విశాఖపట్నం

వికీపీడియా నుండి
(విశాఖపట్టణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విశాఖపట్నంలోని తెన్నేటి ఉద్యానవనం వద్ద సముద్ర తీరం
విశాఖపట్నంలోని తెన్నేటి ఉద్యానవనం వద్ద సాయంత్రాన సముద్ర తీరం

విశాఖపట్నం (విశాఖ , విశాఖపట్టణం , వైజాగ్‌) భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ లో పెద్ద నగరం[1] ఆంధ్ర ప్రదేశ్‌లో గ్రేటర్ సిటి హోదా పొందిన తొలి నగరం (హైదరాబాదు కంటే ముందే). బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. "డాల్ఫిన్స్‌ నోస్‌" అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌గా పనిచేస్తుంది.

చరిత్ర[మార్చు]

శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల రాతి ఆయుధాలను చూడవచ్చు.

స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై, తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు. ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.

గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది.

ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డిరాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహీలు, మొగలులు, హైదరాబాదు నవాబులు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం ఒకటిగా ఉండేది.[2]

18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్రలోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు అధీనంలోకి వెళ్ళాయి. మద్రాసు ప్రెసిడెన్సీ లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు. 1950 ఆగస్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది

భౌగోళికం[మార్చు]

విశాఖపట్నం నగరం

విశాఖపట్నం బంగాళా ఖాతం నానుకొని సముద్రపు ఒడ్డున ఉంది. విశాఖపట్నానికి ఎల్లలు; ఉత్తరాన ఒడిషా రాష్ట్రం, విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పుగోదావరి జిల్లా గలదు. తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ నగరపు అక్షాంశ రేఖాంశాలు; 17.6883° ఉత్తర అక్షాంశం, 83.2186° తూర్పు రేఖాంశం. ఈ నగరం మైదాన ప్రాంతం, తీరప్రాంతాలతో ఉంది. దీని వైశాల్యం 11,161 kమీ2 (4,309 sq mi).

వాతావరణం[మార్చు]

Climate data for Visakhapatnam
Month జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు Year
Record high °C (°F) 34.8 38.2 40.0 40.5 45.0 45.4 41.4 38.8 38.2 37.2 35.0 34.2 nil
(nil)
సగటు అధిక °C (°F) 28.9 31.3 33.8 35.3 36.2 35.3 32.9 32.7 32.5 31.7 30.4 28.9
సగటు అల్ప °C (°F) 17.0 18.9 22.0 25.1 26.7 26.3 25.1 25.0 24.6 23.3 20.6 17.6
Record low °C (°F) 10.5 12.8 14.4 18.3 20.0 20.6 21.0 21.1 17.5 17.6 12.9 11.3 nil
(nil)
Precipitation mm (inches) 21.4 17.7 17.5 37.6 77.8 135.6 164.6 181.2 224.8 254.3 95.3 37.9
Avg. rainy days 1.7 2.3 2.3 3.2 4.9 8.8 11.9 12.6 12.6 9.9 5.0 1.7
% humidity 71 70 69 71 69 71 76 77 78 74 68 67
Source #1: IMD (average high and low, precipitation)[3]
Source #2: IMD (temperature extremes upto 2010)[4]

నగరం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామనామ వివరణ[మార్చు]

విశాఖ పట్నం అన్న గ్రామనామం విశాఖ అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.[5] సముద్రతీరప్రాంతం కావడంతో ఈ నగరం పేరులోని పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసం అనే అర్థం ప్రధానంగా స్వీకరించవచ్చు.

పరిపాలన విభాగాలు[మార్చు]

విశాఖపట్నం

విశాఖపట్నం అనేక పరిపాలనా విభాగాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. జిల్లా ప్రధాన కేంద్రం మాత్రమే కాక, తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం, దక్షిణ కోస్త రైల్వే ప్రధాన కేంద్రం. ఇండియన్ కోస్ట్ గార్డ్, పాసుపోర్టు ఆఫీస్, కస్టమ్స్, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ప్రభుత్వ శాఖ లకు రాష్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థలైన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వంటి సంస్థల ప్రధాన కార్యాలయాలు విశాఖలో నెలకొల్పబడ్డాయి.

విశాఖ పట్నం నగర అభివృద్ధి కొరకు విశాఖపట్నం మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుచేయబడింది.

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ[మార్చు]

మహా విశాఖ నగర పాలక సంస్థను 11 విబాగాలుగా విడదీసి, పరిపాలన చేస్తున్నారు. రెవెన్యూ శాఖ, అక్కౌంట్సు (పద్దులు) శాఖ, సాధారణ పరిపాలన, బట్వాడా శాఖ (సంస్థలోని మిగతా శాఖలు రాసిన ఉత్తరాలు, నోటీసులు పంపించటం), ఇంజినీరింగ్ శాఖ, ప్రజారోగ్య శాఖ (ప్రజల ఆరోగ్యం, వీధులు, మురికి కాలువలు శుభ్రం చేయటం, ఆసుపత్రులు ), టౌన్ ప్లానింగ్ శాఖ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (నగర్ అభివృద్ధి సంస్థ), విద్యా శాఖ, ఆడిట్ శాఖ (అక్కౌంట్సు శాఖ రాసిన జమా ఖర్చులు సరిగా ఉన్నాయా లెవ అని పరిశీలించి, తప్పులను, అనవరంగా చేసిన ఖర్చులను వెదికి అభ్యంతరాలను నమోదు చేస్తుంది), లీగల్ సెల్ (మహా విశాఖ నగరపాలక సంస్థ మీద ఎవరైనా దావాలు వేసిన వాటికి సమాధానలు ఇవ్వటం, కొన్ని న్యాయసంబంధమైన సలహాలు సంస్థకు ఇవ్వటం, వంటి పనులు చేస్తుంది). ఈ 11 శాఖలకు అధిపతులు ఉంటారు. ఈ 11మంది అధిపతులు, మహా విశాఖ నగర పాలక సంస్థ అధిపతి అయిన కమిషనరు (ఐ.ఏ.ఎస్ అధికారి) ఆధ్వర్యంలో పనిచేస్తారు.

