ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్
స్థానికతతెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
మార్గం
మొదలుసికింద్రాబాదు
ఆగే స్టేషనులు23
గమ్యంహౌరా
ప్రయాణ దూరం1,545 కి.మీ. (960 మై.)
సగటు ప్రయాణ సమయం25 గంటల 45 నిమిషాలు
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)12704 / 12703
సదుపాయాలు
శ్రేణులు1AC and 2AC combo coach, 1 AC 2-Tier Coach, 2 AC 3-Tier Coaches, 14 Sleeper Class Coaches, 1 Pantry Car, and 3 General Compartments and 2SLR's.
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes
చూడదగ్గ సదుపాయాలుLarge Windows
బ్యాగేజీ సదుపాయాలుBelow the Seats
సాంకేతికత
రోలింగ్ స్టాక్4
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in) (Broad Gauge)
వేగం110 km/h (68 mph) maximum 58 km/h (36 mph) (average with halts)
మార్గపటం

హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

విశేషాలు

[మార్చు]

ఈ రైలు ప్రతీరోజూ ప్రయాణించి ప్రముఖ ప్రదేశాలైన భువనేశ్వర్, బ్రహ్మపూర్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల గుండా పోతుంది. ఈ రైలు ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా వేగంగా ప్రయాణించే రైలు. సికింద్రాబాదు నుండి హౌరా ప్రయాణించే రైళ్ళతో పోలిస్తే ఈ రైలు నల్గొండ, గుంటూరు రైలు మార్గంలో ప్రయాణిస్తూ తక్కువ దూరంగల మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ రైలు సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య నడిచే అతి వేగవంతమైనది. విజయనగరం, శ్రీకాకుళం, పలాస పట్టణాలలోని అత్యధిక ప్రయాణీకులు ఈ రైలులో ప్రయాణాన్ని కోరుకుంటారు. హైదరాబాదు వెళ్ళేవారికి గమ్యస్థానాన్ని తెల్లవారే సరికి చేర్చడం వల్ల ఈ రైలు ప్రాముఖ్యాన్ని సంతరించుకుండి. ఈ రైలు ప్రతీ రోజూ ప్రయాణిస్తుంది. భారతదేశంలో ప్రయాణిస్తుమ్మ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, ఇతర సూపర్ ఫాస్టు రైళ్ళ కన్నా ఈ రైలు ప్రరిశుభ్రంగా ఉంటుంది.

ఈ రైలు హైదరాబాదు లోని ఫలక్‌నుమా పాలస్ పేరుతో పిలువబడుతుంది. ఫలక్‌నుమా అనేది పర్షియన్ నామము. దీని అర్థము స్వర్గం యొక్క పరావర్తకాలు. ఈ రైలు సుమారు 26 గంటల పాటు ప్రయాణించి 21 ప్రదేశాల్లో ఆగుతూ 1545 కి.మీ ప్రయాణిస్తుంది.

వేళలు

[మార్చు]

ఈ రైలు హౌరా జంక్షన్ నుండి 07:25 గంటలకు బయలుదేరి సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు తరువాత రోజు 09:35 గంటలకు చేరుతుంది. అదే విధంగా ఇది సికింద్రాబాదు రైల్వే స్టేషనులో ప్రతీ రోజూ 15:55 కు బయలుదేరి తరువార రోజు 17:45 కు హౌరా జంక్షన్ కు చేరుతుంది.

ఇంజను లంకెలు

[మార్చు]

ఈ రైలు సికింద్రాబాదు నుండి విశాఖపట్నం వరకు విద్యుత్ ఆధారిత లాలాగూడా WAP-7 లేదా విజయవాడ WAP-4 ఇంజనును ఉపయోగించుతుంటుంది. తదుపరి విశాఖపట్నం నుండి హౌరా స్టేషన్ వరకు విద్యుత్ ఆధారిత సంత్రాగచి WAP-4 లేదా హౌరా WAP-4 ఇంజనుతో ప్రయాణిస్తుంది.

