లాసన్స్ బే కాలనీ
లాసన్స్ బే కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
![]() లాసన్స్ బే బీచ్ | |
Coordinates: 17°43′59″N 83°20′03″E / 17.732940°N 83.334212°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
ప్రభుత్వం | |
• సంస్థ | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాల మండలం | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530017 |
Vehicle registration | ఏపి-31 |
లాసన్స్ బే కాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం.[1] నగరంలోని ప్రశాంతమైన, అందమైన నివాస ప్రాంతాలలో ఇదీ ఒకటి.[2]
భౌగోళికం
[మార్చు]ఇది 17°43′59″N 83°20′03″E / 17.732940°N 83.334212°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో జాలరి పేట, ఎంవిపి కాలనీ, అప్పుఘర్, నార్త్ క్యాంపస్, మద్దిలపాలెం మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
గురించి
[మార్చు]ఈ కాలనీ ఎంవిపి కాలనీ పక్కనే ఉంది. నగరంలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాలలో ఒకటైన లాసన్స్ బే కాలనీలో ఒక బీచ్ కొత్తగా ప్రారంభించబడింది, పార్కులు కూడా ఉన్నాయి.[3]
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మాధవధార మీదుగా సాగర్ నగర్, ద్వారకా నగర్, డాబా గార్డెన్స్, జగదాంబ సెంటర్, వెంకోజిపాలెం, ఎంవిపి కాలనీ, పెద వాల్తేరు, సిరిపురం, ఆర్టీసీ కాంప్లెక్స్, అప్పుఘర్, టౌన్ కొత్తరోడ్, సింధియా, మల్కాపురం, గాజువాక, పెదగంట్యాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- శివాలయం
- నాగదేవుని గుడి
- శ్రీరామ మందిరం
- మసీదు-ఇ-బని-హషీమ్
- మహ్మదీయా మసీదు
మూలాలు
[మార్చు]- ↑ "Lawsons Bay Colony Locality". www.onefivenine.com. Retrieved 2021-05-15.
- ↑ location
- ↑ about
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 15 May 2021.