జనాభా గణాంకాలు[మార్చు]

 • జనాభా పెరుగుదల కారణంగా 1981లో 180 మురికి వాడలున్న విశాఖపట్నంలో, 2011 సంవత్సరానికి 650 పైగా మురికి వాడలు ఉన్నాయి. వీరికి ఉండటానికి చోటు లేక, సిండియా నుంచి గాజువాక వరకూ వున్న పారిశ్రామిక ప్రాంతంలోని కొండల మీద నివాసం ఉంటున్నారు. అలాగే కప్పరాడ, మధురవాడ ప్రాంతాలలోని కొండల మీద నివాసాలు పెరిగాయి. వీరంతా వలస వచ్చిన వారే. ఫలితంగా వర్యావరణ సమస్యలు, కొండల మీద పచ్చదనం అంతరించి పోవటం జరుగు తుంది. విశాఖపట్నంలో జనాభా పెరిగిన తీరు. క్రింద ఇచ్చిన టేబుల్ చూడు.
 • విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ జనాభా (2001 జనాభా లెక్కల ఆధారంగా)........... 9,82,910
 • 32 గ్రామ పంచాయతీల జనాభా (ఇవి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో కలిసినవి).. 1,95,489.
 • గాజువాక పురపాలక సంఘం (ఇది మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో కలిసినది)...... 2,48,953.
 • మొత్తం జనాభా ..............................................................................................20,91,320.
సంవత్సరం జనాభా పెరుగుదల శాతం
1901 40,892 --
1931 57,303 28.16%
1951 1,08,042 53.81%
1961 2,11,190 95.47%
1971 3,63,504 66.91%
1981 5,65,321 60.37%
1991 10,57,118 86.99%
2001 13,45,938 25.76%
2011 20,35,922

జనాభా 2001 నుంచి 2011 వరకు (గత పదేళ్ళలో) నాలుగు లక్షల వరకు పెరిగి ఉంటుందని జనాభా అధికారులు అంచనా వేస్తున్నారు. 2011 ఫిబ్రవరి 9 నుంచి 2011 ఫిబ్రవరి 28 వరకు రెండో విడత జనాభా లెక్కల సేకరణ జరిగింది. 2001 లో నగర జనాభా 13.5 లక్షలు.ఇంతవరకూ, సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా, 17.5 లక్షలవరకు నగర జనాభా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రాథమిక అంచనా. పూర్తిగా జనాభా లెక్కలు సేకరించిన తరువాత ఈ లెక్కలు మరింత పెరగ వచ్చును. గ్రామీణ ప్రాంతంలో పెరుగుదల 11 శాతం అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండ వచ్చును. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 24.50 లక్షల మంది ఉండగా, ఆ అంకె 27.50 లక్షలకు చేరవచ్చని అంచనా. విశాఖ నగరంతో కలిపి విశాఖపట్నం జిల్లా జనాభా 2001లో 38 లక్షలు. అదే 2011 నాటికి ఈ అంకెలు 45 లక్షలకు చేరవచ్ఛని అంచనా.

విద్య, పరిశోధన[మార్చు]

విశ్వ విద్యాలయాలు[మార్చు]

 • ఆంధ్ర విశ్వ విద్యాలయం
 • దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం
 • గీతం విశ్వ విద్యాలయం
 • ఇండియన్ మారిటైం విశ్వ విద్యాలయం
 • ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్
 • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ

పరిశోధనా సంస్థలు[మార్చు]

 • కలాం ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ టెక్నాలజీ
 • నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓషనోగ్రఫీ
 • నేవల్ సైన్టిఫిక్ టెక్నాజికల్ లేబొరేటరీ
 • ఫిషెరీ సర్వే ఆఫ్ ఇండియా
 • జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

వైద్య సేవలు[మార్చు]

వైద్య రంగంలో విశాఖ పట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనే మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయి. అనేక మల్టి సూపర్ స్పెషలిటీ హాస్పిటళ్లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగం లోని కింగ్ జార్జ్ హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్, విశాఖ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ తో పాటు, టాటా కాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండస్ హాస్పిటల్స్, సెవెన్ హిల్స్ హాస్పిటల్స్, ప్రథమ హాస్పిటల్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, పినాకిల్ హాస్పిటల్, మై క్యూర్, కేర్, అపోలో, ఓమ్ని వంటి హాస్పిటల్స్ ఇక్కడ నెలకొల్పబడ్డాయి.

ఆంధ్ర మెడికల్ కాలేజ్, గీతం మెడికల్ కాలేజ్, గాయత్రీ విద్య పరిషద్ మెడికల్ కాలేజ్, ఎన్నారై మెడికల్ కాలేజ్ వంటి వైద్య సేవలతో పటు వైద్య విద్యను అందిస్తున్నాయి.

క్రీడా రంగం[మార్చు]

క్రీడా రంగ అభివృద్ధి కొరకు నగరం అనేక మైదానాలు ఏర్పాటు చేయబడ్డాయి. డా.వై.ఎస్.ఆర్.క్రికెట్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి అన్ని ఫార్మాట్ల క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇక్కడ డే అండ్ నైట్ మ్యాచ్ లకు సైతం ఆతిధ్యం ఇచ్చే సౌకర్యం ఉంది. ఇది కాక నగరంలో పోర్ట్ ఇండోర్ స్టేడియం, పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబిలీ స్టేడియం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఉక్కు స్టేడియం వంటి క్రీడా ప్రాంగణాలు ఔత్సాహికులు అయిన క్రీడా కారులను తీర్చిదిద్దుతున్నాయి.

పరిశ్రమలు[మార్చు]

విశాఖ ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. వాటిలో కొన్ని:

ఆర్ధిక మండళ్లు[మార్చు]

 • విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి, దువ్వాడ
 • ఏపీఐఐసీ బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి, అచ్చుతాపురం
 • ఐటి ప్రత్యేక ఆర్థిక మండలి (రుషికొండ హిల్-2, రుషికొండ హిల్-3, గంభీరం)
 • జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ
 • బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ
 • రాంకీ ఫార్మా సిటీ
 • అన్ రాక్ అల్యూమినియం (మాకవరపాలెం)
 • దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్
 • హెటేరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ (నక్కపల్లి)
 • జె.ఎస్.డబ్ల్యు అల్యూమినియం లిమిటెడ్ (ఎస్.కోట)
 • దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్
 • ఫిన్ టెక్ వ్యాలీ
 • మెడిటెక్ జోన్

ప్రభుత్వ రంగ సంస్థలు[మార్చు]

 • హిందుస్దాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (చమురు శుద్ధి కర్మాగారం)
 • రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం ఉక్కు కర్మాగారం)
 • హిందుస్థాన్ జింక్ స్మెల్టర్
 • భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ (హెవీ వెస్సెల్స్ ప్లాంట్)
 • హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్
 • నావెల్ డాక్ యార్డ్
 • కంటైనర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా
 • డ్రెడ్గింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా
 • హిందుస్థాన్ పాలిమర్స్
 • ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్

