తుంగ్లాం
తుంగ్లాం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°44′22″N 83°18′28″E / 17.739369°N 83.307650°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530012 |
Vehicle registration | ఏపి - 33 |
సమీప ప్రాంతం | విశాఖపట్నం |
స్త్రీ పురుష నిష్పత్తి | 3:1 ♂/♀ |
అక్షరాస్యత | 84%% |
లోకసభ నియోజకవర్గం | విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | గాజువాక శాసనసభ నియోజకవర్గం |
తుంగ్లాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1]
చరిత్ర[మార్చు]
100 సంవత్సరాల చరిత్రను కలిగివున్న ఈ ప్రాంతం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ అనేక పరిశ్రమలు ఉండడంవల్ల వివిధ ప్రాంతాల ప్రజలు తమ జీవనోపాధి కోసం ఇక్కడకి వస్తారు.
భౌగోళికం[మార్చు]
ఇది 17°44′22″N 83°18′28″E / 17.739369°N 83.307650°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
ఇతర వివరాలు[మార్చు]
ఈ ప్రాంతం విశాఖపట్నం విమానాశ్రయం నుండి 6 కి.మీ.ల (3.7 మైళ్ళ) దూరంలో, విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి 16 కి.మీ.ల (9.9 మైళ్ళ) దూరంలో, దువ్వాడ రైల్వే స్టేషను నుండి 6 కి.మీ.ల (3.7 మైళ్ళ) దూరంలో ఉంది.
రవాణా[మార్చు]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తుంగ్లాం మీదుగా వుడాపార్క్, యాదవజగరాజుపేట, రామకృష్ణ బీచ్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్, సింధియా, మల్కాపురం, గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[2]
మూలాలు[మార్చు]
- ↑ http://www.thehindu.com/news/cities/Visakhapatnam/Tunglam-residents-stage-dharna/article17356519.ece about tunglam]
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 24 May 2021.