Coordinates: 8°45′51″N 78°08′05″E / 8.764200°N 78.134800°E / 8.764200; 78.134800

తూత్తుకూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Thoothukudi
Tuticorin (colonial)
City
Nickname(s): 
Pearl City, Salt Capital of Tamil Nadu and Sea Gateway of Tamil Nadu.
Thoothukudi is located in Tamil Nadu
Thoothukudi
Thoothukudi
Thoothukudi, Tamil Nadu
Thoothukudi is located in India
Thoothukudi
Thoothukudi
Thoothukudi (India)
Coordinates: 8°45′51″N 78°08′05″E / 8.764200°N 78.134800°E / 8.764200; 78.134800
Country India
StateTamil Nadu
DistrictThoothukudi
Former nameTuticorin
RegionPandya Nadu
Named forMacaroon, Parotta, Pearl and Salt
Government
 • TypeMunicipal corporation
 • BodyThoothukudi City Municipal Corporation
 • Corporation CommissionerT. Charusree, I.A.S.
 • Lok Sabha ConstituencyThoothukkudi
 • State Assembly ConstituencyThoothukkudi
Area
 • Metro
90.663 km2 (35.005 sq mi)
 • Rank8
Elevation
29 మీ (95 అ.)
Population
 (2011)[2]
 • City2,37,830
 • Rank8th in Tamil Nadu
 • Metro
4,11,628 [1]
DemonymThoothukudian
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
PIN
628 0xx
Telephone code+91-461
Vehicle registrationTN-69, TN-92,TN-96
Literacy92.10[1]
ClimateBSh (Köppen)
Coastline40 kilometres (25 mi)
Website

తూత్తుకూడి (గతంలో టుటికోరిన్) భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తూత్తుకూడి జిల్లాలోని ఓడరేవు నగరం.ఇది నగరపాలక సంస్థ ప్రధానకార్యాలయం, పారిశ్రామిక నగరం.ఈ నగరం బంగాళాఖాతంలోని కోరమాండల్ తీరంలో ఉంది. తూత్తుకూడి నగరం తూత్తుకూడి జిల్లాకు ప్రధాన కార్యాలయం. ఇది చెన్నైకి నైరుతిదిశలో 590 kilometres (367 miles), తిరువనంతపురంకు ఈశాన్యంగా 190 kilometres (118 miles), బెంగుళూరుకు ఆగ్నేయంగా 580 kilometres (360 miles) దూరంలో ఉంది. భారత పరిశ్రమల సమాఖ్య ప్రకారం, చెన్నై తర్వాత తమిళనాడులో తూత్తుకూడి రెండవ అత్యధిక మానవ అభివృద్ధి సూచికను కలిగి ఉంది.[3]తూత్తుకూడి నగరం తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. నగరంలోని ప్రధాన విద్యా సంస్థలలో ప్రభుత్వ తూత్తుకూడి వైద్య కళాశాల, చేపల కళాశాల, పరిశోధనా సంస్థ, తమిళనాడు మారిటైమ్ అకాడమీ,[4] విఒ చిదంబరం కళాశాల, కామరాజ్ కళాశాల, అన్నా విశ్వవిద్యాలయం (తూత్తుకూడి క్యాంపస్), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. [5] విఒ చిదంబరనార్ నౌకాశ్రయ సంస్థ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ నౌకాశ్రయాలలో ఒకటి. తూత్తుకూడి "దక్షిణ భారతదేశంలో ఉద్భవిస్తున్న శక్తి, పరిశ్రమల కేంద్రం" గా గుర్తింపు పొందింది. [6]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,37,830 జనాభాను కలిగి ఉంది. పట్టణ సమ్మేళనం జనాభా 4,10,760 కలిగి ఉంది. నగర పరిధి 353.07 km2 (136.32 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని పరిపాలన తూత్తుకూడి నగరపాలస సంస్థ ద్వారా సాగుతుంది. తూత్తుకూడికి రోడ్డు మార్గాలు ప్రధాన రవాణా మార్గం, నగరంలో రైలు, విమాన, సముద్ర రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