ఉక్కునగరంలోని విశాఖ ఉక్కు కర్మాగారం 6.3 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్తులో ముడిసరుకు కొరత తలెత్తకుండాఅ ఉండేందుకు ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) ఐరన్ ఓర్ యార్డు నిర్మాణాన్ని సంస్థ చేపడుతోంది సుమారు రూ.418 కోట్లతో నిర్మించనున్న ఐరన్ ఓర్ యార్డు నిర్మాణానికి 2010 జూలై 21 బుధవారం శంకుస్థాపన జరిగింది. ఐరన్ ఓర్ యార్డు నిర్మాణం పూర్తయితే సుమారు ఆరు లక్షల టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని నిల్వ చేయవచ్చు. యార్డు నిర్మాణంలో 65 వేల ఘనపు మీటర్ల కాంక్రీటు, 930 టన్నుల ఇనుము ఉపయోగించనున్నారు యార్డు నుంచి బ్లాస్ట్ ఫర్నేస్ విభాగానికి నేరుగా ఇనుప ఖనిజాన్ని చేరవేసేందుకు పది కి.మీ పొడవుగల కన్వేయరు బెల్టును నిర్మిస్తారు. ఐరన్ ఓర్ యార్డు నుంచి 3.4 కి.మీ పొడవుగల రైల్వే లైను ఏర్పాటు చేస్తున్నారు. అనుకోని పరిస్థితిలో (బందులు, లారీల సమ్మె, ఆందోళనలు, శాంతిభద్రతలకు భంగం జరిగిన సమయంలో, యుద్ధ వాతావరణంలో) రవాణా జాప్యమైతే కర్మాగారం ఇబ్బందుల్లో పడకుండా నిల్వ ఉంచిన ముడిసరుకును వినియోగించుకోవచ్చును. భవిష్యత్తులో గనుల నుంచి నేరుగా కర్మాగారానికి పైపుల ద్వారా ముడిసరుకు సరఫరా చేసేలా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.

పరిశ్రమల అభివృద్ధి కొరకు విశాఖపట్నంలో ఒక ప్రత్యేక ఆర్థిక ప్రాంతాన్ని ప్రభుత్వం నెలకొల్పింది. విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను ప్రారంభించే విషయమై వివిధ సంస్థలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం సంప్రదిస్తూ ఉంది. భారత ప్రభుత్వపు భాభా అణు పరిశోధనా సంస్థ వారు తమ పరిశోధనా కేంద్రాన్ని, ఒక అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నారు.

ఐ.టీ రంగంలో శీఘ్రంగా పురోగమిస్తున్న నగరాలలో విశాఖ ఒకటి. టెక్ మహెంద్ర, హెచ్.ఎస్.బి.సి, సయ్ంట్, కాంసెట్రిక్, ఫ్లుఎంట్ గ్రిడ్, విప్రొ, సంక్య, సైనెక్టిక్ ఇన్ఫోటెక్ ప్రైవేటు లిమిటెడ్, నూనెట్ టెక్నాలజీస్ ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్న ప్రముఖ సంస్థలు. ఐ.బీ.ఎమ్ వారు విశాఖ నడి ఒడ్డున వున్న రాంనగర్ లో కార్యాలయం ఏర్పాటు చేసారు వైజాగ్ సమీపంలోని పరవాడ,పైడి భీమవరంలో ఫార్మా కంపెనీలు అభివృద్ధి చెందాయి mylan,pfizer,avra వంటి కంపనులు ఉన్నాయి.దువ్వాడలో v సెజ్ లో కూడా ఉన్నాయి

భారత నౌకాదళం (ఇండియన్ నేవీ)[మార్చు]

విశాఖపట్నం సముద్రం వీక్షణ దృశ్యం

భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం కేంద్ర స్థానం.(ప్రధాన స్థావరం).

పర్యాటకం[మార్చు]

విశాఖపట్నం, బీచ్ రోడ్డులోని ఒక పురాతన కాలపు నిర్మాణశైలి కలిగిన బంగ్లా
విశాఖపట్నం, ఋషికొండ వద్ద సంధ్యా సమయం
సింహాచలం ఆలయం

జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, పలు పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాలు, కయాకింగ్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, జెట్ స్కీయింగ్, పారా గ్లైడింగ్, హెలి పర్యాటకం వంటి సాహస క్రీడా సదుపాయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 78 లక్షల మంది పైచిలుకు, 2016లో రెండుకోట్ల 6 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[6] 2016, 2017 సంవత్సరాల్లో అత్యధిక పర్యాటకులు సందర్శించిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో విశాఖపట్టణం జిల్లా మూడవ స్థానంలో కొనసాగుతోంది. విదేశీ పర్యాటకులు అత్యధికులు సందర్శించిన జిల్లాల్లో 2016, 2017ల్లో రెండో స్థానం నిలబెట్టుకుంది.

ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రార్ధనా స్థలాలు[మార్చు]

 • సింహాచలం - శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.
 • శ్రీ కనక మహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానం
 • పోర్టు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి.ఒక కొండపై వెంకటేశ్వర స్వామి, ఒక కొండపై ముస్లిములకు పవిత్రమైన దర్గా, మరొక కొండపై (రాస్ కొండ) క్రైస్తవులకు పవిత్రమైన ఛర్చి ఉన్నాయి. విశాఖపట్నంలోని ఈమూడు మతాల పవిత్ర ప్రదేశాలు చూడటం ఒక మధురానుభూతి.
 • సాగర దుర్గాదేవి (డాల్ఫిన్స్ నోస్ కొండ క్రింద - కోరమాండల్ బీచ్ )
 • ఇస్కాన్ టెంపుల్,
 • జగన్నాధ టెంపుల్, ఉక్కునగరం
 • శారదా పీఠం. (చిన ముషిడివాడ దగ్గర)
 • నూకాలమ్మ గుడి, అనకాపల్లి
 • కాళికాలయం. మూడు కాళికాలయాలు ఉన్నాయి. ఒకటి రామకృష్ణ బీచ్ దగ్గర, రెండవది ఉక్కు నగరంలో, మూడవది రైల్వే స్టేషను దగ్గర.
 • బావనా ఋషి కోవెల (బురుజు పేట దగ్గర వున్న కనక మహాలక్ష్మి గుడికి దగ్గర)
 • అయ్యప్ప గుడి (షీలా నగర్ దగ్గర).
 • ఇసుక కొండ మీద వెలిసిన సత్యనారాయణ స్వామి.
 • కరక చెట్టు పోలమాంబ.
 • నీలమ్మ వేపచెట్టు.
 • గురుద్వార
 • రెడ్ చర్చి, భీమునిపట్నం.
 • నరసింహ స్వామి టెంపుల్, భీమునిపట్నం
 • దేవీ పురం టెంపుల్

