Jump to content

గుంతకల్లు రైల్వే డివిజను

వికీపీడియా నుండి
గుంతకల్లు రైల్వే డివిజను
गुंतकल रेलवे डिवीज़न
Guntakal Railway Division
రిపోర్టింగ్ మార్క్GTL
లొకేల్ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
ఆపరేషన్ తేదీలు1956; 68 సంవత్సరాల క్రితం (1956)
మునుపటిదిదక్షిణ రైల్వే
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
మునుపటి గేజ్1,000 mm (3 ft 3+38 in)
పొడవు1,355.1 కిలోమీటర్లు (842.0 మై.)
ప్రధానకార్యాలయంగుంతకల్లు

గుంతకల్లు రైల్వే డివిజను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ (SCR) లోని ఆరు (డివిజన్లలో) విభాగాలలో ఒకటి.[1] ఈ డివిజను యొక్క ప్రధాన కేంద్రం గుంతకల్లు వద్ద ఉంది, దీని జోనల్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లో ఉంది. గుంతకల్లు డివిజను యూని గేజ్‌గా ఉంది. అనగా మొత్తం డివిజను బ్రాడ్ గేజ్ రైలు మార్గముగా ఉంది. 2014-15 సం.లో గుంతకల్లు రైల్వే డివిజను ఆదాయం దాదాపు రూ. 1460 కోట్లుగా ఉంది.

చరిత్ర

[మార్చు]

గుంతకల్లు రైల్వే డివిజను దక్షిణ రైల్వే జోన్ భాగంగా 1956 సం.లో రూపొందించారు. ఇది 1977 అక్టోబరు 2 సం.న దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు బదిలీ చేశారు.[2] ఇది ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రజలకు తన సేవలు అందిస్తుంది.

పరిధి

[మార్చు]
  • ఆంధ్ర ప్రదేశ్ లో 1205.1 రూట్ కి.మీ. మొత్తం దూరం పరిధి వర్తిస్తుంది.
  • కర్ణాటకలో 142.2 రూట్ కి.మీ. మొత్తం దూరం పరిధి వర్తిస్తుంది.
  • తమిళనాడులో 6.86 రూట్ కి.మీ. మొత్తం దూరం పరిధి వర్తిస్తుంది.

అధికార పరిధి

[మార్చు]
గుంతకల్ డబ్ల్యుడిఎం-3డి డీజిల్ లోకో
గుత్తి డబ్ల్యుడిఎం-3డి డీజిల్ లోకో

గుంతకల్లు రైల్వే డివిజను కింద ఈ క్రింది విభాగాలు ఉన్నాయి.

  • గుంతకల్లు జంక్షన్ - గుత్తి జంక్షన్ - రేణిగుంట జంక్షన్ → 309.5 కి.మీ. - విద్యుద్ధీకరణ - డబుల్ లైన్
  • గుత్తి జంక్షన్ - పెండేకల్లు జంక్షన్ → 29.28 కి.మీ. - విద్యుద్దీకరణ జరుగలేదు - సింగిల్ లైన్
  • గుత్తి జంక్షన్ - కల్లూరు జంక్షన్ - ధర్మవరం జంక్షన్ → 90.6 కి.మీ. - విద్యుద్దీకరణ - సింగిల్ లైన్
  • యర్రగుంట్ల - నొస్సం → 47.4 కి.మీ. - విద్యుద్దీకరణ జరుగలేదు - సింగిల్ లైన్
  • ధర్మవరం జంక్షన్ - పాకాల జంక్షన్ → 227.42 కి.మీ. - విద్యుద్దీకరణ జరుగలేదు - సింగిల్ లైన్
  • గుంతకల్లు జంక్షన్ - వాడి జంక్షన్ [మినహాయించి] → 221.13 కి.మీ. - విద్యుద్ధీకరణ ప్రక్రియ జరుగుతున్నది - డబుల్ లైన్
  • గుంతకల్లు జంక్షన్ - బళ్ళారి జంక్షన్ [మినహాయించి] → 46.2 కి.మీ. - విద్యుద్ధీకరణ జరుగలేదు - డబుల్ లైన్
  • గుంతకల్లు జంక్షన్ - ధోన్ జంక్షన్ - నంద్యాల [మినహాయించి] → 144.3 కి.మీ. - విద్యుద్దీకరణ జరుగలేదు - సింగిల్ లైన్
  • తిరుపతి - రేణిగుంట జంక్షన్ - గూడూరు జంక్షన్ [మినహాయించి] → 92.51 కి.మీ. - విద్యుద్ధీకరణ - డబుల్ లైన్
  • తిరుపతి - పాకాల జంక్షన్ - కాట్పాడి జంక్షన్ [మినహాయించి] → 103.59 కి.మీ. - విద్యుద్ధీకరణ - సింగిల్ లైన్
  • గుంతకల్లు జంక్షన్ - కల్లూరు జంక్షన్ → 40.26 కి.మీ. - విద్యుద్దీకరణ జరుగలేదు - సింగిల్ లైన్
  • గుంతకల్లు బై పాస్ → 0.8 కి.మీ. - విద్యుద్దీకరణ జరుగలేదు - సింగిల్ లైన్
  • రేణిగుంట బై పాస్ → 1.4 కి.మీ. - విద్యుద్దీకరణ - సింగిల్ లైన్