తూత్తుకూడి పట్టణ తీరప్రాంతంలో నిర్వహించే ముత్యాల చేపల వేట కారణంగా దీనిని "ముత్యాల నగరం"గా పిలుస్తారు. ఇది ఒక వాణిజ్య నౌకాశ్రయం, దీని ద్వారా దక్షిణ భారతదేశంలోని లోతట్టు నగరాలకు సేవలు అందుతాయి. ఇది తమిళనాడులోని సముద్ర ప్రవేశ మార్గాలలో ఒకటి. భారతదేశంలో సా.శ. 6వ శతాబ్దం నాటి చరిత్ర కలిగిన ప్రధాన ఓడరేవులలో ఇది ఒకటి. ఈ నగరం చాలా ముఖ్యమైన పురాతనమైనదని నమ్ముతారు. వివిధ సమయాల్లో, ప్రారంభ పాండ్యులు, మధ్యయుగ చోళులు, తరువాత చోళులు, తరువాతి పాండ్యాలు, మాబర్ సుల్తానేట్, తిరునెల్వేలి సుల్తానేట్,విజయనగర సామ్రాజ్యం, మదురై నాయకులు, చందా సాహిబ్, కర్నాటిక్ సుల్తానేటులు ,పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వారు పాలించారు. తూత్తుకూడి పోర్చుగీస్, డచ్ పాలన తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే స్థిరపడింది.

నగరంలోని ఎక్కువ మంది ప్రజలు సముద్ర సంపద వ్యాపారం ఉప్పు చిప్పలు, చేపలు పట్టడం, పర్యాటక రంగం ద్వారా ఉపాధి పొందుచున్నారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లోని తూత్తుకూడి, రామేశ్వరం తీరాల మధ్య ఉన్న 21 ద్వీపాలు భారతదేశం లోని మొదటి సముద్ర జీవావరణ ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. వీటిలో దాదాపు 36,000 జాతుల వృక్షజాలం జంతుజాలం కలిగి ఉన్నాయి.ఈ రక్షిత ప్రాంతాన్ని గల్ఫ్ మన్నార్ మెరైన్ జాతీయ ఉద్యానవనం అంటారు. అవర్ లేడీ ఆఫ్ స్నోస్ బసిలికా ఉత్సవాన్ని ఏటా ఆగస్టులో జరుపుకుంటారు.ఇది శివాలయ ఉత్సవం.ఆది అమావాసై, సస్తి, చిత్తిరై రథోత్సవాలు ఈ ప్రాంతంలో ప్రధాన పండుగలు.

తూత్తుకుడిని 'ముత్యాల నగరం' అని, "తమిళనాడు సముద్ర ముఖ ద్వారం" అని అంటారు. [7] తూత్తుకూడి పెర్ల్ ఫిషరీ కోస్ట్‌లో భాగం, పెర్ల్ ఫిషింగ్, చేపల పరిశుభ్ర పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. [8] సా.శ. 16వ-19వ శతాబ్దాలలో పోర్చుగీస్, డచ్, బ్రిటీష్ కాలంలో తూత్తుకూడి ఓడరేవు పట్టణం.1907 తర్వాత ప్రభుత్వ సంస్థల ఉనికి కారణంగా నగరం విస్తరించింది.1907, 1930 మధ్య కాలంలో పాలయంకోట్టై, ఎట్టయ్యపురం రోడ్ల చుట్టూ నివాస, పారిశ్రామికాభివృద్ధి చెందింది. [9]

జనాభా గణాంకాలు[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19611,24,230—    
19711,59,506+28.4%
19811,80,832+13.4%
19911,99,654+10.4%
20013,20,270+60.4%
20114,11,628+28.5%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తూత్తుకూడి నగరం 2,37,830 జనాభాను కలిగి ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 1,010 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఇది, జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ [10] తూత్తుకూడి సగటు అక్షరాస్యత రేటు 92.10%, పురుషుల అక్షరాస్యత రేటు 94.84% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 89.37% ఉంది. మొత్తం జనాభాలో ఆరేళ్లలోపు వారు 24,959 మంది ఉన్నారు.

వారిలో 12,684 మంది పురుషులు కాగా, 12,275 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 7.42% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.1% మంది ఉన్నారు. [10] నగరం పరిధిలో మొత్తం 60,714 గృహాలు ఉన్నాయి.

నగరపరిధి లోని మొత్తం జనాభాలో 83,669 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 114 మంది రైతులు,154 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు,1,498 మంది గృహ పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులు, 77,420 మంది ఇతర కార్మికులు, 4,483 సన్నకారు కార్మికులు, 69 సన్నకారు రైతులు, 25 మంది ఉపాంత వ్యవసాయ కార్మికులు, 25 మంది ఇతర వ్యవసాయ కార్మికులు, 90 మంది మార్జినల్ కార్మికులు, 40 మంది ఇతర వ్యవసాయ కార్మికులు ఉన్నారు.

