Jump to content

గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°18′03″N 80°26′34″E / 16.3008°N 80.4428°E / 16.3008; 80.4428
వికీపీడియా నుండి
గుంటూరు జంక్షన్‌ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationగుంటూరు , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°18′03″N 80°26′34″E / 16.3008°N 80.4428°E / 16.3008; 80.4428
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లుగుంటూరు–తెనాలి రైలు మార్గము, కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గము, పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము, నల్లపాడు–గుంతకల్లు రైలు మార్గము, గుంటూరు-మాచర్ల రైలు మార్గము, గుంటూరు-రేపల్లె రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు7
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను ) ప్రామాణికం
పార్కింగ్ఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుGNT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
History
Opened1 April 2003; 21 సంవత్సరాల క్రితం (1 April 2003)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

గుంటూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: జిఎన్‌టి) [1] అనేది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో గుంటూరు రైల్వే డివిజను లోని కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గములో ఉంది.[2][3] ఇది భారతదేశంలో 295 వ అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషను.[4]

చరిత్ర

[మార్చు]
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నుండి గుంటూరు ప్రకృతి దృశ్యం వీక్షణ

కృష్ణ కెనాల్-నంద్యాల (కెసిసి-ఎన్‌డిఎల్) మార్గము బ్రిటిష్ భారతదేశం యొక్క అప్పటి మద్రాసు ప్రావిన్స్ లో మచిలీపట్నంకు గోవాలో మార్గోవా అనుసంధానం చేసే ముఖ్యమైన ఈస్ట్-వెస్ట్ కోస్ట్ లింక్ యొక్క ఒక భాగంగా ఉండేది. ఇది మొదట మీటరు గేజ్ (నారోగేజ్) గా దక్షిణ మరాఠా రైల్వేలు (తరువాత మద్రాస్ , దక్షిణ మరాఠా రైల్వేలు-ఎమ్‌ఎస్‌ఎమ్‌ఆర్) 1885-1890 సమయంలో నిర్మించారు.[5] నల్లమల పరిధులు గుండా ట్రాక్ ఉండటం వలన , దాని ఫలితంగా చాలా కొన్ని ప్రధాన ఇంజనీరింగ్ పనులు, వీటి నిర్మాణం యొక్క పనులు ఈ మార్గము కొరకు చేపట్టడం జరిగింది. వీటిలో అత్యంత ఆకర్షణీయ భారీ దొరబావి వయాడక్ట్ [6] , బొగడ టన్నెల్ ఉండటం , ఇవి రెండూ నంద్యాల నుండి గురించి 30 కి.మీ. దూరములో ఉన్నాయి.

పాత దొరబావి వయాడక్ట్ అవశేషాలు, బొగడ

రేపల్లె తీర పట్టణం బ్రాంచ్ మార్గము, గుంటూరు 60 కి.మీ. తూర్పు 1910 సం.లో అదే సంస్థ నిర్మించిడం జరిగింది. ఈ మార్గము తెనాలి వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన మార్గమునకు అనుసంధానము చేయబడింది. ఈ రెండు విభాగాలు భారతీయ రైల్వే 'ప్రాజెక్ట్ యొక్క యూని గేజ్ కింద 1993-95 సమయంలో బ్రాడ్ గేజ్‌గా మార్చబడ్డాయి. ప్రధానంగా ఈ గేజ్ మార్పిడి, మునుపటి యొక్క, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో వెయ్యటం కష్టమైన పని. గాజులపల్లి , దిగువమెట్ట మధ్య పాత అమరికను విడిచిపెట్టి చాలా తక్కువ ఎత్తులో ఉన్న ఒక కొత్త బొగడ సొరంగం పొడవు 1.6 కిలోమీటర్లు , ఒక కొత్త దొరబావి వయాడక్ట్ భారీ వ్యయంతో నిర్మించారు.[7]

చెలమ టన్నెల్, గుంటూరు డివిజను

ఈ రైల్వే ట్రాక్ సుమారు 7 కి.మీ. దూరములోని కంబం రైల్వే స్టేషను నుంచి చారిత్రాత్మక కంబం ట్యాంక్ ద్వారా వెళుతుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే లోని గుంటూరు-నంద్యాల రైలు మార్గములో అత్యంత సుందరమైన లోయలలో ఇది ఒకటి.

