శ్రీహరిపురం (గాజువాక)
Appearance
శ్రీహరిపురం | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°41′18″N 83°14′20″E / 17.688210°N 83.238821°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండలం | గాజువాక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
శ్రీహరిపురం గాజువాక మండలం లోని ఒక గ్రామం.[1]. ఇక్కడకు దగ్గరలోనే హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)వుంది. ఆ సంస్థ ఉద్యోగుల నివాసాలు వుండే కోలనీ 'యారాడ పార్కు' కూడా ఇక్కడకు దగ్గరలోనే ఉంది. ఇది ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం. పరిశ్రమలలో పనిచేసే, అధికార్లు, పనివారు ఎక్కువగా ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉన్న దేవాలయాలు 'గణపతి ', ' అమ్మవార్ల రెండు గుళ్ళు' ఉన్నాయి. 'జవహర్ నగర్', 'పవనపుత్ర నగర్', రామ్ నగర్, యారాడ పార్కు, అన్నమ్మ కాలనీ, గుల్లల పాలెం వగైరా గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు, హై స్కూళ్ళు, ఉన్నాయి. జవహర్ నగర్ ప్రాంతమంతా ఎక్కువగా 'అపార్ట్ మెంట్లు' ఉన్నాయి. ఇక్కడి వారికి గుల్లల పాలెం మార్కెట్ పెద్ద మార్కెట్. ఒక ప్రభుత్వ వైద్య శాల వున్నది గుల్లల పాలెంలో.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-06.