Jump to content

షోలాపూర్-గుంతకల్ రైలు మార్గం

వికీపీడియా నుండి
షోలాపూర్-గుంతకల్ రైలు మార్గం
వాడీ జంక్షన్ రైల్వే స్టేషను
అవలోకనం
స్థితిపనిచేస్తోంది
లొకేల్మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
చివరిస్థానంషోలాపూర్
గుంతకల్లు జంక్షన్
సేవలుముంబై-చెన్నై రైలు మార్గం
ఆపరేషన్
ప్రారంభోత్సవం1871
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుమధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, నైరుతి రైల్వే
డిపో (లు)గుంతకల్లు
రోలింగ్ స్టాక్WDM-2, WDM-3A, WDM-3D, WDG-3A లోకోలు
సాంకేతికం
ట్రాక్ పొడవుప్రధాన మార్గం: 379 కి.మీ. (235 మై.)
శాఖా మార్గాలు:
షోలాపూర్–గదగ్: 301 కి.మీ. (187 మై.)
వాడి–సికిందరాబాద్: 185 కి.మీ. (115 మై.)
వికారాబాద్–బీదర్: 91 కి.మీ. (57 మై.)
ట్రాక్ గేజ్5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజి
ఆపరేటింగ్ వేగంప్రధాన మార్గం: up to 130 km/h
అత్యధిక ఎత్తుప్రధాన మార్గం:
షోలాపూర్ 461 మీటర్లు (1,512 అ.)
శాఖా మార్గం:
బీజాపూర్ 597 మీటర్లు (1,959 అ.)
మార్గ పటం
మూస:Solapur–Guntakal section

షోలాపూర్-గుంతకల్ సెక్షన్ (సోలాపూర్-గుంతకల్ లైన్ అని కూడా పిలుస్తారు) ముంబై-చెన్నై లైన్‌లో భాగం. ఇది మహారాష్ట్రలోని షోలాపూర్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు వరకు నడుస్తుంది.

చరిత్ర

[మార్చు]

గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే, ముంబై-చెన్నై లైన్‌లోని పూణే-రాయచూర్ సెక్టార్‌ను దశలవారీగా ప్రారంభించింది: పూణే నుండి బార్షి రోడ్ వరకు 1859లో, బార్షి రోడ్ నుండి మోహోల్ వరకు 1860లో, మోహోల్ నుండి షోలాపూర్ వరకు 1860లో ప్రారంభమయ్యాయి. 1865లో షోలాపూర్ నుంచి దక్షిణం వైపునకు వెళ్లే లైను పనులు ప్రారంభించి 1871లో రాయచూరు వరకు విస్తరించారు. ఆ విధంగా ఈ లైన్ మద్రాసు రైల్వే లైన్‌ను కలుసుకుని నేరుగా ముంబై-చెన్నై లింక్‌ను ఏర్పాటు చేసింది. [1]

మద్రాసు రైల్వే దాని ట్రంక్ మార్గాన్ని బేపూర్ / కడలుండి (కాలికట్ సమీపంలో) వరకు విస్తరించింది. అరక్కోణం నుండి వాయువ్య శాఖను 1861లో ప్రారంభించింది. బ్రాంచ్ లైన్ 1862లో రేణిగుంటకు, [2] 1871లో రాయిచూరు చేరుకుని, ఇక్కడ ముంబై నుండి గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే లైన్‌ను కలుసుకుంది. [1]

వాడి-సికింద్రాబాద్ మార్గాన్ని 1874లో నిజాం హామీ రాష్ట్ర రైల్వే నిర్మించింది. [1] మీటర్ గేజ్ గడగ్-హోత్గి సెక్షన్ను 1884లో దక్షిణ మహరాఠా రైల్వే ప్రారంభించింది. [1] [3] 2008లో దీన్ని బ్రాడ్ గేజ్‌గా మార్చారు. [4] విక్రాబాద్-బీదర్ బ్రాడ్ గేజ్ లైన్ను 1932 లో [5] ప్రారంభించారు. 58 కి.మీ. (36 మై.) పొడవైన రాయచూర్-గద్వాల రైల్వే ట్రాక్ 2013లో ప్రారంభమైంది. గద్వాల ధోన్-కాచిగూడ లైన్‌లో ఉంది. [6]

120 కి.మీ. (75 మై.) పొడవైన గుల్బర్గా-బీదర్ రైల్వే ట్రాక్ 2017 [7] ప్రారంభమైంది.



షెడ్లు

[మార్చు]

గుంతకల్ డీజిల్ లోకో షెడ్‌ను మీటర్-గేజ్ షెడ్‌గా ప్రారంభించారు. గుంతకల్, హుబ్లీ డివిజన్‌లలో గేజ్ మార్పిడి తర్వాత, 1995 లో దీన్ని బ్రాడ్-గేజ్ షెడ్‌గా మార్చారు. ఇక్కడ WDM-2, WDM-3A, WDM-3D, WDG-3A లోకోలు ఉన్నాయి. రాయిచూర్‌లో వ్యాగన్ నిర్వహణ కోసం సాధారణ ఓవర్‌హాల్ డిపో, గుంతకల్‌లో కోచి మెయింటెనెన్స్ డిపో ఉన్నాయి. [8] గుంతకల్లులో కొత్త ఎలక్ట్రిక్ షెడ్ నిర్మాణ దశలో ఉంది. గుత్తిలో డీజిల్ కమ్ ఎలక్ట్రిక్ షెడ్ ఉంది. ఇక్కడ దాదాపు 30 హై-పవర్ ఫ్రైట్ 3-ఫేజ్ WAG-9 లోకోలు ఉన్నాయి.

ప్రయాణీకుల కదలిక

[మార్చు]

ఈ మార్గంలో ఉన్న షోలాపూర్, భారతదేశంలో తొలి 100 టికెట్ బుకింగు స్టేషన్లలో ఒకటి.[9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Chronology of railways in India, Part 2 (1870–1899). "IR History: Early Days – II". IRFCA. Retrieved 3 December 2013.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "IR History: Early Days – I : Chronology of railways in India, Part 2 (1832–1865)". IRFCA. Retrieved 20 March 2014.
  3. "Sholapur District Gazetteer". Gazetteer department. Retrieved 9 December 2013.
  4. "Work completed on Gadag–Bagalkot gauge conversion". News on Projects.com, 8 December 2008. Retrieved 9 December 2013.
  5. "Chapter VII – Transport and Communications" (PDF). Railway lines opened for traffic in the state since 1861, page 290. Karnataka Government. Archived from the original (PDF) on 26 August 2013. Retrieved 19 December 2013.
  6. "Gadwal-Raichur rail line opening". The New Indian Express. 12 October 2013. Archived from the original on 18 డిసెంబరు 2013. Retrieved 9 December 2013.
  7. "Prime Minister dedicates New Bidar–Gulbarga Railway Line to the Nation; Flags off DEMU Train Service – RailNews Media India Ltd".
  8. "Sheds and Workshops". IRFCA. Retrieved 9 December 2013.
  9. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 10 May 2014. Retrieved 9 December 2013.