గోల్కొండ ఎక్స్‌ప్రెస్
ఆలేరు వద్ద డబ్ల్యుఎపి4 లోకోమోటివ్‌తో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ | |||||
| సారాంశం | |||||
|---|---|---|---|---|---|
| రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
| స్థానికత | తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ | ||||
| ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
| మార్గం | |||||
| మొదలు | గుంటూరు | ||||
| గమ్యం | సికింద్రాబాద్ జంక్షన్ | ||||
| ప్రయాణ దూరం | 385 km (239 mi) | ||||
| సగటు ప్రయాణ సమయం | 8 గం. 15 ని. ఎగువ, దిగువ ప్రయాణము కొరకు | ||||
| రైలు నడిచే విధం | ప్రతిరోజు | ||||
| రైలు సంఖ్య(లు) | 17201 / 17202 | ||||
| సదుపాయాలు | |||||
| శ్రేణులు | ఎసి చైర్ కార్, రెండవ సిట్టింగ్, నిబంధనలు లేనివి | ||||
| కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
| పడుకునేందుకు సదుపాయాలు | లేదు | ||||
| సాంకేతికత | |||||
| పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
| వేగం | 46.91 km/h (29.15 mph) హాల్టులతో సరాసరి | ||||
| |||||
గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు మధ్య నడిచే ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్. 17201/17202 సంఖ్యలతో నడిచే ఈ రైలు భారతీయ రైల్వేలకు చెందిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కు చెందినది. మొత్తం 383 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు సుమారు 8 గంటల సమయం తీసుకుంటూ నెమ్మదిగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందింది. సికింద్రాబాద్, గుంటూరు మధ్య ఉన్న మొత్తం 24 (గుంటూరు, సికింద్రాబాద్ సహా) స్టేషన్లలోనూ ఈరైలు ఆగుతుంది.
పేరు
[మార్చు]హైదరాబాదు నగరంలోని చారిత్రక గోల్కొండ కోట పేరును ఈ రైలుకు పెట్టారు. గోల్కొండ కోట హైదరాబాదు లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. హైదరాబాదును పరిపాలించిన కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ కోటను నిర్మించారు.
రికార్డులు
[మార్చు]1973లో ప్రారంభించిన ఈ రైలు అప్పట్లో భారతదేశంలోనే అతి వేగంగా ఆవిరితో నడిచే ప్యాసింజర్ రైలుగా రికార్డుల్లోకి ఎక్కింది.[1]
విజయవాడ రైల్వే స్టేషన్ లో ఈ రైలు 15 నిమిషాల పాటు ఆగుతుంది. ఇక మిగతా అన్ని స్టేషన్లలో కేవలం 1 నిమిషం నుంచి 2 నిమిషాల సేపు మాత్రమే ఆగుతుంది.
మార్గం
[మార్చు]గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరులో ఉదయం 6:00 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 13:45గంటలకు చేరుతుంది.[2] తిరుగు ప్రయాణంలో రెండవ రేక్ రైలు సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 13:05 గంటలకు బయలు దేరి గుంటూరు స్టేషన్ కు రాత్రి 21:20 గంటలకు చేరుతుంది. ఆలేరు, ఖాజీపట, వరంగల్లు, విజయవాడ స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
రైలు ప్రమాదాలు
[మార్చు]జులై 2, 2003 ఉదయం వరంగల్ సమీపంలో గొల్గొండ ఎక్స్ ప్రెస్ రైలు వంతెన పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో కనీసం 21 మంది ప్రయాణికులు చనిపోయారు.[3][4] 1999లోనూ అప్పటి ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ) రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఘన్ పూర్ (స్టేషన్) సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది.
చిత్రమాలిక
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ Bryan Morgan (1985), The Great Trains, Rh Value Publishing, p. 206
- ↑ "Golconda Express timetable". cleartrip.com. the original నుండి 2015-05-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-07-21.
- ↑ "Golconda Express toll rises to 21". Rediff. July 3, 2003. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-07-21.
- ↑ V Subrahmanyam and D Krishna Reddy (July 2, 2003). "Golconda Express derails, 18 dead". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-07-21.