మతాల ప్రకారం[మార్చు]

మతాల ప్రకారం జనభా (2011)[11]
మతం శాతం
హిందూ
  
64.97%
క్రిష్టియన్లు
  
30.14%
ముస్లిం
  
4.74%
ఇతరులు
  
0.15%

2011 భారత జనాభా లెక్కల సమయంలో, తూత్తుకుడి పట్టణ సముదాయంలో 4,11,628 జనాభా ఉంది.జనాభా మొత్తంలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారు 42,756 మంది ఉన్నారు. [12]

నగరంలో ప్రధానమైన భాష తమిళం. దీనిని జనాభాలో దాదాపు 99% మంది మాట్లాడతారు. మాండలికం నెల్లై తమిళానికి సంబంధించిన తూత్తుకూడి తమిళం. ఆంగ్లభాష విస్తృతంగా మాట్లాడతారు. [13]

తూత్తుకుడి నగరపాలక సంస్థ జనాభాలో 65% హిందువులు, 30% క్రైస్తవులు, 5% ముస్లింలు ఉన్నారు.మొత్తం పట్టణ సమ్మేళనంలో 71% హిందువులు, 25% క్రైస్తవులు 4% ముస్లింలు ఉన్నారు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

నగర పరిధిలో[మార్చు]

మద్రాసు ప్రెసిడెన్సీ కాలంలో తూత్తుకుడి ఓడరేవు, సుమారు 1913

తూత్తుకూడి నగరం విస్తృతమైన రవాణా వ్యవస్థను కలిగి ఉంది. రహదారుల, రైలు, వాయు, సముద్ర మార్గాల ద్వారా ఇతర ప్రధాన నగరాలకు బాగా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. నగరపాలక సంస్థ తన పరిధిలోని 428.54 km (266.28 mi) మొత్తం పొడవు కలిగిన రహదారులను నిర్వహిస్తుంది. నగరంలో 37.665 km (23.404 mi) కాంక్రీట్ రోడ్లు, 329.041 km (204.457 mi) తారు రోడ్లు, 56.592 km (35.165 mi) కంకర రోడ్లు,5.242 km (3.257 mi) కలిగిన మట్టి రోడ్లు ఉన్నాయి. [14] జాతీయరహదారి -138ని కలుపుతున్న తమిళ్ సలై, ఎన్ఎచ్-38ని కలుపుతున్న కామరాజర్ సలై, రాష్ట్ర రహదారి -49ని కలుపుతున్న రామనాథపురం రోడ్, ఎస్ఎచ్-176ని కలుపుతున్న తిరుచెందూర్ రోడ్, విఒ చిదంబరనార్ సలై, విక్టోరియా ఎక్స్‌టెన్షన్ రోడ్ నగరంలోని ప్రధాన రహదారులు. నగరం వెలుపల ఉన్న హైవేపై ఉన్న విఒసి సలై నౌకాశ్రయం సంస్థ, థర్మల్ పవర్ స్టేషన్, ఎస్పిఐసి పరిశ్రమను జాతీయ రహదారి -38 లను కలుపుతుంది.నగరంలో రెండు బస్సు టెర్మినీలు ఉన్నాయి. [15]

రహదారి మార్గం[మార్చు]

తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ వివిధ నగరాలను తూత్తుకూడికి కలుపుతూ రోజువారీ సేవలను నిర్వహిస్తోంది. తమిళనాడు రోడ్డురవాణ సంస్థ కొత్త ప్రాంతీయ ప్రధాన కార్యాలయం తూత్తుకూడిలో ఉంది. ఇది ప్రభుత్వ బస్సుల ద్వారా మెరుగైన రవాణాను కల్పిస్తుంది.[16] రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నగరాన్ని బెంగళూరు, చెన్నై, వెల్లూరు, నాగపట్నం, కన్నియాకుమారి వంటి ముఖ్యమైన నగరాలకు కలుపుతూ సుదూర బస్సులను నడుపుతోంది.

రైలు మార్గం[మార్చు]

తూత్తుకుడి రైల్వే స్టేషన్ భారతదేశం లోని పురాతన ప్రసిద్ధ రైల్వే స్టేషన్లలో ఒకటి. తూత్తుకూడి నుండి సుదూర రైళ్ల నిర్వహణను సులభతరం చేసే రైలు పెట్టెలను శుభ్రపరచడం, నిర్వహణ కోసం పిట్‌లైన్ సౌకర్యం ఉన్న దక్షిణ తమిళనాడులోని కొన్ని స్టేషన్‌లలో ఇది ఒకటి. [17]

వాయు మార్గం[మార్చు]

నగరం నుండి 14 km (9 mi) దూరంలో వాగైకులంలో తూత్తుకుడి విమానాశ్రయం ఉంది. ఇది బెంగుళూరు, చెన్నైకి ఇండిగో ద్వారా నిర్వహించబడే విమాన సర్వీసులను కలిగి ఉంది. ఇది చెన్నైకి ప్రతిరోజూ నాలుగు సర్వీసులను బెంగళూరుకు ఒక ధఫా సర్వీసును నిర్వహిస్తుంది. కొలంబో, దుబాయ్‌లకు రోజువారీ అంతర్జాతీయ అనుసంధానంతో సమీప మదురై కస్టమ్స్ విమానాశ్రయం ఉంది. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం 200 km (124 mi) దూరంలో ఉన్న సమీప అంతర్జాతీయ విమానాశ్రయం .

