హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
Typeప్రభుత్వ రంగ సంస్థ
పరిశ్రమనౌకా నిర్మాణం
స్థాపన1941 జూన్ 21 (1941-06-21)[1]
ప్రధాన కార్యాలయం,
Key people
కమోడోర్ హేమంత ఖాత్రి, (విశ్రాంత.), C&MD
Servicesనౌకా నిర్మాణం
నౌకల మరమ్మత్తు
జలాంతర్గామి నిర్మాణం, పునర్నిర్మాణం
RevenueIncrease734.87 crore (US$92 million) (2022)[2]
Increase50.77 crore (US$6.4 million) (2022)[2]
Increase50.77 crore (US$6.4 million) (2022)[2]
Total assetsIncrease1,376.87 crore (US$170 million) (2022)[2]
Total equityIncrease−547.31 crore (US$−69 million) (2022)[2]
Ownerభారత ప్రభుత్వం
Number of employees
1473 (2019 మార్చి)[2]

హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం (హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్) భారతదేశపు తూర్పుతీరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణంలో ఉంది. ఇది ఆధునిక భారతదేశపు మొట్టమొదటి నౌకానిర్మాణకేంద్రం.

చరిత్ర[మార్చు]

1948 మార్చి 14 న విశాఖపట్నంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించిన "జల ఉషా" ఫోటో. ఇది 8,000 టన్నుల డెడ్‌వెయిట్ కలిగిన సింగిల్-సెరూ కార్గో స్టీమర్. ఓడ మొత్తం పొడవు 415 అడుగులు, వెడల్పు 52 అడుగులు. 2,600 అశ్వ సామర్థ్యం కలిగిన సింగిల్ స్క్రూ ట్రిపుల్ ఎక్స్‌పాన్షన్ రెసిప్రొకేటింగ్ ఇంజన్ నౌకను నడిపిస్తుంది.

1941 జూన్ 22న అప్పటి కాంగ్రెసు అధ్యక్షుడు డా. రాజేంద్ర ప్రసాద్ దీనికి శంకుస్థాపన చేశాడు. సింధియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ లిమిటెడ్ లో భాగంగా వాల్‌చంద్ హీరాచంద్ అనే పారిశ్రామికవేత్త దీనిని స్థాపించాడు.[3] అప్పట్లో దీనిని సింధియా షిప్‌యార్డ్ గా పిలిచేవారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట ఇక్కడే నిర్మించిన మెట్టమొదటి నౌక "జల ఉష". దీన్ని, 1948 మార్చి 14 న అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జలప్రవేశం చేయించాడు. ఆ సమయంలో వాల్‌చంద్ హీరాచంద్‌తో పాటు సిందియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ లోని అతని భాగస్వాములు కూడా ఉన్నారు.

వాల్‌చంద్ హీరాచంద్ మరణ తరువాత అతని వారసులు కంపెనీని నడిపించారు. 1961వ సంవత్సరంలో సంస్థను జాతీయం చేసినపుడు, దీని పేరును హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అని మార్చారు. 2010 లో సంస్థను జలరవాణా మంత్రిత్వ శాఖ పరిధి నుండి రక్షణశాఖ పరిధిలోకి మార్చారు.[4]

2022 లో సంస్థ లోని నౌకా నిర్మాణ విభాగం, దాని చరిత్రలో కెల్లా అత్యధిక స్థాయిలో రూ 613 కోట్ల విలువైన ఉత్పత్తి సాధించింది.[5] అరిహంత్ తరహా అణుజలాంతర్గాముల అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నది.

వసతులు[మార్చు]

సుమారు 46.2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నౌకా నిర్మాణ కేంద్రంలో ప్లాస్మా కోతయంత్రాలు, ఉక్కు సంవిధాన, వెల్డింగ్ యంత్రాలు, పదార్థ నిర్వహణ పరికరాలు, నిల్వ వసతులు కూడా ఉన్నాయి. పరీక్షా వసతులు, కొలతల వసతులు కూడా ఉన్నాయి. 80,000 సామర్థ్యం గల ఓడలు నిర్మించగల కవర్డ్ బిల్డింగ్ డాక్ కూడా ఉంది. సామర్థ్యరీత్యా భారతదేశంలో కొచ్చిన్ నౌకానిర్మాణకేంద్రం తర్వాత పెద్దది ఇదే.

నౌకలు[మార్చు]

షిప్‌యార్డ్ విహంగ దృశ్యం

2009 నాటికి, HSL 192 పైచిలుకు నౌకలను నిర్మించింది. దాదాపు 2000 నౌకలకు మరమ్మతులు చేసింది. ఇది బల్క్ క్యారియర్‌లు, ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌకలు, సర్వే షిప్‌లు, డ్రిల్ షిప్‌లు, ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫారమ్‌లు, మరమ్మతులూ సపోర్టు చేసే నౌకలనూ నిర్మిస్తుంది.[6]

ఇది భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గాముల మరమ్మత్తులను కూడా నిర్వహిస్తుంది. అణుశక్తితో నడిచే జలాంతర్గాములను నిర్మిస్తోంది. అయితే, పునర్నిర్మాణాల కోసం సుదీర్ఘకాలం తీసుకునే చరిత్ర ఈ షిప్‌యార్డ్‌కు ఉంది. వేలా, వాగ్లీ, సింధుకీర్తి అనే జలాంతర్గాములు ఒక్కొక్క దాని పునర్నిర్మాణానికి దాదాపు 10 సంవత్సరాలు తీసుకుంది. ఒక రష్యన్ షిప్‌యార్డ్ రెండేళ్ళలో రీఫిట్‌ను పూర్తి చేయడానికి మూడు షిఫ్టులలో 200 మంది కార్మికులను మోహరిస్తుంది, HSL సింధుకీర్తిలో పని చేయడానికి 50 మంది కార్మికులను మాత్రమే నియమించింది.

మూలాలు[మార్చు]

  1. "Hindustan Shipyard Limited celebrates Foundation Day". 24 November 2017.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Annual Report 2021-22".
  3. "Hindustan Shipyard: Making Waves". India Today. 9 October 2009. Retrieved 9 September 2011.
  4. "Govt moves Hindustan Shipyard to Defence ministry". The Times of India. 24 December 2009. Archived from the original on 26 September 2012. Retrieved 9 September 2011.
  5. Business, ZEE. "Hindustan Shipyard". {{cite news}}: |last1= has generic name (help)
  6. "Hindustan Shipyard: Making Waves". India Today. 9 October 2009. Retrieved 9 September 2011.