Jump to content

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ
ప్రభుత్వ రంగం అవలోకనం
అధికార పరిధి ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
ప్రధాన కార్యాలయం విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
నినాదం అంతా సాధ్యమే!
మాతృ శాఖ పర్యాటక శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఆంగ్లం: Andhra Pradesh Tourism Development Corporation) భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహిచే ప్రభుత్వ సంస్థ. ఇది విజయవాడ కేంద్రంగా పనిచేస్తుంది.[1] దీని ఆధ్వర్యంలో హోటళ్లు, రిసార్టులు, బస్సులు లాంటి పర్యటన సౌకర్యాలు అందచేస్తున్నది. దీనితోబాటు సమాచార, రిజర్వేషన్ కేంద్రాలు, ధ్వని, కాంతి ఆకర్షణలు, తీరిక సమయపు పడవ ప్రయాణం, సమావేశాలకొరకు ఓడ ప్రయాణం సేవలు అందచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప చారిత్రక, సహజ నేపథ్యాన్ని సూచించే వారసత్వ, ప్రకృతిక, సాహస, ఆరోగ్య, గ్రామీణ పర్యటన ప్యాకేజీలను అందిస్తుంది.. తిరుపతి, హార్స్లీ హిల్స్, అరకు, విశాఖపట్నం, శ్రీశైలం వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో రిసార్టులను నిర్వహిస్తుంది. 63 హైటెక్ కోచ్‌లు, 29 వోల్వో కోచ్‌లు, 8 ఎయిర్ కండిషన్డ్ హైటెక్ కోచ్‌లు, 4 సెమీ స్లీపర్స్, 11 మినీ వాహనాలు, 1 వింటేజ్ కోచ్, 10 క్వాలిస్ వంటి పలు వాహనాలను కలిగివుంది. ఇది విశ్రాంతి పర్యటనను కూడా ప్రోత్సహిస్తుంది.[2]

పర్యాటక శాఖ

[మార్చు]

ఈ సంస్థ మాత్రశాఖ పర్యాటక శాఖ. ఇది రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల గురించి సమాచారాన్ని అందరికీ అందజేస్తుంది.[3][4]

గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్

[మార్చు]
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దేవస్థానం

భారతీయ రాష్ట్రాలకు పర్యాటకుల సందర్శనల సంఖ్యను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. 2013లో, 15.21 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను సందర్శించారు, ఇది దేశీయ పర్యాటక మార్కెట్లో సుమారు 13.3%గా ఉంది. రాష్ట్రంలో చారిత్రక దేవాలయాలు, సుందరమైన ప్రదేశాలు, సముద్రతీరాలు, జలాశయాలు, సహజమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని కనీస అవసరాలకు అనుగుణంగా ఉన్న అన్ని కొత్త పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు లగ్జరీ పన్ను 100% మినహాయింపు అధికారులచే అందించబడుతుంది.[5]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (పర్యాటక రిజర్వేషన్ సేవలు)". Archived from the original on 2019-08-28. Retrieved 2019-08-28.
  2. "APTDC to develop leisure tourism". Business Standard. Retrieved 22 October 2014.
  3. "పర్యాటక స్థలాల సమాచార జాలస్థలి". Archived from the original on 2019-08-28. Retrieved 2019-08-28.
  4. "పర్యాటక శాఖ జాలస్థలి". Archived from the original on 2019-08-28. Retrieved 2019-08-28.
  5. "Focus Sectors in Tourism". APEDB. Retrieved 2019-08-28.

వెలుపలి లంకెలు

[మార్చు]