శ్రీనగర్ (గాజువాక మండలం)
శ్రీనగర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°41′01″N 83°11′16″E / 17.6835763°N 83.1878475°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండలం | గాజువాక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
శ్రీనగర్, గాజువాక మండలంలో ఒక చిన్న గ్రామం. .[1] ఇది గాజువాకకు 2 కి.మీ. దూరంలో ఉంది. శ్రీనగర్ లో సుందరయ్య కాలనీ, గురునాధ రావు కాలనీ, కలసి ఉన్నాయి. శ్రీనగర్ లో టి.యస్.ఆర్.టి.బి.కె. కాలేజి ఉంది. ప్రస్తుతం శ్రీనగర్ 61 వ వార్డుగా మారింది. గతంలో ఇది 27 వ వార్డుగా ఉండేది. శ్రీనగర్ లో ప్రసిద్ధి చెందిన రామాలయం, శివాలయం, మన్నా చర్చి, సి.యల్.సి చర్చి ఉన్నాయి.
గాజువాకలో శ్రీనగర్ కి విద్యా కేంద్రంగా కూడా మంచి పేరు ఉంది. యస్.యస్.సి.లో 550 కన్నా ఎక్కువ మార్కులు ప్రతి సంవత్సరం వస్తూ గాజువాకకు మంచి పోటీ ఇస్తుంది. 2003వ సంవత్సరంలో సెయింట్ మేరీస్ పబ్లిక్ స్కూల్ 551 మార్కులతో గాజువాకలో అగ్రగామిగా ఉంది. యు. మురళీ గోపాల రావు అనే విద్యార్థిఈ ఘనతను సాధించాడు. 2006 వ సంవత్సరంలో సెయింట్ మేరీస్ పబ్లిక్ స్కూల్ కి చెందిన కె. సతీష్ కుమార్ 566 మార్కులతో తిరిగి మరలా ఈ ఘనతను సాధించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-11.