మాల్వా ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాల్వా ఎక్స్ ప్రెస్
మాల్వా ఎక్స్ ప్రెస్
సారాంశం
రైలు వర్గంSuperfast
స్థితిOperating
ప్రస్తుతం నడిపేవారుIndian Railways
మార్గం
మొదలుJammu Tawi
ఆగే స్టేషనులు41
గమ్యంIndore Junction
ప్రయాణ దూరం1,540 కిలోమీటర్లు (960 మై.)
సగటు ప్రయాణ సమయం27 hrs 50 mins
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)12919 / 12920
సదుపాయాలు
శ్రేణులుAC 2 Tier, AC 3 Tier, Sleeper Class, Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుAvailable
పడుకునేందుకు సదుపాయాలుAvailable
ఆహార సదుపాయాలుAvailable (Paid)
బ్యాగేజీ సదుపాయాలుAvailable
సాంకేతికత
పట్టాల గేజ్Broad Gauge
వేగం62.7 kilometres per hour (39.0 mph) Avg.
మార్గపటం

మాల్వా ఎక్స్ ప్రెస్ అనేది భారతీయ రైల్వేస్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసు. భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన ఇండోర్ నగరంలోని ఇండోర్ జంక్షన్ బి.జి. రైల్వే స్టేషన్ నుంచి జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్ముతావి వరకు ఈ రైలు నడుస్తుంటుంది.

చరిత్ర

[మార్చు]

నిజానికి ఈ రైలును ప్రవేశపెట్టిన సమయంలో ఇండోర్, న్యూఢిల్లీ మధ్య నడిచేది. ఆ తర్వాత కాలంలో దీనిని జమ్ముతావి వరకు పొడగించారు. భారత విదేశాంగ విధానంలో భాగంగా భారత్ నుంచి పాకిస్థాన్ దేశాన్ని చేరుకున్న మొదటి భారతీయ రైలుగా ఇది గుర్తింపు పొందింది. కొంతకాలం ఇండోర్ – లాహోర్ స్పెషల్ పేరుతో పాకిస్థాన్ లోని లాహోర్ వరకు ఈ రైలును నడిపించారు. కానీ దీనిపై పలు వివాదాలు రావడంతో 55 రోజుల తర్వాత 1985, అక్టోబరు 22 ఈ రైలును ఉపసంహరించారు. ఇండోర్ - లాహోర్ మధ్య నడిచిన కాలంలో వారానికి ఓ సారి ఈ రైలు వెళ్లేది. ఇరు మార్గాల్లోనూ ప్రతి శుక్రవారం రైలు బయలుదేరేది. ఐ.ఎస్.ఓ ధ్రువీకరణ పత్రం పొందిన భారతీయ, మధ్యప్రదేశ్ రైళ్లలో ఇది ఐదో రైలు కావడం విశేషం. దీని తర్వాత భోపాల్ ఎక్స్ ప్రెస్, రేవాంచల్ ఎక్స్ ప్రెస్, అహిల్యానగరి ఎక్స్ ప్రెస్ కూడా ఈ జాబితాలో చేరాయి.[1]

జోను , డివిజను

[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య

[మార్చు]

రైలు నంబరు: 12920

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

[మార్చు]

ఈ రైలు వారానికి రెండు రోజులు నడుస్తుంది.

రైళ్ల నంబర్లు

[మార్చు]

మాల్వా ఎక్స్ ప్రెస్ రైలు దిగవ వైపు ప్రయాణంలో (డౌన్ సర్వీసు) ఇండోర్ నుంచి 12919 నెంబరుతో నడుస్తుంటుంది. అదేవిధంగా పై వైపు (అప్ సర్వీస్) జమ్ముతావి నుంచి 12920 నెంబరుతో బయలుదేరుతుంది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఉన్న మాల్వా అనే ప్రదేశం పేరుతో ఈ రైలు గుర్తింపు పొందింది.[2]

రావడం , బయలు దేరడం

[మార్చు]