జల మార్గం[మార్చు]

విఒ చిదంబరనార్ నౌకాశ్రయ సంస్థ ఒక కృత్రిమ లోతైన సముద్ర నౌకాశ్రయం. ఇది భారతదేశంలోని ప్రధాన ఓడరేవులలో ఒకటి. ఒక లగ్జరీ ఫెర్రీ లైనర్, స్కోటియా ప్రిన్స్, శ్రీలంకలోని కొలంబోకు ఫెర్రీ సర్వీస్‌ను నడుపుతోంది. 20 ఏళ్ల తర్వాత రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలు పునరుద్ధరించబడ్డాయి. [18]

విద్యా సౌకర్యాలు[మార్చు]

తూత్తుకుడి నగరంలో 31 పాఠశాలలు ఉన్నాయి.వాటిలో 10 నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది.తూత్తుకూడి నగర అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంది.స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత రేటు అంతరం తక్కువగా ఉంది. [19] నగరంలో ఐదు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, మూడు పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. ఇది తమిళనాడులోని డా. జె. జయలలిత మత్య్య విశ్వవిద్యాలయం, నాగపట్నంకు అనుబంధంగా శివార్లలో ఒక మత్స్య కళాశాల ఉన్నాయి. నగరంలో అన్నా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఒక ప్రభుత్వ కళాశాల, అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల, తిరుచెందూర్ రోడ్డులో తమిళ్ సలై ఆర్ట్స్ కళాశాల ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి ఉన్నాయి. కళాశాలలు తిరునెల్వేలిలోని మనోన్మనీయమ్ సుందరనార్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి. [20] [21]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-10-17. Retrieved 2023-03-10.
  2. "Provisional population totals of UA 2011" (PDF). Census of India. 2011. Retrieved 29 December 2012.
  3. "Thoothukudi Vision 2025" (PDF). thoothukudi.tn.nic.in. Archived from the original (PDF) on 4 March 2016.
  4. "New Marine Training Academy at Tuticorin". The Times Of India. 27 July 2013.
  5. "List of Polytechnic Colleges in Tamil Nadu - Polytechnic College List". Polytechnic College List. Retrieved 20 March 2018.
  6. "Pearl City Tuticorin Emerging As 'Energy And Industrial Hub' Of South India 6000 Mw Of Power Plants In The Pipeline | Press Release | Solarplaza | The global solar energy (PV) platform". Archived from the original on 2 July 2010.
  7. "Thoothukudi - Wikimapia". wikimapia.org. Retrieved 20 March 2018.
  8. Thoothukudi district (2011). "Thoothukudi Tourism" (PDF). Thoothukudi district, Government of India. Retrieved 29 December 2012.
  9. Urban Infrastructure Report 2008, p. 12
  10. 10.0 10.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  11. "Table C-01 Population By Religious Community - Tamil Nadu" (XLS). Registrar General and Census Commissioner of India. 2011.
  12. "2011 census" (PDF). 2011. Retrieved 29 December 2012.
  13. "Table C-16 Population by Mother Tongue (Town) - Tamil Nadu". Registrar General and Census Commissioner of India. 2011.
  14. "Thoothukudi corporation roads". Thoothukudi Corporation. 2011. Archived from the original on 17 జూన్ 2013. Retrieved 29 December 2012.
  15. Urban Infrastructure Report 2008, pp. 13–14
  16. "S. E. T. C. Tamil Nadu Ltd., Computer reservation centres". Tamil Nadu State Transport Corporation Ltd. 2011. Archived from the original on 16 June 2018. Retrieved 8 June 2012.
  17. "Plea to expedite pit line extension work". The Hindu. Chennai, India. 24 March 2012.
  18. "Tuticorin-Colombo ferry sets sail —". The Times of India. 14 June 2011. Retrieved 20 September 2011.
  19. "Thoothukudi schools". Thoothukudi Corporation. 2011. Archived from the original on 17 జూన్ 2013. Retrieved 29 December 2012.
  20. "Chamber demands ESI hospital for Tuticorin". The Hindu. Chennai, India. 2 November 2013.
  21. "Vision of Thoothukudi 2025" (PDF). Thoothukudi Corporation. 2011. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 29 December 2012.

వెలుపలి లంకెలు[మార్చు]