ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
WAP 7 loco hauling అమృత్‌సర్ - Bilaspur Chhattisgarh Express
Chhattisgarh Express (అమృత్‌సర్-Bilaspur) Route map
WDP 4B loco hauling అమృత్‌సర్ - Bilaspur Chhattisgarh Express

ఛత్తీస్ గఢ్ ఎక్స్ ప్రెస్ (18237/18238) అనేది బిలాస్ పూర్, అమృత్ సర్ ల మధ్య భారతీయ రైల్వే[1] నడిపిస్తున్న ప్రతిష్ఠాత్మక రైలు సర్వీసు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం పేరు మీద ఈ రైలును ప్రవేశ పెట్టారు. 1977లో దీన్ని తొలిసారిగా పరిచయం చేసినప్పుడు భోపాల్ _ బిలాస్ పూర్ ఛత్తీస్ గఢ్ ఆంచల్ ఎక్స్ ప్రెస్ పేరుతో బిలాస్ పూర్, హబీబ్ గంజ్ (భోపాల్) మధ్య ఈరైలు నడిచేది హబీబ్ గంజ్ లో కొత్తగా నిర్మించిన సబ్ అర్బన్ రైల్వే స్టేషను నుంచి బయలుదేరే మొట్ట మొదటి రైలుగా గుర్తింపు పొందింది. 1980వ సంవత్సరంలో భోపాల్ లోని ప్రధాన రైల్వే స్టేషను అయిన భోపాల్ జంక్షన్ వరకు దీన్ని పొడగించారు.

ఆ తర్వాత 1987వ సంవత్సరంలో ఈ రైలును మళ్లీ హజ్రత్ నిజాముద్దీన్ తో పాటు న్యూ ఢిల్లీ వరకు పొడగించారు. చివరగా1990 సంవత్సరంలో అమృత్ సర్ వరకు ఈ రైలును పొడగించారు.

మార్గం[మార్చు]

ఛత్తీస్ గఢ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రధానంగా ఏడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా మొత్తం 2011 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది.[2]

ఈ రైలు ఆగే ప్రధాన రైల్వే స్టేషన్ల వివరాలు:[3]

 • బిలాస్ పూర్ జంక్షన్‌
 • రాయ్‌పూర్ జంక్షన్
 • దుర్గ్
 • గోండియా జంక్షన్
 • నాగ్ పూర్
 • ఇటార్సీ జంక్షన్
 • భోపాల్ జంక్షన్
 • ఝాన్సీ జంక్షన్
 • గ్వాలియర్
 • ఆగ్రా కంటోన్మెంట్
 • మధుర జంక్షన్
 • హజ్రత్ నిజాముద్దీన్
 • గజియాబాద్
 • మీరుట్ సిటీ
 • ముజాఫర్ నగర్
 • షరన్ పూర్
 • అంబాలా కంటోన్మెంట్ జంక్షన్
 • లుదియానా జంక్షన్
 • జలంధర్ సిటీ నుంచి అమృత్ సర్

.

రైలు సమాచారం[మార్చు]

18238 (అమృతసర్ - బిలాస్పూర్) ఛత్తీస్‌గఢ్ ఎక్స్ ప్రెస్

ఛత్తీస్ గఢ్ ఎక్స్ ప్రెస్ అనేది ప్రధానంగా రోజువారిగా నడిచే ఎక్స్ ప్రెస్ రైలు. బిలాస్ పూర్ జంక్షన్ నుంచి బయలుదేరే రైలు 18237 నెంబరుతో నడుస్తుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో అమృత్ సర్ నుంచి రైలు 18238 నెంబరుతో నడుస్తుంటుంది. దీనిలో 24 బోగీలుంటాయి. విభాగాల వారిగా చూస్తే వరుసగా ఎల్.ఎల్.ఆర్, జీ 1, జీ 2, హెచ్.ఎ 1, ఏ 1, బీ 1, బీ 2, బీ 3, ఎస్ 12, ఎస్ 11, పీసీ, ఎస్ 10, ఎస్ 9, ఎస్ 8, ఎస్ 7, ఎస్ 6, ఎస్ 5, ఎస్ 5, ఎస్ 3, ఎస్ 2, ఎస్ 1, జీ 3, జీ 4; ఎస్.ఎల్.ఆర్, ఎస్పీలుగా విభజించారు.