సాగర తీరాలు[మార్చు]

 • భీమునిపట్నం బీచ్
 • మంగమారిపేట బీచ్
 • రిషికొండ బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పర్యాటక శాఖ, పున్నమి రిసార్టులను వర్యాటకులకు అద్దెకు ఇస్తుంది. ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చోటు.
 • రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విస్తీర్ణం తగ్గింది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే కాళికాలయం, రామకృష్ణా మిషన్, హవా మహల్, జలాంతర్గామి (కాల్వరి) మ్యూజియం ఉన్నాయి. భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు
 • యారాడ బీచ్
 • గంగవరం బీచ్
 • అప్పికొండ బీచ్

సంగ్రహాలయాలు[మార్చు]

 • విశాఖ మ్యూజియం
 • నేవల్ మ్యూజియం
 • INS కురుసుర జలాంతర్గామి మ్యూజియం
 • TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం
 • తెలుగు మ్యూజియం

జలాశయాలు[మార్చు]

 • ముడసర్లోవ రిజర్వాయిర్
 • మేఘాద్రి గడ్డ రిజర్వాయిర్
 • కణితి బేలన్సింగ్ రిజర్వాయిర్
 • కొండకర్ల ఆవ

పార్కులు, ఉద్యానవనాలు[మార్చు]

 • నందమూరి తారక రామారావు సాగర తీరా ఆరామం (వుడా పార్క్)
 • డా. వై.ఎస్.రాజ శేఖర రెడ్డి సెంట్రల్ పార్క్
 • తెన్నేటి పార్క్
 • వైశాఖి జల ఉద్యానవనం
 • శివాజీ పార్క్
 • కైలాసగిరి - శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి. శివ పార్వతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి కొండమీద.

చారిత్రక ప్రదేశాలు[మార్చు]

 • డచ్చి సమాధులు (భీమునిపట్నం)
 • డచ్ డెవిల్స్ మాన్షన్ (భీముని పట్నం)
 • గడియార స్తంభం (భీమునిపట్నం)
 • పావురాల కొండ బౌద్ధ క్షేత్రం (భీమునిపట్నం)
 • తోట్ల కొండ బౌద్ధ క్షేత్రం (రుషికొండ)
 • బావి కొండ బౌద్ధ క్షేత్రం (రుషికొండ)
 • ఆంధ్రా తాజ్ మహల్ (కురుపాం రాజులది)
 • విక్టోరియా టౌన్ హాల్
 • బొజ్జన కొండ బౌద్ధ కిత్రం (అనకాపల్లి దగ్గర)

ఇతర ముఖ్య ప్రదేశాలు[మార్చు]

 • డాల్ఫిన్స్ నోస్ (డాల్ఫిన్ చేప ముక్కులాగ వుంటుందని, ఈ కొండకు, ఆ పేరు పెట్టారు). 174 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కొండమీద ఉన్న లైట్ హౌస్, సముద్రంలో ప్రయాణిస్తున్న నావికులకు, దారి చూపుతుంది. యాత్రికులు ఈ లైట్ హౌస్‌ను చూడవచ్ఛు. ఈ కొండ మీద నౌకాదళ సిబ్బందికి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ కొండ దిగితే, యారాడ అనే గ్రామం కనిపిస్తుంది. అరటి, కొబ్బరి పంట పొలాలతో పచ్ఛని పొలాలతో ఈ పల్లె కనిపిస్తుంది. కనకాంబరాలు కూడా ఇక్కడ పండిస్తారు.
 • జగదాంబా సెంటరు - జగదాంబ సినీమా హాలు కట్టక ముందు, ఈ ప్రాంతాన్ని, ఎల్లమ్మ తోటగా పిలిచే వారు. నాగుల చవితి నాడు, ఇక్కడి చుట్టుపక్కల వున్న ప్రజలు పుట్టలో పాలు పోసేవారు. అన్ని పాము పుట్టలు వుండేవి. చిన్న అడవి లాగా వుండేది. ఇప్పటికీ, ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. ఇక్కడి భూములన్నీ 'దసపల్లా' రాజులకు చెందినవి. అందుకు గుర్తుగా ఇక్కడ కట్టిన సినిమా హాలు పేరు 'దసపల్లా ఛిత్రాలయ'. హోటల్ వేరు 'దసపల్లా హోటల్'. జగదాంబ 70 ఎమ్. ఎమ్. థియేటర్ కట్టిన తరువాత, ఈ ప్రాంతం అంతా వ్యాపార పరంగా అభివృద్ధి చెంది, విశాఖపట్నం అంటే, జగదాంబ సెంటరు ఆందరికీ గుర్తు వస్తుంది. అర్.టి.సి. కాంప్లెక్స్ కట్టేవరకు, విశాఖపట్నం జగదాంబ సెంటర్ వరకే వుండేది.
 • ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల
 • ఎర్రమట్టి దిబ్బలు
 • కంబాల కొండ ఎకో పర్యాటకం పార్క్
 • జాతర శిల్పారామం
 • డా. రామానాయుడు స్టూడియోస్
 • అక్వేరియం
 • గో కార్టింగ్ (హబ్ ఫర్ యూత్)
 • రాజీవ్ గాంధీ కర్ణాటక సంగీత భాండాగారం
 • VMRDA బుద్ధవనం
 • విక్టరీ ఎట్ సి మెమోరియల్
 • హామిలిటన్ మెమోరియల్ మాసోనిక్ ఆలయం

హోటళ్లు, అతిధి గృహాలు[మార్చు]

5 నక్షత్రాల హోటళ్లు[మార్చు]

 • నోవాటెల్ వరుణ్ బీచ్ (రూ.7000+)
 • ది గేట్ వే హోటల్ (రూ.6000+)
 • ది భీమిలి రిసార్ట్స్ బై అకార్ హోటల్స్ (రూ.5500+)
 • ఫోర్ పాయింట్స్ బై షెరటాన్ బై మారియట్ (రూ.5000+)
 • ది పార్క్ హోటల్ (రూ.4000+)

ఇతర ప్రముఖ హోటళ్లు[మార్చు]