చిత్రమాలిక

[మార్చు]

కొన్ని సంఘటనలు

[మార్చు]
  • 2012 అక్టోబరు 16 : ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో మంటలు, ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు.[2]
  • 2013 అక్టోబరు 16 : విజయవాడ నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్దకు రాగానే... రైలు బోగీలకు, ఇంజిన్ కు మధ్య లింక్ తెగిపోయింది. ఆ సమయంలో ఓ మలుపు వద్ద రైలు నెమ్మదిగా వెళుతోంది. దీంతో ఘోర ప్రమాదం తప్పింది.[3]
  • 2015 సెప్టెంబరు 22 : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా లోని హౌరా రైల్వేస్టేషన్ లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు.[4]

పెట్టెల అమరిక

[మార్చు]
Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
SLR GEN S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 S10 S11 S12 PC S13 B3 B2 B1 A1 HA1 GEN GEN SLRD

వివిధ స్టేషన్లలో రాక పోక వివరాలు

[మార్చు]
నం స్టేషన్ పేరు (నిలయ సంకేతము) రైలు ఆగమనం రైలు నిష్క్రమణ రైలు నిలుపు సమయం రోజు దూరం (కి.మీ)
1 Station Name (Code) Arrives Departs Stop time Day Distance
2 హౌరా జంక్షన్ (HWH) Starts 07:25 - 1 0 km
3 ఖరగ్‌పూర్ జంక్షన్ (KGP) 09:05 09:10 5 min 1 116 km
4 బాలాసోర్ (BLS) 10:35 10:37 2 min 1 234 km
5 భద్రక్ (BHC) 11:35 11:37 2 min 1 296 km
6 జాజ్పూర్ కే రోడ్ (JJKR) 12:05 12:06 1 min 1 340 km
7 కటక్ (CTC) 13:10 13:15 5 min 1 412 km
8 భుబనేశ్వర్ (BBS) 13:50 13:55 5 min 1 439 km
9 ఖుర్దా రోడ్డు జంక్షన్ (KUR) 14:25 14:40 15 min 1 458 km
10 బలుగన్ (BALU) 15:30 15:31 1 min 1 529 km
11 బరంపురం (BAM) 16:25 16:30 5 min 1 605 km
12 ఇచ్ఛాపురం (IPM) 16:53 16:54 1 min 1 629 km
13 పలాస (PSA) 18:03 18:05 2 min 1 679 km
14 శ్రీకాకుళం రోడ్డు (CHE) 19:00 19:02 2 min 1 752 km
15 విజయనగరం జంక్షన్ (VZM) 20:00 20:05 5 min 1 821 km
16 విశాఖపట్నం జంక్షన్ (VSKP) 21:10 21:30 20 min 1 882 km
17 సామర్లకోట జంక్షన్ (SLO) 23:36 23:38 2 min 1 1033 km
18 రాజమండ్రి (RJY) 00:29 00:31 2 min 2 1083 km
19 తాడేపల్లిగూడెం (TDD) 01:08 01:09 1 min 2 1125 km
20 ఏలూరు (EE) 01:41 01:42 1 min 2 1173 km
21 విజయవాడ జంక్షన్ (BZA) 03:20 03:35 15 min 2 1232 km
22 గుంటూరు జంక్షన్‌ (GNT) 04:20 04:25 5 min 2 1264 km
23 పిడుగురాళ్ల (PGRL) 05:28 05:29 1 min 2 1338 km
24 మిర్యాలగూడ (MRGA) 06:25 06:26 1 min 2 1398 km
25 నల్గొండ (NLDA) 07:00 07:01 1 min 2 1435 km
26 సికింద్రాబాద్ జంక్షన్ (SC) 09:35 Ends - 2 1545 km


మూలాలు

[మార్చు]

ఇతర లంకెలు

[మార్చు]