2010 ఆరంభంలో రైల్వే సమయ పట్టిక ప్రకారం జమ్ముతావి నుంచి ఈ రైలు ఉదయం 09:00 గంటలకు బయలుదేరి ఇండోర్ జంక్షన్ కు మధ్యాహ్నం 12:50 కు చేరుకునేది. ఈ రోజుల్లో ఈ రైలు 27 గంటల 50 నిమిషాల సమయాన్ని తీసుకునేది. (దీనిలో 3గంటల 1 నిమిషం పాటు 39 మధ్యంతర రైల్వే స్టేషన్లలో ఆగడానికి పట్టే కాలం సహా). మొత్తం 1540 కిలోమీటర్ల ప్రయాణంలో ఈ రైలు సగటు వేగం గంటకు 55.3 కిలో మీటర్లు. రైలు ఆగిన సమయాన్ని మినహాయిస్తే.. ఈ రైలు వేగం గంటకు 62.1 కిలో మీటర్లుగా చెప్పుకోవచ్చు.[3]

తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఇండోర్ జంక్షన్ ను వదిలి మధ్యాహ్నం 12:25 గంటలకు బయలుదేరి... మరునాడు సాయంత్రం 04:05 గంటలకు జమ్ముతావి చేరుకుంటుంది. ఈ ప్రయాణం మొత్తం 27 గంటల 40 నిమిషాలు పాటు సాగుతుంది. ఈ మొత్తం సమయంలో 2 గంటల 56 నిమిషాల పాటు మార్గ మధ్యంలోని వివిధ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రయాణంలో దీని సగటు వేగం గంటకు 56 కిలో మీటర్లు కాగ, స్టేషన్లలో ఆగే సమయాన్ని మినహాయిస్తే సగటు వేగం గంటకు 62.7 కిలో మీటర్లు.

మార్గం , ఆగు స్థలాలు

[మార్చు]

ఈ రైలు తన ప్రయాణంలో వివిధ మార్గాల్లో ప్రయాణం చేస్తుంది. వయా దేవాస్ - ఉజ్జాన్, ఉజ్జాన్ - భోపాల్, భోపాల్ - బీనా, బీనా – ఝాన్సీ - గ్వాలియర్, గ్వాలియర్ - ఆగ్రా, ఆగ్రా - మథుర, మథుర - న్యూఢిల్లీ, ఢిల్లీ - అమృత్ సర్ మార్గాల గుండా ఈ రైలు ప్రయాణం చేస్తుంటుంది. ఈ రైలు మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, న్యూఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్ వంటి 7 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ రైలు భోపాల్ జంక్షన్, ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్ జంక్షన్, మథుర జంక్షన్, న్యూఢిల్లీ, లుథియానా జంక్షన్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.[4]

బోగీల విభజన

[మార్చు]

సాధారణంగా మాల్వా ఎక్స్ ప్రెస్ రైలులో 24 బోగీలుంటాయి. వీటిలో.

  • 15 స్పీపర్ బోగీలు
  • 2 ఏసీ- 2 వ తరగతి బోగీలు
  • 2 ఏసీ- 3 వ తరగతి బోగీలు
  • 4 సాధారణ బోగీలు
  • 1 ప్యాంట్రీ కార్ ఉంటాయి.
మాల్వా ఎక్స్‌ప్రెస్

ఇండోర్ నుండి బయలుదేరు ఇతర రైళ్ళు

[మార్చు]

ఇండోర్ నుండి బయలుదేరు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.