 • వెల్ కమ్ హోటల్ గ్రాండ్ బే (రూ.5500+)
 • పామ్ బీచ్ హోటల్ (రూ.5000+)
 • దసపల్లా ఎగ్జిక్యూటివ్ కోర్ట్ (రూ.5000+)
 • ఫెయిర్ ఫీల్డ్ బై మారియట్ (రూ.4500+)
 • ఫార్చ్యూన్ ఇన్ శ్రీకన్య (రూ.4500+)
 • హోటల్ వివానా
 • బెస్ట్ వెస్టర్న్ రామచంద్ర (రూ.3500+)
 • హోటల్ దసపల్లా (రూ.3500+)
 • సుపైన్ కంఫోర్ట్ (రూ.3500+)
 • డాల్ఫిన్ హోటల్ (రూ.3,000+)
 • గ్రీన్ పార్క్ (రూ.3,000+)
 • కీస్ సెలెక్ట్ హోటల్ (రూ.3000+)
 • హోటల్ డైమండ్స్ పెర్ల్ (రూ.3000+)
 • హోటల్ SKML గ్రాండ్
 • పేమా వెల్నెస్ రిసార్ట్స్
 • హరిత బీచ్ రిసార్ట్స్
 • సాయి ప్రియ బీచ్ రిసార్ట్స్
 • బే లీఫ్ రిసార్ట్స్

బడ్జెట్ హోటళ్లు[మార్చు]

ది పయనీర్, హోటల్ రాక్ డేల్ క్లార్క్స్ ఇన్, ఎన్ కొర్ ఇన్, హోటల్ విన్సార్ పార్క్, జింజిర్ వైజాగ్, వి హోటల్, హోటల్ అక్షయ, ల్యాండ్ మార్క్ హోటల్, రిట్జ్ కంఫర్ట్, అంబికా సి గ్రీన్, హోటల్ ది సుప్రీమ్, మేఘాలయ హోటల్, మంత్రిస్ హోటల్, హోటల్ ది సీ ట్రీ, రాయల్ ఫోర్ట్ హోటల్, హోమీ సూట్స్, రోజీ వుడ్, అభయ గ్రాండ్, మోడరన్ విల్లా, మానస హోమ్స్ శుభ వైభవ్ ఇన్, రామ చంద్ర రెసిడెన్సీ, హోటల్ రియో బీచ్, హోటల్ మెట్రో ఇన్, జివికే ఇన్, సిరి వర్షిణి ఇన్, హోటల్ సాయి నేషనల్,

విద్యుత్ శక్తి[మార్చు]

విశాఖపట్నానికి, 2011 వేసవి కారణంగా, ఆంధ్ర ప్రదేశ్ ట్రాన్స్‌కో, 'ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్'(ఈపీడీసీఎల్) కు, ప్రతిరోజు 12 మిలియన్ యూనిట్ల వరకు వినియోగించుకునేందుకు అవకాశం 2011 మే 6 నుంచి ఇచ్చింది. ఈపీడీసీఎల్ సంస్థ పరిధిలో విశాఖపట్నం జిల్లాలోనే విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుంది. భారీ పరిశ్రమలు, వాణిజ్య, గృహావసరాలకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఈ సంస్థ సరఫరా చేయాలి. ప్రతి ఏడాది రోజువారీ పరిమితి (కోటా) 8 మిలియన్ యూనిట్ల నుంచి పది మిలియన్ యూనిట్ల వరకు ఉండేది. 2011 సంవత్సరానికి ఈ పరిమితి 11 మిలియన్ యూనిట్లకు పెరిగింది. 2011 మే 3 నుంచి పగటి వేడి 37 డిగ్రీలకు పెరగడంతో, నగరంలో ఏ.సి.ల వాడాకం విపరీతంగానే ఉంది. పరిశ్రమలు, సినిమాహాళ్ళు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వరంగ సంస్థల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. అందుచేత, పట్టణ అవసరాలకు అనుగుణంగా, కోతల్లేని సరఫరా చేయటానికి సహకరించాలని, ఈపీడీసీఎల్ ఏపి ట్రాన్స్‌కోకు విన్నవించుకుంది. వెంటనే 'ఏపిట్రాన్స్‌కో' రోజువారీ వాడకానికి తగ్గట్లుగా పరిమితిని 12 మిలియన్ యూనిట్లకు పెంచింది. మే 2011 వరకూ ఈ పరిమితి ఉంటే ఛాలు అనుకుంటుంది ఈపీడీసీఎల్. కానీ, గ్రామాలలో విద్యుత్ కోత మామూలుగానే ఉంటుంది. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్తును ఇవ్వాలని నిర్ణయించింది.నగరంలోని పరిశ్రమలకు 'హేపీ డే' అమలు కారణంగా, పారిశ్రామికులు ఆనందిస్తున్నారు. వాణిజ్య విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయాలు కలగటంలేదు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

రోడ్డు మార్గం[మార్చు]

చెన్నై-కోల్‌కతా లను కలుపు 16 వ నంబరు జాతీయ రహదారి, విశాఖపట్నం-రాయపూర్ లను కలుపు 26 వ నంబరు జాతీయ రహదారి విశాఖను దేశం లోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయి.

విశాఖపట్నం లోని ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చే నిర్వహించబడు ద్వారకా బస్సు స్టేషన్ కాంప్లెక్స్ నుండి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు (చెన్నై), కర్ణాటక (బెంగళూరు) రాష్ట్రాలకు అంతరాష్ట్ర సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా రాష్ట్రం లోకి అన్ని ప్రాంతాలకు ఈ బస్సు స్టేషన్ నుండి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మద్దిలపాలెం,అనకాపల్లి బస్ స్టేషన్ ల నుండి కూడా సర్వీసులు నడుపబడతాయి.

విశాఖపట్నం నగరంలోని నగర బస్సులు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి వారి అజమాయిషీలో నడుపుతున్నారు. నగరం లోని దాదాపు అన్ని ప్రాంతాలకు సిటీబస్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి.విశాఖ నగరంలో సింహాచలం,గాజువాక,ఉక్కునగరం,పాత పోస్టాఫీసు,మద్దిలపాలెం,మధురవాడ,వాల్తేరు, కుర్మన్నపాలెం,అనకాపల్లి వంటి ప్రాంతాలలో సిటీ బస్సు డిపోలు ఉన్నాయి తగరపువలసలో కూడా డిపో ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి.ఈ డిపోల నుండి సిటీ ఆర్డినరీ,మెట్రో షట్టిల్స్,మెట్రో లగ్జరీ వంటి బస్ లు సేవలు అందిస్తున్నాయి. అంతే కాకుండా నగరం నుండి విజయనగరం,శ్రీకాకుళం డిపో లకు కూడా మెట్రో లగ్జరీ సిటీ బస్ లు సేవలు అందిస్తున్నాయి.అలాగే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి శీఘ్రవంతమైన ప్రజా రవాణా కొరకు బి.అర్.టి.ఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.అలాగే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి గ్రేటర్ విశాఖ, రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అత్యంత ముఖ్యమైన ఎన్.ఏ.డీ కూడలి వద్ద ప్లైఓవర్ బ్రిడ్జిను నిర్మిస్తున్నారు.అలాగే హనుమంతవాక కూడలి,గాజువాక కూడళ్ళ వద్ద కూడా ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎ.పి.ఎస్.ఆర్.టి.సి సిటీ బస్సులు మాత్రమే కాక అగ్రిగేటర్స్ అయినా ఉబెర్, ఓలా సంస్థలు, ఇతర స్థానిక ప్రైవేటు ఆపరేటర్లు నిర్వహించే క్యాబ్ సేవలు, ఆటోలు స్థానిక రవాణా కొరకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మోటారు సైకిళ్ళు, కార్లు అద్దెకు ఇచ్చే సంస్థలు కూడా నగరంలో అందుబాటులో ఉన్నాయి.