ఈ రైలు బిలాస్ పూర్ నుంచి నాగ్ పూర్ మధ్య ఇటార్సీ షెడ్ యొక్క డబ్ల్యూ.ఎ.పి 4 ఇంజన్ కలిగి ఉంటుంది. ఆ తర్వాత నాగ్ పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ మధ్య అజ్నీషెడ్ యొక్క డబ్ల్యూ.ఎ.పి 7 ఉంటుంది. ఇక ఆ పై హజ్రత్ నిజాముద్దీన్ నుంచి అమృత్ సర్ వరకు తుగ్లకాబాద్ యొక్క డబ్ల్యూడీపీ 4బి అందుబాటులో ఉంటుంది.

చింద్వారా- అమృత్ సర్ స్లిప్ సర్వీస్[మార్చు]

భారతీయ రైల్వేలు డబ్ల్యుఎపి-7 తరగతి విద్యుత్ లోకోమోటివ్

మధ్య ప్రదేశ్ లోని చింద్వారా ప్రాంత ప్రయాణీకుల కోసం ఈ స్లి ప్ సర్వీసును చింద్వారా _ అమృత్ సర్ స్లిప్ సర్వీస్ పేరుతో ఛత్తీస్ గఢ్ _బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ కు అనుసంధానించారు. 1999 నుంచి స్లిప్ సేవలు ఇక్కడి ప్రయాణికులకు అందుతున్నాయి.

రైలు పొడగింపు చరిత్ర[మార్చు]

 • తొలిసారిగా ఈ రైలును 1977లో హబీబ్ గంజ్ _ బిలాస్ పూర్ ఛత్తీస్ గఢ్ ఆంచల్ ఎక్స్ ప్రెస్ పేరుతో భోపాల్ హబీబ్ గండ్, బిలాస్ పూర్ జంక్షన్ల మధ్య ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ రైల్లో ఒక ఎసీ 2 టైర్, మూడు ఏసీ 3 టైర్ బోగీలతో పాటు 10 స్లీపర్ క్లాస్ బోగీలు, 6 సాధారణ బోగీలు, 2 ఎస్.ఎల్. ఆర్ లు ఉండేవి.
 • 1980 సంవత్సరంలో భోపాల్-బిలాస్ పూర్ ఛత్తీస్ గఢ్ ఆంఛల్ ఎక్స్ ప్రెస్ పేరుతోనే దీనిని భోపాల్ లోని ప్రధాన రైల్వే స్టేషను వరకు పొడగించారు.
 • 1987 _ 1988 సంవత్సరంలో ఈ రైలు ప్యాంట్రీ కారు పొందడమే కాకుండా ఢిల్లీకి చెందిన హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను వరకు విస్తరించారు. దీంతో అప్పటికే నడుస్తున్న 1225/1226 నెంబర్లు గల భోపాల్-హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు. దీని స్థానంలోనే బిలాస్ పూర్ –భోపాల్ ఛత్తీస్ గఢ్ ఆంచల్ ఎక్స్ ప్రెస్ ను హజ్రత్ నిజాముద్దీన్ వరకు పొడగించారు. అప్పటి నుంచి ఛత్తీస్ గఢ్ ఎక్స్ ప్రెస్ పేరుతో ఈ రైలు స్వతంత్రంగా నడుపబడుతోంది.
 • 1997 వ సంవత్సరంలో ఛత్తీస్ గఢ్ ఎక్స్ ప్రెస్ రైలును అమృత సర్ జంక్షన్ వరకు విస్తరించారు.[4]
 • 1999 వ సంవత్సరంలో ఈ రైలుకు మధ్యప్రదేశ్ లోని చింద్వారా నుంచి స్లిప్ బోగీల అనుసంధానం మొదలైంది.

బయటి లింకులు[మార్చు]

indiarailinfo.com-train-323

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "Welcome To Indian Rail". Indianrail.gov.in.
 2. "Running Status-18237". Railenquiry.in.
 3. "Chhattisgarh Express-18237". Cleartrip.com. Archived from the original on 2014-07-07. Retrieved 2018-05-18.
 4. "Chhattisgarh Express-18238". Indiarailinfo.com.