్రారంభమై ఆగస్టు వరకు తక్కువ వర్షపాతంతో ఉంటుంది. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఈశాన్య రుతుపవనాల సమయంలో అత్యధిక వర్షపాతంతో ఉంటుంది.[2] పురపాలక సంఘం 21.25 కి.మీ2 (21,250,000 మీ2) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[3]

చరిత్ర

[మార్చు]

తొండైమాన్ రాజు, విజయ రఘునాథ పట్టణ ప్రణాళిక సూత్రాల ఆధారంగా పట్టణాన్ని పునర్నిర్మించాడు, తద్వారా ప్రధాన వీధులు లంబ కోణంలో మధ్యలో ఉన్న రాజభవనంతో కలుస్తాయి.[9]

జనాభా గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
196150,428—    
197166,384+31.6%
198187,952+32.5%
199199,058+12.6%
20011,09,217+10.3%
20111,17,745+7.8%
ఆధారం: 1901 – 2001[4] 2011

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పుదుక్కోట్టైలో 1,17,745 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 1,003 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.[5] మొత్తం జనాభాలో ఆరేళ్ల లోపు వారు 960 మంది ఉన్నారు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణం 91.35% అధిక అక్షరాస్యతను కలిగి ఉంది.[6][7]

2011 మత గణన ప్రకారం, పుదుక్కోట్టై నగరంలో 79.40% మంది అనుచరులతో హిందూ మతం మెజారిటీ మతంగా ఉంది. ఇస్లాం రెండవ మతంగా ఉంది. పుదుక్కోట్టై నగరంలో క్రైస్తవ మతం 4.89%, సిక్కు మతం 0.02%, బౌద్ధమతం 0.02% అనుసరిస్తున్నారు. దాదాపు 0.04% మంది 'ఇతర మతం' అని పేర్కొన్నారు, సుమారు 0.50% మంది 'ప్రత్యేక మతం లేదు' అని పేర్కొన్నారు. మొత్తం విస్తీర్ణంలో, 80.85% భూమి అభివృద్ధి చెందినట్లు గుర్తించబడింది. 19.15% నగరం అభివృద్ధి చెందలేదు. పట్టణం మొత్తం వైశాల్యంలో నివాస ప్రాంతాలు 60.1% ఉండగా వాణిజ్య సంస్థలు వరుసగా 4.43%, పారిశ్రామిక యూనిట్లు 1.47% ఉన్నాయి. పట్టణ మంతటా జనసాంద్రత ఏకరీతిగా లేదు. ఇది మధ్యలో ఎక్కువగా ఉంటుంది. శివగండపురం, గణేష్ నగర్, తమిళనాడు హౌసింగ్ ఏరియా వంటి ప్రాంతాలలో తక్కువగా ఉంటుంది. పట్టణ మధ్య భాగంలో హెక్టారుకు 200 నుండి 300 మంది వ్యక్తులు, తక్కువ-సాంద్రత కలిగిన హిందువులు ఉన్న ప్రాంతాలలో హెక్టారుకు 16 - 55 వ్యక్తులు ఉన్నారు. పట్టణ జనాభాలో ఎక్కువ మంది ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. నగరంలో మాట్లాడే ప్రధాన భాష తమిళం, కానీ ఇంగ్లీష్ వాడకం చాలా సాధారణంగా వాడతారు. సేవారంగంలోని చాలా విద్యాసంస్థలు ఉన్నాయి. ఆంగ్ల భాష బోధనా మాధ్యమం.

చూడదగ్గ ప్రదేశాలు

[మార్చు]
  • సిత్తన్నవాసల్ - (పురాతన కాలంలో చిత్రించిన రాతి పడకలు).
  • ప్రభుత్వ మ్యూజియం (ఇది తమిళనాడులో రెండవ అతిపెద్ద మ్యూజియం).
  • తిరుమయం కోట
  • పుదుకులం - ఇది పుదుకోట్టై పట్టణం నీటి అవసరాలకు తోడ్పడే పెద్ద మానవ నిర్మిత చెరువు
  • పుదుకోట్టై ప్యాలెస్ - 18వ శతాబ్దానికి చెందిన సన్యాసి సదాశివ బ్రహ్మేంద్ర రచించిన మంత్రంతో కూడిన ఇసుక పేటిక భద్రపరచబడింది. పుదుక్కోట్టైలో ఒక గొప్ప రాజభవనం.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Poll ticket, crowd-funded academy on Santhi's agenda". The Times Of India. TNN. 2016-05-07. Retrieved 2018-01-01.
  2. "Climate and Rainfall" (PDF). Archived from the original (PDF) on 2018-01-02. Retrieved 2018-01-01.
  3. "About Pudukkottai". Pudukkottai municipality. 2011. Archived from the original on 2 October 2013. Retrieved 2012-12-29.
  4. Urban Infrastructure Report 2008, pp. 6-7
  5. "Area and Population" (PDF). Archived from the original (PDF) on 2018-01-02. Retrieved 2018-01-01.
  6. "Area and Population" (PDF). Archived from the original (PDF) on 2018-01-02. Retrieved 2018-01-01.
  7. "Census Info 2011 Final population totals - Pudukkottai". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. Retrieved 2018-01-01.

వెలుపలి లంకెలు

[మార్చు]