అనుసంధానము

[మార్చు]

గుంతకల్లు విభాగము, దక్షిణ మధ్య రైల్వేయందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

  • వాడి జంక్షన్ యొద్ద సికింద్రాబాదు విభాగముతో
  • డోన్ (ద్రోణాచలము) జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
  • రాయచూరు జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
  • కృష్ణా జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
  • నంద్యాల జంక్షన్ యొద్ద గుంటూరు విభాగముతో
  • గూడూరు జంక్షన్ యొద్ద విజయవాడ విభాగముతో
  • ఓబులవారిపల్లె యొద్ద విజయవాడ విభాగముతో

గుంతకల్లు విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

  • బళ్ళారి జంక్షన్ యొద్ద నైఋతి రైల్వే యొక్క హుబ్బళ్ళి విభాగముతో
  • వాడి జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క సోలాపుర్ విభాగముతో
  • వాడి జంక్షన్ యొద్ద నైఋతి రైల్వే యొక్క హుబ్బళ్ళి విభాగముతో
  • ధర్మవరము జంక్షన్ యొద్ద నైఋతి రైల్వే యొక్క బెంగుళూరు విభాగముతో
  • కాట్పాడి జంక్షన్ యొద్ద దక్షిణ రైల్వే యొక్క చెన్నై విభాగముతో
  • రేణిగుంట జంక్షన్ యొద్ద దక్షిణ రైల్వే యొక్క చెన్నై విభాగముతో
  • గూడూరు జంక్షన్ యొద్ద దక్షిణ రైల్వే యొక్క చెన్నై విభాగముతో

రైల్వే స్టేషన్లు వర్గం

[మార్చు]
తిరుపతి రైల్వే స్టేషను
  • ఎ 1 : తిరుపతి → [60 కోట్లు పైన]
  • ఎ : గుంతకల్లు జంక్షన్, రేణిగుంట జంక్షన్, కడప, అనంతపురం, యాద్గిరి, రాయచూరు జంక్షన్ → [8 - 60 కోట్లు]
  • బి : చిత్తూరు, ధర్మవరం జంక్షన్, గూటీ జంక్షన్, పాకాల జంక్షన్, ధోన్ జంక్షన్, ఆదోని, మంత్రాలయం రోడ్, శ్రీ కాళహస్తి → [4 - 8 కోట్లు]
  • డి : యర్రగుంట్ల, కదిరి, తాడిపత్రి, రాజంపేట, కోడూరు, వెంకటగిరి, కృష్ణా, నల్వార్, నారాయణపేట రోడ్ → [60 లక్షలు - 4 కోట్లు]
  • ఈ : 90 స్టేషన్లు → [60 లక్షలు పైన]
  • ఎఫ్ : అన్ని నిలుపు (హల్ట్) స్టేషన్లు

