Jump to content

విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
(విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
Clockwise from Right to Left
Main Entrance of Visakhapatnam Railway station
Bhubaneshwar bound Intercity Express at Visakhapatnam
Guntur bound
General information
Locationజ్ఞానాపురం,రైల్వే న్యూ కోలని ,విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ,530004
భారతదేశము
Coordinates17°43′20″N 83°17′23″E 
Line  హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
Construction
Parkingఉన్నది
Other information
Station code VSKP
History
Electrifiedఅవును   
Location
Lua error in మాడ్యూల్:Mapframe at line 392: Unable to get latitude from input '17°43′20″N 83°17′23″E '..

మూస:విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము

విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను (వాల్తేర్ రైల్వే స్టేషన్) తూర్పు తీర రైల్వే జోనులోని విశాఖపట్నం నగరానికి సేవలందించే ప్రధానమైన రైల్వేస్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్లో అతిపెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇది హౌరా నుండి చెన్నై వెళ్ళు ప్రధాన రైలుమార్గంలో ఉంది. ఇది దేశంలో 20వ రద్దీగా ఉండే స్టేషను.[1]

విశిష్టత

[మార్చు]

విశాఖపట్నం రైల్వేస్టేషను ను మొదటగా  వాల్తేరు రైల్వేస్టేషను అని పిలిచేవారు.1987 లో దీని పేరును విశాఖపట్నం రైల్వేస్టేషను  గా మార్చారు. విశాఖపట్నం రైల్వేస్టేషను తూర్పు తీర రైల్వే లో అతిపెద్ద  రైల్వేస్టేషన్ల లో ఒకటి . దీనిని తూర్పు తీర రైల్వే జోన్ నిర్వహిస్తున్నది. విశాఖపట్నం రైల్వేస్టేషను లోనికి వచ్చు  రైలుబండ్లు తమ ప్రయాణ దిశను మార్చుకొని  ప్రయాణించవలసివుంటుంది. అందువల్ల  విశాఖపట్నం రైల్వేస్టేషను లో రైలుబండ్లు ఎక్కువసేపు ఆగవలసివుంటుంది. అందువల్ల ఈ రైల్వేస్టేషన్ లో ప్లాట్‌ఫారములు ఎక్కువ సమయం ఖాళీగా వుండవు. అందువల్ల కొన్ని రైలుబండ్లను కొత్తవలస-దువ్వాడ మార్గంలో మళ్ళిస్తున్నారు. ఈ   రైల్వేస్టేషన్ కు రెండుపక్కల ప్రవేశద్వారాలు కలవు.

ప్లాట్‌ఫారములు

[మార్చు]

విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో మొత్తం 8  ప్లాట్‌ఫారములు కలవు.  ప్రతి వేదిక (ప్లాట్‌ఫారము) కూడా 24 కంటే ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండినయినా కూడా తీసుకుని, నిర్వహించగలుగుతుంది. ఇక్కడ అన్ని ట్రాక్లను బ్రాడ్‌గేజ్‌గా మార్చబడనవి.

ఎక్స్‌ప్రెస్ రైళ్ళు

[మార్చు]
  1. విశాఖపట్నం–హజూర్ సాహిబ్ నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: నాందేడ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (నిజామాబాద్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్) అనేది మహారాష్ట్రలోని నాందేడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరాలను కలుపుతూ నడుపబడుతున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలు సేవ.
  2. విశాఖపట్నం–భగత్ కీ కోఠి ఎక్స్‌ప్రెస్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం - రాజస్థాన్‌ రాష్ట్రంలోని భగత్ కీ కోఠి స్టేషనల్ మధ్య ఈ రైలు నడుస్తోంది.
  3. విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్: భారతీయ రైల్వేకు చెందిన రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్. ఇది 2010, మార్చి 24న ప్రారంభించబడింది.
  4. విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం రైల్వే స్టేషన్ - ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య నడుస్తున్న సూపర్ ఫాస్ట్ రైలు
  5. విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్: భారతీయ రైల్వే సూపర్ ఫాస్ట్ ఏసి ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది 2011-12 రైల్వే బడ్జెట్‌లో అప్పటి భారతీయ రైల్వేమంత్రి మమతా బెనర్జీ ద్వారా సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు కలుపబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

మూసలు, వర్గాలు

[మార్చు]