నౌకానిర్మాణం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
An expedition's shipwrights building a brigantine, 1541.

నౌకానిర్మాణం అంటే ఓడలు, నీటిపైన తేలియాడగల ఇతర యంత్రాల నిర్మాణము. నౌకా నిర్మాణాలు నౌకానిర్మాణ కేంద్రాలు అని పిలవబడే ప్రత్యేక ప్రదేశాలలో జరుగుతాయి. సాధరణ పడవలు, తెడ్లు తయారుచేసే ప్రాంతాలని పడవతయారీ కేంద్రాలుగా పిలువవచ్చును. నౌకల నిర్మాణాలు మరియు మరమ్మత్తులు కూడా నౌకాశాస్త్ర పరిధిలోకే వస్తాయి. పురాతన కాలంలో భారతదేశం నౌకా నిర్మాణానికి ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఆధునిక భారతీయ నౌకా నిర్మాణ రంగం[మార్చు]

ఆధునిక భారతదేశం, ప్రపంచ నౌకానిర్మాణ రంగంలో 6వస్థానంలో ఉంది. నౌకా నిర్మాణ రంగంలో కొరియా, జపాన్, చైనా దేశాలు మొదటి మూడు స్థానాల్లో ఉనండి 77% ప్రపంచ నౌకానిర్మాణరంగపు విపణిని కలిగి ఉండగా ఐరోపా కూటమి, వియత్నాం ల తర్వాత 1.6% ప్రపంచ వాటాతో భారత్ తర్వాతి స్థానంలో ఉంది. ఇతర దేశాలలో ముఖ్యంగా కొరియా, జపానులలో నౌకా నిర్మాణరంగం స్వయంచాలిత యంత్రాల (Automated devices) తోనూ, మరమనుషుల (Robots) తోనూ నిండి ఉండగా, భారత్లోని నౌకానిర్మాణ కేంద్రాలు మానవ వనరులపైనే ఆధారపడి ఉన్నాయి.

ఇది ప్రత్యక్షంగా ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, టెక్నాలజీ విషయంలో భారతీయ నౌకానిర్మాణ కేంద్రాలు వెనుకబడడానికి కారణమయ్యింది. తద్వారా నౌకానిర్మాణానికి ఎక్కువ సమయం తీసుకుంటోంది (దక్షిణ కొరియాలో 45రోజులలో నిర్మించే నౌకని నిర్మించడం భారత్లో 6-7 నెలలు పడుతుంది).

ఇవి కూడా చూడండి[మార్చు]