మణికర్ణిక ఎక్స్‌ప్రెస్
![]() | |||||
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | Superfast Train | ||||
స్థితి | Operating | ||||
స్థానికత | Telangana, Madhya Pradesh, Bihar | ||||
ప్రస్తుతం నడిపేవారు | South Central Railway, Indian Railways | ||||
మార్గం | |||||
మొదలు | Danapur railway station | ||||
ఆగే స్టేషనులు | 26 | ||||
గమ్యం | Secunderabad Junction | ||||
ప్రయాణ దూరం | 1,828 కి.మీ. (1,136 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 33 hours, 15 minutes | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | Sleeper, Ac 1,2,3 General | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Indian Rail standard | ||||
ఆహార సదుపాయాలు | Catering available | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large windows in all carriages, | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Below the seats | ||||
సాంకేతికత | |||||
వేగం | 54 km/h (Average) | ||||
|
మణికర్ణిక ఎక్స్‌ప్రెస్ (ఆంగ్లము:Manikarnika Express ; హిందీ: मणिकर्णिका एक्सप्रेस) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. దీనిని పాట్నా ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు. ఇది సికింద్రాబాద్, పాట్నా పట్టణాల మధ్య నడుస్తుంది. దీనిని సికింద్రాబాదు ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు.
వ్యుత్పత్తి[మార్చు]
ఈ రైలు కాశీయాత్ర చేయు వారికి బహుళ సౌకర్యంగా ఉంది. దీనికి వారణాసి లోని మణికర్ణిక ఘాట్ ఆధారంగా నామకరణం చేయబడింది. దీనిని 2004 సంవత్సరంలో సికింద్రాబాద్, వారణాసి పట్టణాల మధ్య వారికి రెండు రోజులు నడిపేవారు. రైల్వే మంత్రి నితిష్ కుమార్ పాలనాకాలంలో దీనిని పాట్నా వరకు పొడిగించారు.
ఈ రైలు చారిత్రాత్మకంగా ఉత్తర భారతదేశం చేరువారికి రెండవ ప్రత్యామ్నాయంగా తన సేవలందిస్తుంది. ఉత్తర భారత యాత్రలు చేయువారికి మొదటి స్థానంలో 2721UP/2722Dn దక్షిణ ఎక్స్‌ప్రెస్, 2723UP/2724DN ఎ.పి.ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఈ మణికర్ణికా ఎక్స్‌ప్రెస్ 2015 సెప్టెంబరు 10 నుండి ఆరా వద్ద ఆగిపోతుంది.[1]
రైలు సంఖ్య[మార్చు]
- 12791 సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను (SC) నుండి దానాపూర్ రైల్వే స్టేషను (DNR)
- 12792 దానాపూర్ రైల్వే స్టేషను నుండి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను
చారిత్రాత్మక గుర్తింపు[మార్చు]
ఈ రైలును 1985 లో వారానికి రెండుసార్లు తిరుపతి, వారణాసి మధ్య ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ రైలు "7489 తిరుపతి-వారణాసి" ఎక్స్‌ప్రెస్, "7490 వారణాసి-తిరుపతి ఎక్స్‌ప్రెస్" పేర్లతో నడుపబడేది. ఈ రైలు స్లిప్ కోచ్ సర్వీసుగా దక్షిణ ఎక్స్ ప్రెస్ నుండి ఖాజీపేట వద్ద హైదరాబాదు, వారణాసి మధ్య రెండు స్లీపర్ కోచ్‌లు విభజన జరిగేది. ఈ రైలుకు ప్రాముఖ్యత వచ్చిన తదుపరి కొన్ని రాజకీయ, నిర్వహణాపరమైన కారణాల మూలంగా దీనిని కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ వరకు పొడిగించారు. దీనిని వారానికి ఒక్కరోజు మాత్రమే రేణిగుంట జంక్షన్ గుండా తిరుపతి చేరే విధంగా యేర్పాటు చేసారు.
హైదరాబాదు నుండి వారణాసి వరకు రైలు కావాలనే డిమాండు పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే వారు "7091" సికింద్రాబాదు-వారణాసి ఎక్స్ ప్రెస్, "7092" వారణాసి-సికింద్రాబాదు ఎక్స్ ప్రెస్ నామాలతో వారానికి రెండుసార్లు నడిచేటట్లు 1987 లో ఆమోదం తెలిపారు. తత్ఫలితంగా అవే కోచ్‌లు, ర్యాక్ కంపోసిషన్ "7089" కొచ్చిన్-వారణాసి ఎక్స్‌ప్రెస్ (వయా తిరుపతి), "7090" వారణాసి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (వయ తిరుపతి) లను యేర్పాటుచేసి "7489", "7490" సంఖ్యలను రద్దు చేసారు.
ఇంజను లింకు[మార్చు]
- విద్యుత్:- దక్షిణ మధ్య రైల్వే లోని లాలాగూడ యొక్క WAP4 ఎలక్ట్రిక్ ఇంజను సికింద్రాబాదు నుండి ఇటార్సీ వరకు నడుపుతుంది లేదా ఏరోడ్ యొక్క WAP4 ఇంజను లాగుతుంది.
- డీసెల్:- ఇటార్సీ నుండి పాట్నా జంక్షన్ వరకు ఇటార్సీ యొక్క WDM2A/WDM3A ఇంజను లాగుతుంది.