పారిశ్రామిక సేవలు

[మార్చు]
  • గుంతకల్లు రైల్వే డివిజను జువారీ సిమెంట్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, భారతి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ మొదలైన ఏడు (7) ప్రధాన (మేజర్) సిమెంట్ కర్మాగారాలకు పని సేవలు అందిస్తున్నది, దక్షిణ భారతదేశం యొక్క సిమెంట్ అవసరాలులో పెద్ద భాగం ఇది తీరుస్తుంది.
  • ఈ డివిజను నుండి స్టీల్ ప్లాంట్లు, ఒఎన్జిసిలు వంటి కర్మాగారములు వాటికి ముడి పదార్థాలు అయిన డోలమైట్, లైమ్ స్టోన్, బెరైటీస్, బెరైటీస్ పొడి వంటివి రవాణా జరుగుతున్నది.
  • ఈ రైల్వే డివిజను రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం, రాయచూరు థర్మల్ విద్యుత్ ప్లాంట్ వంటి రెండు (2) ప్రధాన (మేజర్) పవర్ ప్లాంట్స్ కొరకు సేవలు అందిస్తున్నది.

ప్రధాన స్థాపనలు

[మార్చు]
  • క్యారేజ్ మరమ్మతు షాప్ తిరుపతి వద్ద ఉంది.
  • డీజిల్ లోకో షెడ్లు గుంతకల్లు, గుత్తి వద్ద ఉన్నాయి.
  • గుంతకల్లు వద్ద దాదాపు 100 ఎలక్ట్రిక్ లోకోలు పక్కపక్కనే ఏర్పాటయ్యే విధంగా ఎలక్ట్రిక్ లోకో షెడ్ పనులు అభివృద్ధి పథంలో ఉన్నాయి.
  • గుంతకల్లు రైల్వే డివిజను నకు దక్షిణ మధ్య రైల్వే జోన్ దాదాపు 10 ఆరోగ్య కేంద్రాలు (హెల్త్ యూనిట్లు) కేటాయించింది.
  • గుంతకల్లు వద్ద 131 పడకలతో ఒక రైల్వే ఆసుపత్రి ఉంది.

ప్రాజెక్టులు

[మార్చు]
దక్షిణ మధ్య రైల్వే, గుంతకల్లు రైల్వే డివిజను లోని కొండాపురం రైల్వే స్టేషను
  • దక్షిణ మధ్య రైల్వే జోన్ అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన కడప - బెంగుళూరు కొత్త బ్రాడ్ గేజ్ రైలు మార్గము గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. దాదాపు 257 కిలోమీటర్ల పొడవైన నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గము కొరకు పునాది రాయి 2010 సంవత్సరంలో వేసారు. ఈ 257 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గములో, దాదాపు 200 కిలోమీటర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని కడప, చిత్తూరు జిల్లాల మధ్య ద్వారా రైలు మార్గము కొనసాగుతుంది. ఇది వ్యాపార కేంద్రాలు అయిన రాయచోటి, మదనపల్లె, బంగారుపేట ద్వారా వెళుతుంది. ఈ ప్రాజెక్టు 4 దశల్లో కింద పూర్తవుతుంది. మొదటి దశ కడప నుండి పెళ్ళిమర్రి వరకు పనులు పూర్తి అయ్యాయి. పెళ్ళిమర్రి నుండి రాయచోటి వరకు రెండవ దశ పని సాగుతోంది. రాయచోటి నుండి మదనపల్లె వరకు మూడవ దశ, మదనపల్లె నుండి బంగారుపేట వరకు నాల్గవ దశ చివరికి బెంగుళూరు వరకు అనుసంధానం (కనెక్ట్) చేయబడుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
గుంతకల్లు జంక్షన్

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "South Central Railway Divisions". Portal of Indian Railways. South Central Railway. Retrieved 1 June 2014.
  2. "Guntakal division overview". Portal of Indian Railways. South Central Railway. Archived from the original on 7 జూన్ 2014. Retrieved 1 June 2014.

బయటి లింకులు

[మార్చు]