మెట్రో రైలు వ్యవస్థ[మార్చు]

నగరంలో మూడు రైలు మార్గాలలో మెట్రో రైలు వ్యవస్థ ప్రతిపాదించబడింది.

రైలు మార్గం[మార్చు]

విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము వైపునకు
కొత్తవలస-కిరండల్ రైలు మార్గము వైపునకు
24
కొత్తవలస
15
పెందుర్తి
8
ఉత్తర సింహాచలం
7
సింహాచలం
6
గోపాలపట్నం
జాతీయ రహదారి 16
మార్షలింగ్ యార్డు (కుడివైపు లైన్లు
4
మర్రిపాలెం/ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం
నావల్ డాక్ యార్డు
ఎస్సార్ స్టీల్
ఐరన్ ఓర్ సైడింగులు
9
కొత్తపాలెం
విశాఖపట్నం పోర్టు - హార్బరు లోపల
0
విశాఖపట్నం
హిందూస్థాన్ జింక్ లిమిటెడ్
భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసెల్స్(బిహెచ్‌పివి)
జాతీయ రహదారి 16
కోరమాండల్ ఇంటర్నేషనల్
విశాఖపట్నం రిఫైనరీ ఆఫ్ హెచ్‌పిసిఎల్
విశాఖపట్నం పోర్టు చానల్ (నీలం)
విశాఖపట్నం పోర్టు - హార్బర్ లోపల
హిందూస్థాన్ షిప్ యార్డ్
విశాఖపట్నం పోర్టు - హార్బరు బయట
డాల్ఫిన్స్ నోస్ (కొండతో లైట్‌హౌస్)
బంగాళాఖాతంలింకుకు
విశాఖ ఉక్కు కర్మాగారం
గంగవరం పోర్ట్
17
దువ్వాడ
జాతీయ రహదారి 16
సింహాద్రి ఎస్‌టిపిపి అఫ్ ఎన్‌టిపిసి
27
తాడి
జాతీయ రహదారి 16
33
అనకాపల్లి
38
కశింకోట
42
బయ్యవరం
జాతీయ రహదారి 16
50
నరసింగపల్లి
57
ఎలమంచిలి
జాతీయ రహదారి 16
62
రేగుపాలెం
75
నర్సీపట్నం రోడ్డు
86
గుల్లిపాడు
జాతీయ రహదారి 16
తాండవ నది
97
తుని
105
హంసవరం
110
తిమ్మాపురం
113
అన్నవరం
120
రావికంపాడు
123
దుర్గాడ గేటు
133
గొల్లప్రోలు
138
పిఠాపురం
150 / 13
సామర్లకోట
సర్పవరం
కాకినాడ టౌన్
0
కాకినాడ పోర్టు
నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
కాకినాడ
కోరమాండల్ ఇంటర్నేషనల్
గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
6
కొవ్వాడ
10
అర్తలకట్ట
15
కరప
18
వాకాడ
22
వేలంగి
24
నరసపురపుపేట
30
రామచంద్రపురం
35
ద్రాక్షారామం
39
కుందూరు
42
గంగవరం
45
కోటిపల్లి
కోటిపల్లి రేవు (యార్డు)
155
గూడపర్తి
159
మేడపాడు
162
పెదబ్రహ్మదేవం
167
బిక్కవోలు
171
బలభద్రపురం
177
అనపర్తి
181
ద్వారపూడి
185
కేశవరం
జివికె పవర్ ప్లాంట్
191
కడియం
జాతీయ రహదారి 16
200
రాజమండ్రి
204
గోదావరి / రాజమండ్రి విమానాశ్రయం
గోదావరి ఆర్చ్ వంతెన / గోదావరి
గోదావరి వంతెన / గోదావరి
208
కొవ్వూరు
211
పశివేదల
215
చాగల్లు
219
బ్రాహ్మణగూడెం
223
నిడదవోలు జంక్షన్
230
కాలధారి
234
సత్యవాడ
జాతీయ రహదారి 16
239
తణుకు
242
వేల్పూరు
245
రేలంగి
234
సత్యవాడ
250
అత్తిలి
252
మంచిలి
257
ఆరవిల్లి
260
లక్ష్మీనారాయణపురం
262
వేండ్ర
272 / 0
భీమవరం జంక్షను
30
నరసాపురం
26
గోరింటాడ
21
పాలకొల్లు
16
లంకలకోడేరు
13
శివదేవుచిక్కాల
11
వీరవాసరం
7
శృంగవృక్షం
5
పెన్నాడ అగ్రహారం
274
భీమవరం టౌన్
281
ఉండి
286
చెరుకువాడ
292
ఆకివీడు
302
పల్లెవాడ
308
కైకలూరు
316
మండవల్లి
319
మొఖాసాకలవపూడి
322
పుట్లచెరువు
324
పసలపూడి
327
గుంటకోడూరు
330
మోటూరు
337 / 0
గుడివాడ జంక్షన్
మచిలీపట్నం పోర్ట్ (ప్రణాళిక)
374
మచిలీపట్నం
370
చిలకలపూడి
364
పెడన
356
వడ్లమన్నాడు
352
కౌతరం
348
గుడ్లవల్లేరు
343
నూజెళ్ళ
7
దోసపాడు
9
వెంట్రప్రగడ
13
ఇందుపల్లి
18
తరిగొప్పుల
24
ఉప్పలూరు
30
నిడమానూరు
జాతీయ రహదారి 16
35
రామవరప్పాడు
39
మధురానగర్
230
మారంపల్లి
234
నవాబ్‌పాలెం
237
ప్రత్తిపాడు
243
తాడేపల్లిగూడెం
249
బాదంపూడి
254
ఉంగుటూరు
257
చేబ్రోలు
260
కైకరం
265
పూళ్ళ
271
భీమడోలు
277
సీతంపేట
281
దెందులూరు
జాతీయ రహదారి 16
290
ఏలూరు
292
పవర్‌పేట
299
వట్లూరు
జాతీయ రహదారి 16
309
నూజివీడు
315
వీరవల్లి
318
తేలప్రోలు
325
పెదఆవుటపల్లి
330
విజయవాడ విమానాశ్రయము
గన్నవరం
337
ముస్తాబాద
344
గుణదల
వరంగల్ కు
350 / 43
విజయవాడ జంక్షన్
కృష్ణానది
గుంటూరు-కృష్ణ కెనాల్ రైలు మార్గము నకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము నకు


దేశంలో నాల్గవ అత్యధిక ఆదాయం కలిగిన వాల్తేరు డివిజన్ ప్రధాన కేంద్రం విశాఖ పట్నంలో ఏర్పాటు చేయబడింది.

