రుషికొండ బీచ్
ఋషికొండ బీచ్ | |
---|---|
ప్రదేశం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Coordinates | 17°46′57″N 83°23′06″E / 17.7825201°N 83.3851154°E |
Geology | బీచ్ |
ఋషికొండ బీచ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతంలో ఉన్న బీచ్.[1] ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంతో ఈ బీచ్ నిర్వహించబడుతోంది.[2] వైజాగ్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన రుషికొండ బీచ్, వైజాగ్ నగరంలో ప్రాచూర్యం పొందిన బీచ్. ఇది పర్యాటకులను, ఇక్కడి స్థానికులను ఆకర్షిస్తోంది. ఈ బీచ్ ను 'జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్' అని కూడా పిలుస్తారు.[3]
వివరాలు
[మార్చు]ఈతకొట్టడం, వాటర్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ వంటి ఆటలు ఆడుకోవడానికి అనువైన ప్రదేశం. అదనంగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ బీచ్ చుట్టూ కుటీరాలు, రెస్టారెంట్లు, ఇతర సౌకర్యాలతో పాటు ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా మార్చింది.[4]
గుర్తింపు
[మార్చు]భారతదేశ బ్లూ ఫ్లాగ్ బీచ్స్ మిషన్ నుండి రుషికొండ బీచ్ కు ఎకో లేబుల్ ‘బ్లూ ఫ్లాగ్’ వచ్చింది. దాంతో ఈ బీచ్‌కు ఇప్పుడు గ్లోబల్ పర్యాటకం మ్యాప్‌లో స్థానం లభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 2017లో రుషికొండ బీచ్ నామినేట్ చేయబడగా, 2018 ఫిబ్రవరిలో ఖరారు చేయబడింది. అవుట్డోర్ ఫిట్నెస్ పరికరాలు, నిరంతరం బీచ్ శుభ్రపరిచే యంత్రాలు, సిసిటివి కెమెరాలు, లైఫ్ గార్డ్లు వంటి భద్రతా పరికరాలు ఈ ప్రాజెక్టులో భాగంగా అందించబడ్డాయి.[5]
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రుషికొండ బీచ్ మీదుగా ఉషోదయ, సాగర్ నగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, పెద్ద వాల్తేరు, ఎంవిపి కాలనీ, రుషికొండ, మంగమారిపేట, ఐఎన్ఎస్ కళింగ, మద్దిలపాలెం, ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల, మధురవాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[6]
రుషికొండ బీచ్‌లో ప్రసిద్ధి చెందినవి
[మార్చు]నీటి అడుగున శ్వాస ఉపకరణం - స్కూబా డైవింగ్, సముద్ర కయాకింగ్, పారామోటరింగ్, స్పీడ్ బోటింగ్, జెట్ స్కీ, వంటి ఎన్నో వినోదాత్మకమైన ఆటలు ఉన్నాయి. బీచ్ నీటిలో పర్యాటకులు నీటి క్రీడలను ఆస్వాదించవచ్చు. .[7]
వివాదం
[మార్చు]ఆంధ్ర ప్రదేశం ప్రభుత్వ పర్యటన శాఖ రుషికొండ మీద ఒక ౨౪౦ కోట్ల 5 స్టార్ హోటల్, రిసార్టును నిర్మాంచాలని నిర్ణయించింది . ఆ కారణం చేత కొండ యొక్క నడుమ భాగంలో చెట్లను నరికివేసిరి. యైకాపా రాక ముందు ఎంతో మనోరంజకమైన ప్రకృతి అందాలను కలిగి ఉండింది ఆ కొండ. అయితే ౨౦౨౩లో రుషికొండ బోడిగా మారిపోయింది. ప్రజలు అభ్యంతరం తెలిపినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు .ఒక అద్భుతమైన పర్యాటక ఆకర్షణను ఆంధ్ర ప్రదేశం కోల్పోయె.
దృశ్యమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Beach Road, Rushikonda, Visakhapatnam, Vishakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 15 July 2021.
- ↑ "Rushikonda Beach". Andhra Pradesh Tourism Development Corporation. Archived from the original on 31 ఆగస్టు 2015. Retrieved 15 July 2021.
- ↑ "Rishikonda Beach, Vizag". www.holidify.com. Retrieved 15 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Rushikonda Beach Vizag". vizagtourism.org.in. Retrieved 15 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ The Hindu, AndraPradesh (12 October 2020). "Vizag's Rushikonda beach gets eco-label 'Blue Flag'" (in Indian English). Archived from the original on 12 October 2020. Retrieved 15 July 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 15 July 2021.
- ↑ "Tings To Do in Rushikonda Beach Vizag". www.vizagdekho.com. Retrieved 9 Oct 2021.