  1. ఇండోర్ - అజ్మీర్ (ఎంజి) ఎక్స్‌ప్రెస్
  2. ఇండోర్ - అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
  3. ఇండోర్ - అమృత్సర్ ఎక్స్‌ప్రెస్
  4. ఇండోర్ - ఉజ్జయినీ ప్యాసింజర్
  5. ఇండోర్ - కొచ్చువెలి సూపర్‌ఫాస్ట్ (తత్కాల్ స్పెషల్) ఎక్స్‌ప్రెస్
  6. ఇండోర్ - కొచ్చువెలి సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
  7. ఇండోర్ - కోటా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  8. ఇండోర్ - కోలకతా స్పెషల్ ఎక్స్‌ప్రెస్
  9. ఇండోర్ - గ్వాలియర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  10. ఇండోర్ - గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్
  11. ఇండోర్ - చండీగఢ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
  12. ఇండోర్ - చింద్వారా పంచ్‌వ్యాలీ ఫాస్ట్ ప్యాసింజర్
  13. ఇండోర్ - చెన్నై అహల్య నగరి ఎక్స్‌ప్రెస్
  14. ఇండోర్ - చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  15. ఇండోర్ - జబల్పూర్ ఎక్స్‌ప్రెస్
  16. ఇండోర్ - జబల్పూర్ ఓవర్నైట్ ఎక్స్‌ప్రెస్
  17. ఇండోర్ - జబల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  18. ఇండోర్ - జమ్ము తావి వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  19. ఇండోర్ - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  20. ఇండోర్ - జోధ్పూర్ రణతంభోర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  21. ఇండోర్ - జోధ్పూర్ రాన్థంభోర్ ఎక్స్‌ప్రెస్
  22. ఇండోర్ - తిరువనంతపురం అహల్యా నగరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  23. ఇండోర్ - తిరువనంతపురం అహల్యానగరి ఎక్స్‌ప్రెస్
  24. ఇండోర్ - నగ్డా ప్యాసింజర్
  25. ఇండోర్ - నాగపూరు త్రిశతాబ్ది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  26. ఇండోర్ - బారెల్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్
  27. ఇండోర్ - భింద్ ఎక్స్‌ప్రెస్
  28. ఇండోర్ - భోపాల్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
  29. ఇండోర్ - భోపాల్ ప్యాసింజర్
  30. ఇండోర్ - భోపాల్ ఫాస్ట్ ప్యాసింజర్
  31. ఇండోర్ - భోపాల్ హబీబ్గంజ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  32. ఇండోర్ - భోపాల్ హబీబ్గంజ్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
  33. ఇండోర్ - మక్సి ప్యాసింజర్
  34. ఇండోర్ - ముంబై అవంతికా ఎక్స్‌ప్రెస్
  35. ఇండోర్ - ముంబై సెంట్రల్ ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
  36. ఇండోర్ - ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ అవంతికా ఎక్స్‌ప్రెస్
  37. ఇండోర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
  38. ఇండోర్ - రత్లాం డెమో
  39. ఇండోర్ - రత్లాం ప్యాసింజర్
  40. ఇండోర్ - రాజేంద్ర నగర్ (వయా. సుల్తాన్పూర్) ఎక్స్‌ప్రెస్
  41. ఇండోర్ - రాజేంద్రనగర్ (వయా ఫైజాబాద్ ) ఎక్స్‌ప్రెస్
  42. ఇండోర్ - రాజేంద్రనగర్ (వయా సుల్తాన్పూర్) ఎక్స్‌ప్రెస్
  43. ఇండోర్ - రాజేంద్రనగర్ పాట్నా స్పెషల్ ఎక్స్‌ప్రెస్
  44. ఇండోర్ - రేవా ఎక్స్‌ప్రెస్
  45. ఇండోర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  46. ఇండోర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  47. ఇండోర్ జంక్షన్ - ఉదయపూర్ ఎక్స్‌ప్రెస్
  48. ఇండోర్ జంక్షన్ - జైపూర్ జంక్షన్ లింక్ ఎక్స్‌ప్రెస్
  49. ఇండోర్ – ఆగ్రా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
మాల్వా ఎక్స్‌ప్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Malwa Express, 12919 - Indore Junction (BG) To Jammu Tawi". prokerala.com.
  2. "Malwa Express". indiarailinfo.com.
  3. "Malwa Express". Cleartrip. Archived from the original on 2014-05-27.
  4. "About 12920/19 Malwa Express". Indian Rail Info by TravelKhana.

బయటి లింకులు

[మార్చు]