హౌరా - చెన్నై రైలు మార్గంలో విశాఖపట్నం జంక్షన్ ఒక ప్రధాన రైల్వే స్టేషన్. దేశంలో దాదాపు అనేక ప్రాంతాలకు ఇక్కడి నుండి ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్ కాకుండా దువ్వాడ, అనకాపల్లి రైల్వే స్టేషన్ లలో కూడా అనేక ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుస్తాయి. సింహాచలం రైల్వే స్టేషన్ లో కూడా కొన్ని ఎక్ప్ ప్రెస్ రైళ్లు, పాసెంజర్ రైళ్లు నిలుస్తాయి. ఇవి కాకుండా మర్రిపాలెం, పెందుర్తి, తాడి వంటి చిన్న రైల్వే స్టేషన్లు నగరంలో ఉన్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్ పై వత్తిడి తగ్గించుటకు కొన్ని రైళ్లు దువ్వాడ సింహాచలం మీదుగా మళ్లించటం జరుగుతోంది.

జోధ్ పూర్, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, గుంటూరు, కొల్లం, షిర్డీ, ముంబయి, కోరాపుట్, తిరుపతి, భువనేశ్వర్, గాంధీ ధామ్, కోలకతా, దీఘా, టాటా నగర్, చెన్నై, నరసాపురం, మచిలీపట్టణం, కోర్బా, నాందేడ్, కిరండూల్, పారాదీప్ నగరాలకు ఎక్స్ ప్రెస్ రైళ్లు రాయపూర్, గుణుపూర్, కిరండూల్, కోరాపుట్, శ్రీకాకుళం రోడ్, అరకు, విజయవాడ, బరంపూర్, రాయగడ, కాకినాడ, విజయనగరం, రాజమహేంద్రవరం, పలాస, దుర్గ్ నగరాలకు పాసెంజర్ రైళ్లు విశాఖపట్నం స్టేషన్ నుండి ప్రారంభం అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే నుండి వాల్తేర్ డివిజన్ ని, దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ ల కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్ లోని ఒడిశా భాగాలూ నూతనంగా ఏర్పాటు చేయబడు రాయగడ డివిజన్ లో భాగం కానున్నాయి. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లోని మిగిలిన భాగాలు విజయవాడ డివిజన్ లో విలీనం చేసేలా సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వాయు మార్గం[మార్చు]

విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఇండిగో, స్కూట్ స్పైస్ జెట్,సిల్క్ ఏర్వేస్, శ్రీలంక ఏర్ వేస్ వంటి విమానయాన సంస్థలు కౌలాలంపూర్ దుబాయ్, సింగపూర్,శ్రీలంక వంటి దేశాలకు అంతర్జాతీయ సర్వీస్ లు, దేశీయంగా బెంగళూరు, కోలకతా, ఢిల్లీ, హైదరాబాద్, ముంబాయి, పోర్ట్ బ్లెయిర్, విజయవాడ, చెన్నై, రాజమహేంద్రవరం, వారణాసి నగరాలకు విమాన సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇక్కడనుండి కార్గో సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం ప్రయాణికుల సౌకర్యం కొరకు టెర్మినల్ భవనాన్ని విస్తరిస్తున్నారు

ఇది నౌకాదళం అధీనంలో నడిచే విమానాశ్రయం. ఇందులోనే ఐ.ఎన్.ఎస్. డేగ పేరుతో నౌకాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణిస్తుంటాయి. ఇది పౌరులకు నిషిద్ధ ప్రాంతం.

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భోగాపురంలో ఆధునిక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

రుషి కొండలో నగర విహంగ వీక్షణం కొరకు సెలవుదినాలలో, పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో హెలికాప్టర్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది.

జల మార్గం[మార్చు]

ఇక్కడ సంవత్సరంలో అన్ని రోజులు నౌకలు నిలుపుదల చేయగల సహజ సిద్ద నౌకాశ్రయం కేంద్ర ప్రభుత్వ అధీనంలో లోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఇది కాకుండా దేశం లోనే లోతైన పోర్ట్ అయిన గంగవరం పోర్ట్ ద్వారా కూడా ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. స్థానిక జాలర్ల కొరకు రాష్ట్రం లోనే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయబడింది.

ఎగుమతులు,దిగుమతుల కోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ఏర్పాటు చేయబడింది.

విశాఖ పోర్ట్ నుండి పోర్ట్ బ్లెయిర్ కి క్రూయిజ్ సౌకర్యం ఉంది.

పర్యాటకుల విహారం కొరకు ఫిషింగ్ హార్బర్ నుండి, రుషికొండ బీచ్ నుండి సాగరంలో బోటింగ్ సౌకర్యాలు ఉన్నాయి.

మార్కెట్లు, బజార్లు[మార్చు]

సంప్రదాయ మార్కెట్లు[మార్చు]