గుంటూరులో మొట్టమొదటి రైలు మార్గము సేవలు మీటర్ గేజ్ లైన్ 1916 లో గుంటూరు-రేపల్లె రైలు మార్గము ప్రారంభించబడ్డాయి.[8] తరువాత గుంటూరు , హుబ్లి / గోవాల మధ్య. కృష్ణా నది పై ప్రకాశం బారేజ్ పూర్తయిన తరువాత హౌరా వైపుగా గుంటూరు / విజయవాడ మధ్య ఒక బ్రాడ్ గేజ్ రైల్ లైన్ నిర్మించబడింది.

గుంటూరు-మాచెర్ల విభాగం, వెనుకబడిన తెలంగాణ లోపలి ప్రాంతానికి సేవలను అందించేందుకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఆర్ ద్వారా 1930 లో నిర్మించారు. ఇది చాలా వాస్తవానికి మీటర్ గేజ్‌గా ఉంది , 1992-93 లో బ్రాడ్ గేజ్ కు మార్చారు.[9] ఈ విభాగం ప్రముఖంగా ప్రధానంగా పిడుగురాళ్ళ నుండి, సున్నపురాయి, క్వార్ట్జ్ , సిమెంట్ రవాణా కోసం ఉపయోగించిన లైమ్ సిటీగా పిలిచేవారు.[10]

విజయవాడ నుంచి సికింద్రాబాదుకు ఒక ప్రత్యామ్నాయ మార్గం తెరవడం, హైదరాబాదుకు తెలంగాణ లోపలి ప్రాంతమునకు అనుసంధానము చేయడం, 152 కిలోమీటర్ల పొడవైన బీబీనగర్-నడికుడి రైలు ప్రాజెక్టు శంకుస్థాపన 1974 ఏప్రిల్ 7 న అప్పటి భారతదేశం యొక్క ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేశారు. ప్రాజెక్టు చివరకు 1989 లో పూర్తయ్యింది , ఈ మార్గమును ఒక సంవత్సరం తరువాత ప్రారంభించారు.[11] . కృష్ణా నది , మూసి నది పరిధిలోకి రెండు ప్రధాన వంతెనలు ఈ భాగంలో ఉంటాయి. ఈ మార్గము గుండా అనేక దక్షిణ / తూర్పు వెళ్ళే రైళ్ళను ఉపయోగిస్తారు. అందుకు ప్రత్యేక కారణము కూడా ఉంది. అత్యధిక భారీగా, రద్దీగా ఉండే వరంగల్-విజయవాడ రైలు మార్గము యొక్క ఒత్తిడిని తగ్గించుటకు ఈ మార్గమును ఉపయోగిస్తారు. ఈ మార్గము ద్వారా క్వార్ట్జ్, బొగ్గు, ఎరువులు పాటు సిమెంట్ రవాణా ఒక ముఖ్యమైన వస్తువుగా ఉంది.[12]

20 వ శతాబ్దం చివరి నాటికి గుంటూరుకు వివిధ రైల్వే లైన్లు, గుంటూరు–తెనాలి రైలు మార్గము , గుంటూరు-మాచర్ల రైలు మార్గము, గుంటూరు–తెనాలి రైలు మార్గము , పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము, గుంటూరు-విజయవాడ రైలు మార్గము, గుంటూరు-నల్లపాడు-గుంతకల్లు రైలు మార్గము ఈ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషను గుండా వెళ్లాయి.

