ఆదర్శ్ నగర్ (విశాఖపట్నం)
ఆదర్శ్ నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°45′47″N 83°19′56″E / 17.762925°N 83.332361°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530040 |
Vehicle registration | ఏపి-31 |
ఆదర్శ్ నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం. ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది. ఈ ప్రాంతం మీదుగా 16వ జాతీయ రహదారి వెళుతుంది. ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల,[1] 16వ జాతీయ రహదారి తోపాటు మధురవాడ జోన్ లో ఈ ఆదర్శ్ నగర్ ప్రాంతం ఉంది. ఇది నగరంలోని అన్ని ప్రాంతాలతో కలుపబడి ఉంది.
భౌగోళికం
[మార్చు]ఇది 17°45′47″N 83°19′56″E / 17.762925°N 83.332361°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో అరిలోవ, రవీంద్ర నగర్, విశాలాక్షి నగర్, ఇందిరాగాంధీ నగర్, హనుమంతవాక, దుర్గా నగర్ ఉన్నాయి.[2]
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆదర్శ్ నగర్ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు (గురు ద్వారా జంక్షన్, తగరపు వలస, విశాలాక్షి నగర్, రవీంద్ర నగర్, కైలాసగిరి, జూపార్క్) బస్సు సౌకర్యం ఉంది.[2][3]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- దశరథ రామాలయం
- హనుమాన్ దేవాలయం
- గణపతి దేవాలయం
- శ్సాయిబాబా దేవాలయం
- శివాలయం
- శ్రీలక్ష్మీ నారాయణ దేవాలయం
- రహమతుల్లాహి మసీదు
- మసీదు-ఎ-నూరాని
మూలాలు
[మార్చు]- ↑ "Locals kick up storm over betting centre in Visakhapatam". Times of India. 31 August 2018. Retrieved 2 May 2021.
- ↑ 2.0 2.1 "Adarsh Nagar , Visakhapatanam". www.onefivenine.com. Retrieved 2 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 2 May 2021.