 • పూర్ణా మార్కెట్ : (సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్)
 • కురుపాం మార్కెట్ : మొదటి నుంచి ఈ ప్రాంతం బంగారం, వెండి వ్యాపారానికి ప్రసిద్ధి. విశాఖపట్నంలో మొట్ట మొదటి బంగారం, వెండి వ్యాపార కేంద్రం. కురౌపాం రాజులు,వారి పాలనా కాలంలో ఈ మార్కెట్టును కట్టించారు. ఇప్పటికీ, కురుపాం మార్కెట్టు లోనికి వెళ్ళే ద్వారం మీద వారి పేరు వుంటుంది. ఈ ప్రాంతంలో దొరకని ఆయుర్వేద మూలిక వుండదు. అలగే, యజ్ఞాలు చేసే సమయంలో వేసే పూర్ణాహుతి సామాన్లు కోసం, పెళ్ళి చేసుకునే సమయంలో వేసే కర్పూరం దండలు వగైరా సామాన్లు కోసం కురుపాం మార్కెట్ కి రాక తప్పదు.
 • కాన్వెంట్ జంక్షన్ అని పిలిచే చావుల మదుం దగ్గరకి తెల్లవారు ఝామునే, లారీల మీద దేవరాపల్లి, మాడుగుల వంటి అటవీ (ఏజెన్సీ) ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల కూరగాయలు పండించే రైతులు, ఇక్కడికి తెచ్చి వేలంపాట ద్వారా కూరగాయలు అమ్ముతారు. విశాఖపట్నంలోని కూరగాయల వ్యాపారులు, హోటళ్ళ వారు వీటిని పెద్ద మొత్తంలో కొనుక్కుని వెళతారు. వీరు, విశాఖ నివాసులకి స్థానికంగా వున్న బజారులలో అమ్ముకుంటారు.
 • గాజువాక : గాజువాక మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే, పళ్ళ మార్కెట్ ఉంది.ఆరటి పళ్ళ గెలలు, కాలాన్ని బట్టి పండే, మామిడి, పుచ్చకాయలు వంటివి ఇక్కడ వేలంపాట ద్వారా అమ్ముతారు. ఆ పక్కనే, కణితి గ్రామానికి వెళ్ళే దారిలో, గాజువాక చుట్టుప్రక్కల గ్రామాల వారికి కావలసిన కిరాణా సరుకులు, కూరగాయలు, మాంసాహారం, చేపలు వగైరా అమ్ముతారు. ఇది ఈ చుట్టు ప్రక్కల చాలా పెద్ద మార్కెట్టు. రెండు, మూడు సార్లు పెద్ద అగ్నిప్రమాదాల పాలై, కోలుకున్న మార్కెట్టు ఇది. అక్కడికి దగ్గరలోనే వెండి, బంగారం దుకాణాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఆధునిక వాణిజ్య సముదాయాలు[మార్చు]

సి ఎం ఆర్ సెంట్రల్ - ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ (4 స్క్రీన్ లు)

ఐనాక్స్ - వరుణ్ బీచ్ (6 స్క్రీన్ లు)

చిత్రాలయ - ఐనాక్స్ (3 స్క్రీన్ లు)

విశాఖపట్నం సెంట్రల్ - ముక్తా ఎ2 సినిమాస్ (3 స్క్రీన్ లు)

ఇవే కాక బిగ్ బజార్, షాపర్స్ స్టాప్, వాల్ మార్ట్, ఎం.వి.ఆర్ మాల్,ఆర్కే స్టోర్స్,లక్కీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డీ మర్ట్స్, మోర్,వంటి ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

స్వచ్ఛంద సంస్థలు[మార్చు]

విశాఖపట్నంలో లైన్స్ క్లబ్ (లయన్స్ క్లబ్), రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్. సావిత్రిబాయి ఫూలే ట్రస్టు, గోపాల పట్నం. ప్రతిజ్ఞ ఛారిటబుల్ ట్రస్టు, ఆర్.పి.పేట, మర్రిపాలెం, ప్రేమ సమాజం వంటి అనేక స్వచ్ఛంద సంస్థలున్నాయి

సాంస్కృతిక సంస్థలు[మార్చు]

విశాఖ సాహితి

కళాభారతి

విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి 1991 మార్చి 3 న స్థాపించారు. వ్యవస్థాపక దినోత్సవము ప్రతీ సంవత్సరము 3 మార్చి న జరుగుతుంది. సంగీత విద్వన్మణి సుసర్ల శంకర శాస్త్రి కలలకు ప్రతీకగా పుట్టిన ఈ ఆడిటోరియాన్ని 1991 మే 11 తేదీన పిఠాపురం కాలనీలో ప్రారంభించారు. ఇక్కడ నిత్యం, వివిధ సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు (సంప్రదాయ, జానపద), నాటకాలు జరుగుతూ, ఆంధ్ర దేశపు ఔన్న్తత్యాన్ని తెలియ జేస్తుంటాయి. ఆగస్టు 2011 లో రజతోత్సవాలు జరుగుతాయి.

విశాఖ మ్యూజిక్ డాన్స్ అకాడమీ

ఈ సంస్థ విశాఖపట్నంలోని సంగీత (కర్ణాటక, హిందుస్థానీ), నృత్య కార్యక్రమాలకు కేంద్ర స్థానంగా ఉంది. సంగీత, నృత్య ప్రదర్శనల కార్యక్రమాలను, త్యాగరాజు ఆరాధనోత్సవాలు, మొదలైన కార్యక్రమాలు జరిస్తుంది. విశాఖపట్నంలోని సంగీతం, నృత్యం అంటే అభిమానం ఉన్నవారికి, ఈ సంస్థ వారిని నిత్యం ఆనందింపచేస్తుంది.

కళ్యాణ మండపాలు[మార్చు]

 • తి.తి.దే. కళ్యాణమండపం. ఇది ఎం.వి.పీ. (మువ్వల వాని పాలెం) కాలనీలో ఉంది.

పత్రికా సంస్థలు[మార్చు]

ఈనాడు,

సాక్షి,

ఆంధ్రజ్యోతి,

వార్త,

ఆంధ్ర భూమి,

ఆంధ్ర ప్రభ,

ఇండియన్ ఎక్స్ ప్రెస్,

ది హిందూ (విజయ నగరం నుంచి ముద్రితం అవుతుంది)

ప్రముఖులు[మార్చు]

నియోజక వర్గాలు[మార్చు]

 1. శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం
 2. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం - సింహాఛలం (కొంత భాగం), భీమిలి (భీమునిపట్నం) మునిసిపాలిటీ, భీమిలి మండలం, పద్మనాభం, ఆనందపురం.
 3. తూర్పు విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 1 నుంచి 11 వార్డులు,
 4. దక్షిణ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 12 నుంచి 34, 42, 43 వార్డులు.
 5. పశ్చిమ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 35 నుంచి 49, 66 నుంచి 69 వార్డులు.
 6. ఉత్తర విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 26 నుంచి 33 వార్డులు.
 7. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం - గాజువాక, పెద గంట్యాడ మండలాల్లో వున్న 50నుంచి 65 వార్డులు.
 1. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం - 69 నుంచి 72 వార్డులు. పెందుర్తి, సింహాచలం మండలంలు.


చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

అంధ్రప్రదేశ్ టూరిజం

మూలాలు[మార్చు]

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-14.
 2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
 3. "Visakhapatnam". India Meteorological Department. May 2011. Archived from the original on 5 ఏప్రిల్ 2010. Retrieved 26 March 2010.
 4. "IMD – Temperature extremes recorded upto 2010". India Meteorological Department (Pune). Retrieved 2 July 2014.
 5. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 240. Retrieved 10 March 2015.
 6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)

మూసలు, వర్గాలు[మార్చు]