జగదాంబ సెంటర్
జగదాంబ సెంటర్ | |
---|---|
సమీపప్రాంతం | |
జగదాంబ సెంటర్, థియేటర్ | |
నిర్దేశాంకాలు: 17°42′45″N 83°18′11″E / 17.712392°N 83.302987°ECoordinates: 17°42′45″N 83°18′11″E / 17.712392°N 83.302987°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
ప్రభుత్వం | |
• నిర్వహణ | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్కోడ్ | 530002 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | ఏపి-31 |
జగదాంబ సెంటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక వాణిజ్యం ప్రాంతం.[1] సెంట్రల్ జంక్షన్ వద్ద ఉన్న జగదాంబ థియేటర్ పేరుమీదుగా ఈ జంక్షన్ కు జగదాంబ సెంటర్ అని పేరు వచ్చింది. ఈ ప్రాంతం సెంట్రల్ షాపింగ్, వినోద కేంద్రంగా ఉంది.
భౌగోళికం[మార్చు]
ఇది 17°42′45″N 83°18′11″E / 17.712392°N 83.302987°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు[మార్చు]
ఇక్కడికి సమీపంలో దాబా గార్డెన్స్, పోర్ట్ ఏరియా, పోర్ట్ ఆఫీసర్స్ క్వార్టర్స్, మహారాణిపేట, నెహ్రూ నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్యం[మార్చు]
ఇక్కడ అనేక దుకాణాలు ఉన్నాయి. ఇది పర్యాటక కేంద్రం కాకపోయినా, అనేకమంది ఇక్కడికి వచ్చి ఈ మార్కెట్ నుండి వస్తువులనును కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హస్తకళల దుకాణాలు కూడా ఉన్నాయి.[2]
రవాణా[మార్చు]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్ మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, పూర్ణా మార్కెట్, యారాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Jagadamba Junction Locality". www.onefivenine.com. Retrieved 16 May 2021.
- ↑ http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-07-17/Tamannaah-inaugurates-South-India-Shopping-Mall-/312774
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 16 May 2021.