ప్రయాణ మార్గం[మార్చు]
తెలంగాణ లోని సికింద్రాబాద్ జంక్షన్ లో బయలుదేరి కాజీపేట జంక్షన్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, మహారాష్ట్ర లోని బలార్షా జంక్షన్, చంద్రపూర్, సేవాగ్రాం జంక్షన్, నాగపూర్ జంక్షన్, కటోల్, మధ్య ప్రదేశ్ లోని బేతుల్, ఘోరడోంగ్రి, ఇటార్సీ జంక్షన్, జబల్పూర్ జంక్షన్, కాట్నీ, మైహార్, సట్నా, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు, జ్ఞానపూర్ రోడ్డు, వారణాసి జంక్షన్, ముఖల్ సరాయ్ జంక్షన్, దిల్‌డర్నాగర్ జంక్ష,, బీహారు లోని బక్సార్ గుందా ప్రయాణించి పాట్నా జంక్షన్ని చేరుతుంది.
సమయ పట్టిక[మార్చు]
సంఖ్య | స్టేషన్ పేరు (కోడ్) | చేరు సమయం | బయలుదేరు
సమయం |
ఆపిన
సమయం |
ప్రయాణించిన
దూరం |
రోజు | మార్గం |
---|---|---|---|---|---|---|---|
1 | డానాపూర్ (DNR) | ప్రారంభమయ్యేది | 12:15 | 0 | 0 km | 1 | 1 |
2 | అరా (ARA) | 12:56 | 12:58 | 2నిమిషాలు | 40 కి.మీ | 1 | 1 |
3 | బక్సర్ (BXR) | 13:50 | 13:52 | 2నిమిషాలు | 109 కి.మీ | 1 | 1 |
4 | దీల్దార్‌నగర్ జంక్షన్ (DLN) | 14:20 | 14:22 | 2నిమిషాలు | 145 కి.మీ | 1 | 1 |
5 | మొఘల్ సారాయ్ జంక్షన్ (MGS) | 15:50 | 16:05 | 15నిమిషాలు | 203 కి.మీ | 1 | 1 |
6 | వారణాసి జంక్షన్ (BSB) | 16:45 | 17:00 | 15నిమిషాలు | 219 కి.మీ | 1 | 1 |
7 | భూలన్‌పూర్ (BHLP) | 17:14 | 17:15 | 1 నిమిషం | 225 కి.మీ | 1 | 1 |
8 | జ్ఞానపూర్ రోడ్ (GYN) | 18:15 | 18:16 | 1 నిమిషం | 279 కి.మీ | 1 | 1 |
9 | అలహాబాద్ నగరాన్ని (ALY) | 20:08 | 20:10 | 2నిమిషాలు | 341 కి.మీ | 1 | 1 |
10 | అలహాబాద్ జంక్షన్ (ALD) | 20:20 | 20:48 | 28నిమిషాలు | 344 కి.మీ | 1 | 1 |
11 | సాత్నా (STA) | 23:45 | 23:55 | 10నిమిషాలు | 521 కి.మీ | 1 | 1 |
12 | కాట్నీ (KTE) | 01:05 | 01:10 | 5నిమిషాలు | 620 కి.మీ | 2 | 1 |
13 | జబల్పూర్ (JBP) | 02:40 | 02:50 | 10నిమిషాలు | 710 కి.మీ | 2 | 1 |
14 | ఇటార్సి జంక్షన్ (ET) | 06:50 | 07:00 | 10నిమిషాలు | 956 కి.మీ | 2 | 1 |
15 | ఘోరాడోంగ్రీ (GDYA) | 08:07 | 08:08 | 1 నిమిషం | 1026 కి.మీ | 2 | 1 |
16 | బెతుల్ (BZU) | 08:55 | 08:56 | 1 నిమిషం | 1062 కి.మీ | 2 | 1 |
17 | పందుర్న (PAR) | 10:10 | 10:12 | 2నిమిషాలు | 1149 కి.మీ | 2 | 1 |
18 | నాగ్పూర్ (NGP) | 11:45 | 11:55 | 10నిమిషాలు | 1253 కి.మీ | 2 | 1 |
19 | సేవాగ్రామ్ (SEGM) | 12:54 | 12:56 | 2నిమిషాలు | 1329 కి.మీ | 2 | 1 |
20 | చంద్రపూర్ (CD) | 14:30 | 14:31 | 1 నిమిషం | 1450 కి.మీ | 2 | 1 |
21 | బాల్‌హర్షా (BPQ) | 15:25 | 15:35 | 10నిమిషాలు | 1464 కి.మీ | 2 | 1 |
22 | సిర్పూర్ కాగజ్‌నగర్ (SKZR) | 16:25 | 16:26 | 1 నిమిషం | 1533 కి.మీ | 2 | 1 |
23 | బెల్లంపల్లి (BPA) ను | 17:02 | 17:03 | 1 నిమిషం | 1572 కి.మీ | 2 | 1 |
24 | మంచిర్యాల (ఎంసిఐ) | 17:17 | 17:18 | 1 నిమిషం | 1592 కి.మీ | 2 | 1 |
25 | రామగుండం (RDM) | 17:27 | 17:28 | 1 నిమిషం | 1605 కి.మీ | 2 | 1 |
26 | పెద్దపల్లి (PDPL) | 17:39 | 17:40 | 1 నిమిషం | 1623 కి.మీ | 2 | 1 |
27 | కాజీపేట జంక్షన్ (KZJ) | 18:48 | 18:50 | 2నిమిషాలు | 1698 కి.మీ | 2 | 1 |
28 | సికింద్రాబాద్ జంక్షన్ (SC) | 21:30 | గమ్యస్థానం | 0 | 1830 కి.మీ | 2 | 1 |
మూలాలు[మార్చు]
వనరులు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30. CS1 maint: discouraged parameter (link)
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30. CS1 maint: discouraged parameter (link)
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30. CS1 maint: discouraged parameter (link)
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537