నిర్మాణం , సౌకర్యాలు

[మార్చు]
గుంటూరు రైల్వే జంక్షన్ వెస్ట్ టెర్మినల్ రిజర్వేషన్ ఆఫీస్
గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషను

ఈ స్టేషన్ 43,146 మీ 2 (464,420 చదరపు అడుగుల) విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇది 32 ఉద్యోగులచే నిర్వహించబడుతుంది.[2] ఇంటర్-కనెక్ట్ అయిన సబ్వే వ్యవస్థతో ఏడు ప్లాట్ ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్లు తూర్పు , పశ్చిమ టర్మినల్స్ వద్ద ఉన్నాయి. ఇక్కడ నుండి ప్రారంభమయ్యే రైళ్ళ ప్రాథమిక నిర్వహణ కోసం 2 పిట్ రైలు మార్గాలు ఉన్నాయి. పల్నాడు ఎక్స్‌ప్రెస్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ , ఇతర ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి.

వర్గీకరణ

[మార్చు]

గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషను ఎ-కేటగిరీ స్టేషను. ఇది గుంటూరు రైల్వే డివిజన్లో మోడల్ స్టేషను, ఆదర్శ్ స్టేషను , టచ్ & ఫీల్ (మోడరన్ స్టేషన్స్) గా గుర్తింపు పొందింది.[13] ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో అభివృద్ధికి ప్రధాన కేంద్రాలలో ఒకటిగా చేయాలని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ రైల్వే స్టేషను ఎంపిక చేయబడింది. ఈ ప్రయోజనం కోసం 25 కోట్ల బడ్జెట్ మంజూరు చేసింది. [14]

పనితీరు , ఆదాయాలు

[మార్చు]

సగటున, స్టేషను యొక్క ప్రయాణీకుల రద్దీ రోజుకు 25,438 సంఖ్యగా ఉంది. రోజువారీ, మొత్తం 44 ఎక్స్‌ప్రెస్, 46 ప్యాసింజర్ , 18 ఈఎంయు / డిఎంయు రైళ్లు స్టేషను వద్ద నిలుస్తాయి. ఈ స్టేషను సంవత్సరానికి 7.01 మిలియన్ టన్నుల సరుకులు , సరుకు రవాణా ద్వారా ఉత్పత్తి చేసిన సగటు ఆదాయం రూ.20.736 మిలియన్లు.[2]

క్రింద పట్టికలో గత సంవత్సరం స్టేషను యొక్క ప్రయాణీకుల ఆదాయాలు జాబితాలో ఉన్నాయి[2][15]

ప్రయాణీకుల ఆదాయాలు
సంవత్సరం ఆదాయాలుs
(లక్షల్లో)
2011-12 3467.30
2012–13 3648.00
2013–14 4523.27
2014–15 4980.39

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 45. Retrieved 31 May 2017.
  2. 2.0 2.1 2.2 2.3 "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 9,11. Retrieved 30 November 2015.
  3. "Station: Nellore". South Central Railway – Indian Railways. Retrieved 10 November 2016.
  4. "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-06.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-31. Retrieved 2018-06-06.
  6. http://cape2jat.blogspot.com/2007_07_01_archive.html
  7. Ibid
  8. Andhra Pradesh District Gazetteers: Guntur by Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal – 1977 – Page 188 In the years that followed, railway lines connecting Madras to Vijayawada (via) Tenali (1 898), Guntur to Repalle (1916) and Guntur to Macherla (1930) were opened.
  9. http://www.india9.com/i9show/-Andhra-Pradesh/Macherla/Macherla-Railway-Station-51999.htm
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-03. Retrieved 2018-06-06.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-04. Retrieved 2018-06-06.
  12. Ibid
  13. "Guntur Division" (PDF). South Central Railway. pp. 9, 11. Retrieved 18 January 2016.
  14. "కేంద్ర ప్రకటన: ఏపీలోని 4 రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా". telugu.oneindia.com. Retrieved 2018-04-04.
  15. "GUNTUR JN".

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
Terminusదక్షిణ మధ్య రైల్వే
Terminusగుంటూరు–తెనాలి రైలు మార్గము
Terminusపగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
Terminusగుంటూరు-రేపల్లె రైలు మార్గము
Terminusగుంటూరు-మాచర్ల రైలు మార్గము